Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

మెగా ఛాన్స్‌ తనకే దక్కిందంటున్న శ్రీనువైట్ల

srinu vaitla got mega  chance
శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న రాం చరణ్‌ కొత్త సినిమా 'బ్రూస్‌లీ'. శ్రీను వైట్ల అంటేనే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు గుర్తొచ్చేస్తాయి. 'ఢీ' సినిమాతో మొట్టమొదటిసారిగా కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫార్ములాను తెలుగు సినిమాకి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆ తరువాత చాలా సినిమాలు ఇదే తరహా ఫార్ములాను అనుసరించి హిట్‌ కొట్టిన దర్శకుడు శ్రీనువైట్ల. రాంచరణ్‌ హీరోగా వస్తున్న 'బ్రూస్‌లీ' సినిమాతో మరో కొత్త ఫార్ములాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం శ్రీను వైట్ల చేస్తున్నాడట.

ఈ సినిమాలో చిరంజీవి పాత్రను ఆయన మలచిన తీరు ప్రత్యేకంగా ఉంటుందట. అంతేకాదు ఈ సినిమాతోనే చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తుండడం కూడా మరో విశేషం. చిరంజీవి తన 150వ సినిమాకి డైరెక్టర్‌గా ఎవర్ని సెలెక్ట్‌ చేసుకోవాలా? అని ఎదురు చూస్తున్న తరుణంలో సైలెంట్‌గా ఆ ఛాన్స్‌ని శ్రీనువైట్ల కొట్టేయ్యడం, ఈ ఛాన్స్‌ మిస్సయిన డైరెక్టర్స్‌కు కొంచెం అసూయగా కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్‌ విన్పిస్తోంది. టోటల్‌గా ఈ సినిమా ప్రస్తుత ఎంటర్‌టైన్‌మెంట్‌కి భిన్నంగా, అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వచ్చే నెల 16న విడుదలకు సిద్ధంగా ఉంది. 
మరిన్ని సినిమా కబుర్లు
sai dharma teja as cab driver