Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chiru act in krish direction

ఈ సంచికలో >> సినిమా >>

డాన్సులు అదరగొట్టేశాడు

super dances
అక్కినేని అఖిల్‌ హీరోగా వస్తున్న చిత్రం 'అఖిల్‌'. వివి వినాయక్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి హీరో నితిన్‌ నిర్మాణ బాధ్యత వహించారు. సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన ట్రైలర్స్‌లో అఖిల్‌ వేసిన డాన్స్‌ స్టెప్పులకి అక్కినేని అభిమానులు పండుగ చేసేస్కుంటున్నారు. అంత ఈజ్‌తో అఖిల్‌ డాన్సులు అదరగొట్టేస్తున్నాడు మరి. అందగాడు, మంచి పర్సనాలిటీ ఉన్న ఈ తరం హీరోగా అఖిల్‌ ఇండస్ట్రీలో అప్పుడే టాక్‌ సంపాదించేశాడు.

మాస్‌ చిత్రాల స్పెషలిస్ట్‌ వివి వినాయక్‌ డైరెక్షన్‌లో అఖిల్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ కూడా అదుర్స్‌ అనిపిస్తున్నాయి. దసరా కానుకగా ధియేటర్స్‌లో సందడి చేయనున్నాడు ఈ దసరా బుల్లోడు. ఈ సిసింద్రీ సరసన సయేషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో అఖిల్‌ చెప్పిన డైలాగ్స్‌ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. చక్కని స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాడీ సిసింద్రీ. ఈ జోరు చూసి అఖిల్‌ తన మొదటి సినిమాతోనే ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపించేస్తాడని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
మరిన్ని సినిమా కబుర్లు
tripura as it is follow mayuri