Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

movie review

movie review
చిత్రం: శివమ్‌ 
తారాగణం: రామ్‌, రాశి ఖన్నా, వినీత్‌ కుమార్‌, అభిమన్యు సింగ్‌, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి తదితరులు. 
చాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌ 
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 
దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి 
నిర్మాణం: స్రవంతి మూవీస్‌ 
నిర్మాత: స్రవంతి రవికిషోర్‌ 
సమర్పణ: కృష్ణ చైతన్య 
విడుదల తేదీ: 2 అక్టోబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనే జంటలకి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు శివ (రామ్‌). ప్రేమ పెళ్ళిళ్ళను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఎంతకైనా తెగించడం శివ నైజం. ఓ సందర్భంలో శివకు తనూజ (రాశి ఖన్నా) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు శివ. అయితే శివను చంపాలని చూస్తుంటారు బోజిరెడ్డి గ్యాంగ్‌. అలాగే అభి (అభిమన్యు) గ్యాంగ్‌ కూడా శివను చంపాలనుకుంటుంది. కమెడియన్లే అయినా ప్రభ (బ్రహ్మానందం), (పోసాని) కూడా శివను చంపాలని ప్రయత్నిస్తారు. ఇన్ని గ్యాంగ్‌ల వెతుకులాట మధ్య శివ ప్రేమ విజయం సాధించిందా? ఎన్నో ప్రేమ పెళ్ళిళ్ళు చేసిన శివ, తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అయినా అన్ని గ్యాంగ్‌లతో శివకు ఎందుకు వైరం పుట్టింది? ఇలాంటివన్నీ తెరపై చూడాల్సిన అంశాలు. 

మొత్తంగా చెప్పాలంటే 
హీరో రామ్‌ ఎప్పటిలానే ఎనర్జిటిక్‌గా కనిపించాడు. డిఫరెంట్‌గా ఏమీ చేయలేదుగానీ, ఎనర్జీ లెవల్స్‌తో సినిమాని తన భుజమ్మీద మోసేశాడు. యాక్షన్‌, డాన్సులు, డైలాగ్స్‌ అన్నిటిలోనూ సత్తా చాటాడు. సెంటిమెంట్‌ సీన్స్‌లోనూ రాణించాడు. ఓవరాల్‌గా సినిమాకి అంతా తానే అయి వ్యవహరించాడు. 

హీరోయిన్‌ రాశి ఖన్నా అందాల విందుకే పరిమితమైంది. నటన ఓకే. క్యారెక్టరైజేషన్‌లో లోటుపాట్లు హీరోయిన్‌ని పాసివ్‌గా మార్చేశాయి. ఉన్నంతలో బాగానే చేసింది రాశి ఖన్నా. కుర్రాళ్ళను ఎట్రాక్ట్‌ చేసే ఏదో మ్యాజిక్‌ ఆమెలో ఉంది. ఆ మ్యాజిక్‌ని దర్శకుడు బాగా వాడుకుని, తెరపై ఆమెను అందంగా చూపించాడు. 

వినీత్‌కుమార్‌ భోజిరెడ్డి పాత్రలో విలనిజం బాగానే ప్రదర్శించాడు. అభిమన్యుసింగ్‌ మామూలే. కొన్ని చోట్ల అభిమన్యుసింగ్‌ కామెడీగా అనిపిస్తాడు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కామెడీని బాగా పండించాఉ. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధుల మేర ఓకే. 

కథ కొత్తదేమీ కాదు. కథనమూ అంతే. ఎంటర్‌టైనింగ్‌గా సినిమాని మలచాలనుకున్న దర్శకుడు కొంతవరకు సక్సెస్‌ అయినా, ఇంకాస్త గ్రిప్పింగ్‌గా కథను నడిపించి ఉండాల్సింది. డైలాగ్స్‌ ఓకే. పాటలు బాగున్నాయి. చిత్రీకరణ ఇంకా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి స్పెషల్‌ అస్సెట్‌. ఆకట్టుకునేలా అందమైన లొకేషన్స్‌లో సినిమాని చిత్రీకరించడం ఒక ఎత్తయితే, సన్నివేశాల్ని హృదయాలకు అత్తుకునేలా చూపించడం సినిమాటోగ్రఫీ టెక్నిక్‌. ఎడిటింగ్‌ ఓకే. ఇంకాస్త అవసరం అనిపిస్తుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగానే ఉంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమా రిచ్‌నెస్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. 

ఫస్టాఫ్‌ యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌ ఉన్నా కథనం గ్రిప్పింగ్‌గా లేకపోవడం వెలితిగా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో కూడా అంతే. కథ, కథనాల్లో కొత్తదనం లేనప్పుడు ఎంటర్‌టైనింగ్‌ వేలో అయినా కొత్తగా దర్శకుడు ఆలోచించి ఉండాల్సింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా జస్ట్‌ ఓకే అనిపిస్తే, ఆటోమేటిక్‌గా బోర్‌ కొట్టేస్తుంది. అందమైన లొకేషన్లు, హీరో డాన్సులు, హీరోయిన్‌ గ్లామర్‌, మాస్‌ని మెప్పించే ఫైట్స్‌ వరకూ బీ సెంటర్స్‌ ఆడియన్స్‌ని అలరించవచ్చు. కొత్తదనం ఆశిస్తే మాత్రం ప్చ్‌ కష్టమే. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
కొత్తదనం లేని రొటీన్‌ శివమ్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5
మరిన్ని సినిమా కబుర్లు
interview