Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagarjuna

ఈ సంచికలో >> సినిమా >>

అన్నింటా రాకెట్‌లా దూసుకెళ్తున్న హీరోయిన్‌

rocket
ఇటీవల విడుదలైన 'శ్రీమంతుడు' సినిమా విజయంతో తెలుగులో ఎక్కడ విన్నా ఆమె పేరే విన్పిస్తోంది. ఆమె ఇంకెవరో కాదు అందాల శృతిహాసన్‌. మొదట్లో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌ టాక్‌తో ఐరన్‌ లెగ్‌ గాళ్‌గా ముద్ర పడిపోయింది ఈ ముద్దుగుమ్మ మీద. అయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్న శృతిహాసన్‌కు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 'గబ్బర్‌ సింగ్‌' సినిమా రూపంలో విజయం వరించింది. అంతే ఇకప్పటి నుండీ వరుస విజయాలు ఆమెను వరించాయి. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళ్‌, హిందీల్లో కూడా ఆమె తన హవా కొనసాగిస్తూనే ఉంది.

మెగా ఫ్యామిలీ అందించిన వరుస విజయాలతో ఆమె ఇప్పుడు లక్కీ గాళ్‌గా ఇటు టాలీవుడ్‌లో, అటు కోలీవుడ్‌లో తాజాగా బాలీవుడ్‌లో కూడా సూపర్‌ హిట్స్‌తో రేసుగుర్రంలా దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన 'గబ్బరియన'్‌, 'వెల్‌కమ్‌ బ్యాక్‌' సినిమాలు వరుసగా ఘన విజయం సాధించి బాలీవుడ్‌లో శృతి పేరు మార్మోగేలా చేశాయి. మొత్తానికి తండ్రికి తగ్గ కూతురుగా, తన సత్తా చాటుకుంటూ ఫుల్‌ ఫామస్‌ అయిపోయింది శృతి హాసన్‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ లక్కీ మస్కట్‌గా శృతి మారిపోయింది. 
మరిన్ని సినిమా కబుర్లు
raviteja act in harish shankar