Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rashi ready to act aunty roles...

ఈ సంచికలో >> సినిమా >>

నాన్‌ స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

non stop entertainment
అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో లెక్కకు మిక్కిలిగా సినిమాలు విడుదల కానున్నాయి. 'శివం' నేడు (శుక్రవారం) విడుదలవుతుండగా, 'అఖిల్‌', 'బ్రూస్‌లీ' సినిమాలు ఈ నెలలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. హీరోగా అక్కినేని అఖిల్‌కి 'అఖిల్‌' తొలి సినిమా. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఖచ్చితంగా 50 కోట్ల క్లబ్‌లో చేరవచ్చునని అంచనా వేస్తున్నారు. సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్నా మినిమమ్‌ 40 కోట్లు చేసే సత్తా ఉన్న హీరో రామ్‌చరణ్‌ చేస్తున్న 'బ్రూస్‌లీ'పైన కూడా ఎన్నో అంచనాలున్నాయి.

ఇది వంద కోట్ల టార్గెట్‌తో రిలీజ్‌ అవుతోంది. తెలుగు సినీ రంగంలో మరో భారీ చిత్రం 'రుద్రమదేవి' కూడా ఈ నెలలోనే విడుదల కావొచ్చు. నవంబర్‌కి వస్తే, దీపావళి కానుకగా అరడజను సినిమాలకు తక్కువ కాకుండా విడుదల కావచ్చని అంచనా. నెక్స్‌ట్‌ డిసెంబర్‌లోనూ విడుదలయ్యేందుకు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆ తర్వాత సంక్రాంతి జాతర మామూలే. నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినీ ప్రేక్షకులకు అందించడానికి తెలుగు సినిమాలు క్యూ డుతుండడంతో, ఇంతకు ముందెన్నడూ లేని పండుగ సంబరాలకు ప్రేక్షకులు సిద్ధమైపోవచ్చు. 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi choodddam