Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ఇలాంటి సినిమాలు ఆడితే... ఆ కిక్కే వేరు!  - నితిన్‌
 
అప్ అండ్ డౌన్స్ అంద‌రికీ ఉంటాయి. అయితే నితిన్ చూసిన‌న్ని అప్స్‌... ప‌డిన‌న్ని డౌన్స్ యంగ్ హీరోల్లో ఎవ్వ‌రూ చూడ‌రేమో..?
జ‌యం, దిల్‌, సై... ఇలా వ‌రుస హిట్ల‌తో హ్యాట్రిక్ కొట్టాడు.
అక్క‌డి నుంచి ఫ్లాపులు మొద‌ల‌య్యాడు. స‌రిగ్గా డ‌జ‌ను ఫ్లాపుల త‌ర‌వాత‌, నితిన్ ప‌ని అయిపోయింది అనుకొంటున్న త‌రుణంలో ఇష్క్ తో మ‌ళ్లీ ట్రాక్ ఎక్కాడు. గుండెజారి గల్లంత‌య్యిందే, హార్ట్ ఎటాక్ సినిమాల‌తో నితిన్ టాప్ లిస్టులోకి చేరిపోయాడు. ఇప్పుడు ఏకంగా త్రివిక్ర‌మ్ సినిమాలో హీరో అయిపోయాడు. హిట్స్ రుచి, ఫ్లాప్స్ ఇచ్చే షాక్ రెండూ తెలిసినోడు కాబ‌ట్టి.. ఇప్పుడు దేన్న‌యినా ఎదుర్కొనే ధైర్యం వ‌చ్చిసింది. అందుకే కూల్‌గా త‌న ప‌ని తాను చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నితిన్ తాజా చిత్రం కొరియ‌ర్  బోయ్ క‌ల్యాణ్‌.. వినాయ‌క చ‌వితికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా నితిన్‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* హాయ్ కొరియ‌ర్ బోయ్‌..
- హాయండీ..

* క‌ల్యాణ్ అంటే ప‌వ‌న్ క‌ల్యాణా?
- ఈ సినిమాలో న‌న్నందకూ పీకే అనిపిలుస్తారు. నేనూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌లా బిల్డ‌ప్ ఇస్తా. కానీ ప‌నిలేని క‌ల్యాణ్‌ని.. (న‌వ్వుతూ) 

*కొరియ‌ర్ లో ఏముంది?
- ల‌వ్‌, యాక్ష‌న్‌, థ్రిల్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎవ్రిథింగ్‌. వీటితో పాటు ఓ కొత్త కాన్సెప్ట్‌. ఇది వ‌ర‌కు ఎప్పుడూ ఎవ‌రూ చెప్ప‌ని క‌థ‌. కొత్త క‌థ‌ల‌న‌గానే.. అదేదో డార్క్ సినిమాలా ఉంటాయేమో అనుకొంటారు. కానీ.. ఇది రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలానే కనిపిస్తూ.. కొత్త పంథాలో సాగుతుంది.


* నితిన్‌కి ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ రాబోతోంది?
- ఇమేజ్‌ల గురించి ఆలోచించి తీసిన సినిమా కాదిది. క‌థ విన‌గానే నేను చాలా ఎగ్జ‌యిట్ అయ్యా. అదే ఎగ్జ‌యిట్ మెంట్ ఆడియ‌న్స్‌కి క‌లిగేలా సినిమా చేయాలి అనిపించింది. కొత్త జోన‌ర్‌లో సాగే ఇలాంటి సినిమాలు ఆడితే... ఆ కిక్ వేరుగా ఉంటుంది. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కొత్త క‌థ‌లు ఎంచుకోవ‌డానికి బూస్ట్‌లా ప‌నిచేస్తుంది.

* ఈ క‌థ ఇద్ద‌రు ముగ్గురు హీరోలు వ‌ద్ద‌న్నార‌ట‌.. ఆ త‌ర‌వాతే మీ దగ్గ‌ర‌కు వ‌చ్చింద‌ట‌..
- అవునండీ. కొన్ని క‌థ‌లు కొంత‌మందికి న‌చ్చుతాయి.. మ‌రికొంత‌మందికి న‌చ్చ‌వు. మ‌న‌కు న‌చ్చిన క‌థ ఆడియ‌న్‌కి న‌చ్చిందా, లేదా అనేదే ముఖ్యం. నా జ‌డ్స్‌మెంట్ త‌ప్పో, ఈ క‌థ వ‌ద్ద‌నుకొన్న‌వాళ్ల ఆలోచ‌న త‌ప్పో... ప్రేక్ష‌కులే చెప్పాలి.

* నిర్మాత‌గా గౌత‌మ్ మీన‌న్ పేరు క‌నిపిస్తోంది.. సినిమాలోనూ ఆయ‌న శైలి ఉంటుందా?
- లేదండీ. ఇది నూటికి నూరుశాతం ప్రేమ్ సాయి క‌థ‌. త‌న శైలిలోనే తీశాడు. కొత్త ద‌ర్శ‌కుడు క‌దా.. అనే భ‌యం ముందు ఉండేది. కానీ తొలి రోజే ప్రేమ్ సాయిపై న‌మ్మ‌కం క‌లిగింది. సెట్లో తానెప్పుడూ నాకు కొత్త ద‌ర్శ‌కుడిలా క‌నిపించ‌లేదు. గౌత‌మ్‌మీన‌న్ సినిమాల్లోని స‌న్నివేశాల్లో స‌హ‌జ‌త్వం క‌నిపిస్తుంది. ఆ మార్క్ ఇందులోనూ ఉంటుంది.

* తెలుగు, త‌మిళ భాష‌ల్లో తీశారు క‌దా, త‌మిళంలోనూ మీరే న‌టించొచ్చు క‌దా..?
- ఈ క‌థ ముందు తమిళంలోనే తీద్దానుకొన్నారు. జ‌యం ర‌వి ఓకే చేశాకే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. నాకూ త‌మిళంలో న‌టించాల‌ని ఉంది. త్వ‌ర‌లో గౌత‌మ్ మీన‌న్‌తో ఓ సినిమా చేస్తున్నా. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఆ సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

* సినిమా విడుద‌ల ఆల‌స్య‌మైంది.. బాధ‌ప‌డ‌లేదా?
- మంచి సినిమా లేట‌వుతుంటే బాధగానే ఉంటుంది. అయితే ఇందులో నా ప్ర‌మేయం ఏం లేదు. తెలుగు వెర్ష‌న్ యేడాది క్రిత‌మే రెడీ అయ్యింది. అయితే త‌మిళంలోనే స‌మ‌స్య వ‌చ్చింది. అక్క‌డ హీరో డేట్లు స‌ర్దుబాటు కాక‌.. ఈ సినిమా ఆల‌స్య‌మైంది.

* వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర స‌రైన ఫ‌లితాన్ని అందుకోలేదు..
- నిజ‌మే. కొన్ని ఐడియాలు అవుట్‌డేటెడ్ అయిపోతుంటాయి. కానీ ఈ క‌థ అలాంటిది కాదు. నిజానికి రెండు మూడేళ్ల క్రితం ఈ సినిమా విడుద‌లైపోయి ఉంటే.. ఆ ఐడియా ఎవ్వ‌రికీ అర్థ‌మ‌య్యేది కాదేమో. ఇప్పుడు మేం ఈ  క‌థ‌లో చెబుతున్న పాయింట్‌పై చాలామందికి అవ‌గాహ‌న పెరిగింది. కాబ‌ట్టి.. మా ఆలోచ‌న‌లు అర్థం చేసుకొంటార‌నిపిస్తుంది. కొన్ని ఐడియాలు ఎప్ప‌టికీ కొత్త‌గా ఉంటాయి. అలాంటి క‌థే.. కొరియ‌ర్ బోయ్‌.

* ఈ సినిమా ఆల‌స్య‌మ‌వుతున్న‌ప్పుడు మీరే భుజాన వేసుకొని విడుద‌ల చేయొచ్చు క‌దా?
- ఈ సినిమా మొద‌లైన‌ప్పుడే నిర్మాణ భాగ‌స్వామిగా చేర‌తా అని చెప్పా. కానీ గౌత‌మ్ మీన‌న్ మాత్రం నాకు వాటా ఇవ్వ‌లేదు.. (న‌వ్వుతూ). ఈ క‌థ‌పై ఆయ‌న‌కు అంత న‌మ్మ‌కం. లేదంటే మా సంస్థ‌లోనే ఈ సినిమా చేయాల్సింది.

* అఖిల్ సినిమాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు క‌దా..?  ఆ సినిమా సంగ‌తులేంటి?
- అనుకొన్న స‌మ‌యంలో అన్నీ అనుకొన్న‌ట్టుగా జ‌రుగుతున్నాయి. త‌ప్ప‌కుండా అక్కినేని ఫ్యాన్స్‌కి ఓ ఫీస్ట్‌లా ఉంటుంది సినిమా. వినాయ‌క్ గారు ఎప్పుడూ ఇలాంటి క‌థ ట్రై చేయ‌లేదు. ఆయ‌న‌కూ ఇదో కొత్త జోన‌ర్‌.

* బ‌డ్జెట్ బాగా పెరిగిపోయింద‌న్న టాక్ వినిపిస్తోంది?
- ముందు చెప్పిన బ‌డ్జెట్‌లోనే సినిమా తీస్తున్నాం. చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఇది. ఆ  క‌థ‌కు అంత బ‌డ్జెట్ పెట్టాల్సిందే.

* అస‌లు అఖిల్‌కీ మీకూ ఫ్రెండ్ షిప్ ఎప్ప‌టిది?
- సీసీఎల్ సంద‌ర్భంగా మా ప‌రిచ‌యం మొద‌లైంది. మా ఇద్ద‌రి ఆలోచ‌న‌లూ ఒకేలా ఉంటాయి. కాబ‌ట్టి తొంద‌ర‌గా క‌లిసిపోయాం. మ‌నంలో ఎప్పుడైతే అఖిల్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ చూశానో అప్పుడే త‌న‌తో సినిమా చేయాల‌నిపించింది.

* నిర్మాత‌గా బ‌య‌ట హీరోల‌తో ఇలా సినిమాలు తీస్తూనే ఉంటారా?
- అమ్మో.. క‌ష్ట‌మండీ. అంద‌రినీ మానేజ్ చేసుకొంటూ ఓ సినిమాని పూర్తి చేయ‌డం చాలా క‌ష్టం. కొంత గ్యాప్ తీసుకొన్నాక‌.. అప్పుడు ఆలోచిస్తా.

* ప‌వ‌న్‌తో సినిమా చేసే అవ‌కాశం వ‌స్తే.
- అంత‌కంటే అదృష్ట‌మా?   నా సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టి ఆ ప్రాజెక్టు టేక‌ప్ చేస్తా. 

* త్రివిక్ర‌మ్ సినిమా సంగ‌తులేంటి?
- చాలా మంచి క‌థ‌. క్లీన్ ల‌వ్ స్టోరీ.

* లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటున్నారు..
- అదేం లేదండీ.. హీరో పై సాగే సినిమానే.

* త్రివిక్రమ్ సినిమా అన‌గానే క‌థ కూడా విన‌కుండా సినిమా ఒప్పుకొన్నారా?
- నేను క‌థ విన‌ను అన్నాస‌రే ఆయ‌న వ‌దిలిపెట్ట‌రు క‌దా, నాలుగు సార్లు క‌థ వినిపించారు. అంద‌రికీ ఒకే అయిన త‌ర‌వాత‌.. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది.

* ఒకే... ఆల్ ది బెస్ట్ ఫ‌ర్ కొరియ‌ర్ బోయ్ క‌ల్యాణ్‌
- థ్యాంక్యూ వెరీమ‌చ్‌.

- కాత్యాయని 
మరిన్ని సినిమా కబుర్లు
movie review