Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

మణిరత్నం దర్శకత్వంలో నాని

nani act in maniratnam direction
నాని మంచి నటుడు. ఆయన నటించిన ఎన్నో సినిమాల్లో అతని నటనా ప్రతిభ వెలికితీయబడింది. తెలుగు సినీ పరిశ్రమలో వున్న అతి కొద్ది మంది 'నటుల్లో' నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వెరైనా. ఎలాంటి పాత్ర ఇచ్చినా, అవలీలగా పోషించగల 'ఈజ్‌' నాని సొంతం. అందుకేనేమో నాని, మణిరత్నం దృష్టిలో పడ్డాడు. దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ నటించిన మణిరత్నం సినిమా 'ఓకే బంగారం'కు నాని, డబ్బింగ్‌ చెప్పాడు గతంలో. ఆ సమయంలోనే నాని మీద మణిరత్నం దృష్టిపడిందట. 'ఓ సినిమా చేద్దాం' అని మాట వరసకు నానితో అప్పుడే చెప్పిన మణిరత్నం, మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడని సమాచారమ్‌. ఇటీవల నానికి ఫోన్‌ చేసిన మణిరత్నం,

'సినిమా చేస్తున్నాం' అని కన్‌ఫర్మ్‌ చేశాడట కూడా. ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే మాణిరత్నం, నాని కలిసి ఈ ప్రాజెక్ట్‌ని ఫైనల్‌ చేయనున్నారు. మణిరత్నం లాంటి కళాత్మక దర్శకుడు ఆఫర్‌ ఇస్తే నాని కాదనడు కదా. మణిరత్నం సినిమా ఎలాగూ హిందీలోకి కూడా వెళ్ళేందుకు అవకాశముంది. అలా నాని, మణిరత్నం సినిమాతో బాలీవుడ్‌కి కూడా (నాని సినిమాతో బాలీవుడ్‌ని కొంచెం టచ్‌ చేశాడు) కొత్తగా పరిచయం కానున్నాడు. 
మరిన్ని సినిమా కబుర్లు
akkineni family at a time on screen