Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akkineni family at a time on screen

ఈ సంచికలో >> సినిమా >>

హాలీవుడ్‌ స్థాయి థ్రిల్లర్‌ 'చీకటి రాజ్యం'

cheekatirajyam  movie  reach in  holly wood  thrillar
 
కమల్‌హాసన్‌ హీరోగా నటించిన 'తూంగవనం' తెలుగులో 'చీకటి రాజ్యంగా' రానుంది. తమిళ, తెలుగు భాషల కోసం ప్రతి సీన్‌నీ క్వాలిటీ కోసం రెండుసార్లు చిత్రీకరించారట. తమిళ సినిమా అన్న భావన తెలుగువాళ్ళకి, తెలుగు సినిమా అన్న భావన తమిళ ప్రేక్షకులకీ కలగకుండా సీన్స్‌ చిత్రీకరించడం, డైలాగ్స్‌ చెప్పించడం జరిగిందని కమల్‌హాసన్‌ చెప్పాడు. సినిమాకి కమల్‌హాన్‌ స్క్రీప్‌ప్లే రావడం గొప్ప విశేషం. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'చీకటిరాజ్యం' చిత్రాన్ని రూపొందించామని, సినిమా తప్పక ఘనవిజయం సాధిస్తుందనీ, భారతీయ సినీ పరిశ్రమలో 'చీకటి రాజ్యం' సినిమా కొత్త తరహాలో సాగే టెక్నికల్‌ బ్రిలియన్స్‌ మూవీ అని అన్నాడు

కమల్‌హాసన్‌. తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన రాజేష్‌ ఎం సెల్వకు కమల్‌హాసన్‌ దర్శకత్వ బాధ్యతలు అందించి, ఆయన దర్శకత్వంలో 'చీకటి రాజ్యం' చిత్రాన్ని నిర్మిస్తుండడం ఇంకో పెద్ద విశేషంగా చెప్పవచ్చు. ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుందట. ఆ పాటకి గ్రిబన్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడని, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకే హైలైట్‌ అవుతుందన్నాడు కమల్‌హాసన్‌. 
మరిన్ని సినిమా కబుర్లు
clarity on chiru movie.