Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar teasure sensation

ఈ సంచికలో >> సినిమా >>

కేవలం టాలెంట్‌ ఉంటే చాలదు: రాశి ఖన్నా

talent not enough
ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలంటే ఫస్ట్‌ టాలెంట్‌ ఉండాలి. కానీ సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌ మాత్రమే సరిపోదు, అదృష్టం కూడా కలిసి రావాలంటోంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోందీ భామ. అందం, అభినయమే కాకుండా, మంచి పర్సనాలిటీ కూడా ఈ అమ్మడికి ప్లస్‌ పాయింట్‌ కావడం నిజంగానే ఆమె అదృష్టం. ఏ హీరోయిన్నయినా ఏ కాస్ట్యూమ్స్‌ అంటే ఇష్టం అని అడిగితే జీన్స్‌, టీషర్ట్స్‌ ఎక్స్‌ట్రా.. అని చెప్పేస్తూ ఉంటారు.

కానీ రాశీ ఖన్నాకి మాత్రం చీరల్లో ట్రెడిషనల్‌గా కనిపించడం అంటే ఎంతో ఇష్టమట. కానీ సినిమాల్లో ఆమె పాత్రకి తగ్గట్టుగా ఏ కాస్ట్యూమ్‌ వేసుకోవడానికి అయినా ఆమెకేమీ లిమిట్స్‌ కూడా లేవంటోంది. ప్రస్తుతం రాశీఖన్నా రవితేజతో 'బెంగాల్‌ టైగర్‌, రామ్‌తో 'శివమ్‌' సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
మరిన్ని సినిమా కబుర్లు
ali intruduction with  pavan