Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mahesh brahmotsavam started

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయమా..?

Is NTR duel role?
సుకుమార్‌ దర్శత్వంలో వస్తున్న ఎన్టీఆర్‌ చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్పెషల్‌గా గడ్డంతో డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా కొత్త లుక్‌ని 'నాన్నకు ప్రేమతో' టీమ్‌ టైటిల్‌తో సహా రిలీజ్‌ చేశారు. అయితే ఈ సినిమాలో ఈ గెటప్‌లోనే కాకుండా మరో గెటప్‌ కూడా ఉందట. అది కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. 

గతంలో ఎన్టీఆర్‌ 'ఆంధ్రావాలా', 'అదుర్స్‌' సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసి అలరించాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా సెకండ్‌ క్యారెక్టర్‌ ఉందనీ గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని చిత్ర బృందం సస్పెన్స్‌గా ఉంచతోంది. ప్రస్తుతం లండన్‌లో బిజీగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన అందచందాలతో ఆడి పాడనుంది. 
మరిన్ని సినిమా కబుర్లు
kamal cheekatirajyam