Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌ టీజర్‌ సెన్షేషన్‌

megastar teasure sensation
సినిమాకి టీజరుంటుది. సినిమానే టీజర్‌ అయిపోతేనో? ఔనండీ, నిజమే ఇది. 'బ్రూస్‌లీ' సినిమానే మెగాస్టార్‌ చిరంజీవికి టీజర్‌. పూర్తిస్థాయి హీరోగా చిరంజీవి నటించే సినిమాకి 'బ్రూస్‌లీ' టీజర్‌ లాంటిదట. 'బ్రూస్‌లీ' డైరెక్టర్‌ శ్రీనువైట్ల చెబుతున్నాడీ మాట. చిరంజీవి సెట్స్‌లో ఎంత హుషారుగా ఉన్నారో చెబుతూ సినిమా యూనిట్‌ తమ ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. కోన వెంకట్‌ అయితే, 'గ్యాంగ్‌లీడర్‌'లో చిరంజీవిని చూస్తున్నట్లుందని చెప్పాడు. 'బ్రూస్‌లీ' సినిమాలో మూడు నిమిషాల పాటు చిరంజీవి కనిపిస్తారు.

ఇంకో వైపున తమిళ సినిమా 'కత్తి'ని తెలుగులోకి రీమేక్‌ చేయనుండగా, అందులో చిరంజీవి హీరోగా నటిస్తారని సమాచారమ్‌. వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట. మురగదాస్‌ చిత్రమిది. మురుగదాస్‌తో చిరంజీవి రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి 'ఠాగూర్‌'. ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకుడు. ఇంకొకటి 'స్టాలిన్‌'. ఇది మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమానే. ఏదేమైనా మెగాస్టార్‌ టీజర్‌గా భావింపబడ్తున్న 'బ్రూస్‌లీ' రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 
మరిన్ని సినిమా కబుర్లు
talent not enough