Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
namdamoori

ఈ సంచికలో >> సినిమా >>

దసరా మెగా పండుగే

dasara
 
రామ్‌ చరణ్‌ హీరోగా వస్తున్న సినిమా 'బ్రూస్‌లీ'. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా ఒక మెరుపు మెరిసే అవకాశం ఉందని గుసగుసలు విన్పిస్తున్నాయి. చాలా గ్యాప్‌ తర్వాత చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రానికి ఇలా ఫ్యామిలీ స్టార్లంతా కలిసి ఆహ్వానం పలికేందుకు సిద్దపడ్డట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం అక్కినేని ప్యామిలీ హీరోలంతా 'మనం' సినిమా ద్వారా ఒక్కసారిగా తెర మీద కనిపించి అభిమానులకు మరిచిపోలేని హాయిని మిగిల్చారు.

ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోలంతా తెరపై కనిపిపంచి మెగా ఆనందాన్ని అభిమానులకు కానుకగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకు చరణ్‌ నటిస్తున్న 'బ్రూస్‌లీ' సినిమా వేదిక కానుంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని చిత్ర బృందం సమిష్టిగా పని చేస్తున్నారు. అక్టోబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కింగ్‌' సినిమాలోని ఓ పాటలు చాలామంది హీరోయిన్లు కన్పించి కనువిందు చేసినట్టే మెగా హీరోలంతా ఒక్కటై 'బ్రూస్‌లీ' సినిమాలో అంతకన్నా వారి అభిమానులకు పెద్ద పండుగ ఇంకేమైనా ఉంటుందా? 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam