Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raviteja act in harish shankar

ఈ సంచికలో >> సినిమా >>

సంక్రాంతికే నందమూరి సందడి

namdamoori
వరుసగా పెద్ద హీరోలు, వారి వారి వారసుల సినిమాలతో సంవత్సరాంతం కలకలలాడబోతోంది. ఒక పక్క మెగా ఫ్యామిలీతో, మరో పక్క అక్కినేని ఫ్యామిలీతో అభిమానులకు దసరా, దీపావళిలతో సినిమా పండుగ తోడయ్యి మజా చేయనుంది. అయితే ఈ బరిలో నందమూరి ఫ్యామిలీ ఉన్నట్లుగా అనిపించడంలేదు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'డిక్టేటర్‌' సినిమా విడుదల డేట్‌ ఖరారు కాలేదు. షూటింగ్‌లో బల్గేరియాలో బిజీగా ఉంది. ఇకపోతే జూనియర్‌ హీరోగా, సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా 'నాన్నకు ప్రేమతో' సినిమా సంక్రాంతి కానుకగా విడదల చేయాలనే యోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. అదే కనుక ఖరారైతే ఈ సంవత్సరాంతం లో నందమూరి అభిమానులకు ఒకింత నిరాశే అని చెప్పాలి.

సంక్రాంతి బరిలో ముందుగా పోటీపడేది మాత్రం ఈ బాబాయ్‌, అబ్బాయ్‌లే. సంక్రాంతికి వారం రోజుల ముందే ఎన్టీఆర్‌ సినిమాతో స్వాగతం పలకనుంది కొత్త సంవత్సరం. ఆ తరువాత వారంలో బాలయ్య సినిమా రిలీజ్‌ కానుంది. కాబట్టి, నందమూరి అభిమానులు దసరాకి నిరాశపడినా సంక్రాంతి పండుగని మాత్రం ముందుగానే ఎంజాయ్‌ చేసేయ్యొచ్చు. 
మరిన్ని సినిమా కబుర్లు
dasara