Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ninadevi temple

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - ..



 

తిక్క : అశోక్ బోగ కరెక్టుగా నమస్కారాలు మీకేనా?
తొక్క : అబ్బే నాక్కాదేమో...అశోక్ బోగ గారికే అనుకుంటా...

తిక్క : మీరు సూదితో కార్టూన్లేస్తారా?
తొక్క : సూదితో ఏం కర్మ దాని తల్లి(పశువులకిచ్చే సూదన్నమాట)తో కూడా ఏస్తా...నా సూదితో గుచ్చానంటే చాలు కార్టూన్ల మందు మీ పెదాల్లోకి ఎక్కుతుందంతే 

తిక్క : కారాలూ-మిరియాలూ నూరి కార్టూన్లలో వేస్తే రేపటికి పనికి వస్తాయా?
తొక్క : పనికిరాక చస్తాయా....నా కార్టూన్లు చదివాక నవ్వీ నవ్వీ ఎలాగూ మీ పొట్ట చెక్కలవుతుందిగా .... ఆ పొట్టలోంచి నా కార్టూన్లలో వేసిన కారాలూ మిరియాలూ కూడా బయట పడతాయిగా అప్పుడెంచక్కా పనికొస్తాయ్.... 

తిక్క : చైనా బజార్లలో ఏవైనా కొనొచ్చు కానీ, కార్టూన్లు కనిపిస్తే మాత్రం బాధ పడొద్దని మీరెవరికీ చెప్పలేదా? 
తొక్క : ఎందుకు చెప్పలేదూ...నా కార్టూన్లకు రోజూ చెప్తూనే ఉన్నాగా... 

తిక్క : మీరు వేసే అన్ని కార్టూన్లలో అశోక్ బోగ అనే ఉంటుంది కానీ మీ సంతకం ఎక్కడా కనిపించదేం? 
తొక్క : సంతకం మీరు చూస్తున్నప్పుడు సంతకెళ్లిందేమో మరి 

తిక్క : మీ కార్టూన్లకు అన్ని సంగతులూ తెలుసనే అనుకుంటున్నారా? 
తొక్క : అన్ని సంగతులు తెలుసు గానీ ఒక్క నా సంగతే తెలియకుండా జాగ్రత్త పడుతుంటాను...ఎందుకంటే వాటికి నా సంగతి తెలిస్తే నా సంగతి చూస్తాయేమోనని భయం నాకు...

తిక్క : మీ కార్టూన్లు బాగా ఉడకబెట్టినవేనా?
తొక్క :చాల బాగా ఉడకబెట్టినవే కాబట్టి మొన్నీ మధ్యే బ్రహ్మాండం గా వరల్డ్ లెవల్లో నా గుడ్డు కార్టూన్లతో ఎగ్ డే కూడా జరుపుకున్నారుగా .... 

తిక్క : ఎవరూ సొంతూళ్ళకు వెళ్ళకుండా మీ కార్టూన్లతో ఆపుతున్నారటకదా? 
తొక్క : మరే... కొందరైతే ఈ దసరాక్కూడా ఊరెళ్లకుండా నా కార్టూన్లతోనే సరదా చేసుకుంటున్నారట ... 

తిక్క : ఏస్థాయి బహుమతులైతే మీ కార్టూన్లకు సరిపోతాయనుకుంటున్నారు? 
తొక్క : అంతర్జాతీయ స్థాయని చెబుతా అనుకుంటున్నారు కదా... నెవ్వర్... అంతర్జాల జాతీయ స్థాయి బహుమతులైతే సరిపోతుందనుకుంటా... 

తిక్క : అరటిపండు తొక్కపై కాలేసిందానికన్నా మీ కార్టూన్లే ఎక్కువ నవ్విస్తాయని అనుకుంటున్నారా?
తొక్క : అవును మరి...అరటి పండును పడేసి ఆ తొక్క తిని మరీ కార్టూన్లేస్తా కాబట్టి అలా జరగాల్సిందే మరి...తొక్కలో కార్టూన్లు గా నావి ... 

తిక్క : మీ కార్టూన్లతో సమాజానికి ఎలాంటి సవాల్ విసరాలని మీ సమాధానం?
తొక్క : నా కార్టూన్లు చూసి పడీ పడీ నవ్వి పాడెక్కకుంటే చూడు అనే సవాల్ విసరాలని అనుకుంటాను... 

తిక్క : మామిడిపళ్ళ సీజన్ మీ కార్టూన్లకు కలిసొస్తుందా?
తొక్క :అబ్బే అంతగా కలిసిరాదనుకుంటా అరటి పళ్లే బెటర్ అన్ని సీజన్లలో నా కార్టూన్ల కు ఎన్ని తొక్కలు కావాలంటే అన్ని తొక్కలు లభిస్తాయిగా...అప్పుడు తొక్కలో ఐడియాలు పుట్టుకొస్తూనే ఉంటాయ్

తిక్క : ఏ ఆధారంతో ఎవరిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు?
తొక్క:నా కార్టూన్లు చేసే నేరాలను అవి నా మీదకే తోసేస్తున్నాయన్న ఆధారంతో నా కార్టూన్ల మీదే ఆరోపణలు చేస్తున్నా... 

తిక్క : దేశాల మధ్య సరిహద్దులకన్నా మీ కార్టూన్లే ఎక్కువ అవసరమా? 
తొక్క: ఉట్టి అవసరం అంటారేంటండీ అత్యవసరం...ఎందుకంటే సరిహద్దు దాటడానికి వచ్చే శతృ సైన్యం నా కార్టూన్లు చదివి పొట్ట చెక్కలయ్యేలా నవ్వీ నవ్వీ చస్తారుగా...అలా మొత్తం శతృ సైన్యాన్ని పైసా ఖర్చు లేకుండా పాడెక్కించొచ్చన్నమాట..!

తిక్క : మహాభారతంలో, పాండవులు అజ్ఞాతవాసం చేసింది మీ కార్టూన్లకు కనిపించకుండా దాక్కోవడానికేనా?
తొక్క:వాటిక్కనిపిస్తే నవ్వించి మరీ చంపుతాయిగా అందుకే అలా కనిపించకుండా దాక్కుంటున్నారట...

తిక్క : మీ తుంటర్వ్యూ ఎప్పుడు మొదలైందో చెప్పకుండా దాస్తున్నారా?
తొక్క: చెప్తే అందరూ ఎక్కడివాళ్లక్కడ తప్పించుకు పారిపోతారుగా మరి

తిక్క : కూర్చునితింటే ఎన్నికొండలరిగిపోతాయి? 
తొక్క: కొండలెందుకు అరిగిపోతాయండీ బాబూ...కూర్చొని తిన్నోడు కొండలా పెరిగిపోతాడంతే .... 

తిక్క : మీ కార్టూన్లు తప్ప ప్రపంచమంతా పక్కకి వెళ్తున్నారా?
తొక్క: ఎగ్జాక్ట్లీ... ఎందుకంటే నా కార్టూన్ల దారి...రహదారి 

తిక్క : మీ తుంటర్వ్యూ గురించి గాంధారి శూర్పణఖతో చెప్పేస్తుందేమో ఆలోచించారా? 
తొక్క: అప్పుడు లక్ష్మణుడి సూర్పణఖ ముక్కూ చెవులు కోసే శ్రమ తగ్గుతుందేమో...ఎందుకంటే నా కార్టూన్లు చదివి చెవులు ముక్కు కోసేసుకుంటుందిగా... 

తిక్క : సరే, ఇక తుంటర్వ్యూ ఎవరికి భయపడకుండా మొదలెడదామో చెబుతారా? 
తొక్క: ఇంకెవరికి ... నా కార్టూన్లకి

తిక్క : ఇలా తుంటర్వ్యూ అయిపోయిందని తెలిస్తే ఎవరిని తిట్టుకుంటూ వెళ్ళిపోతారౌ? 
తొక్క: నా తొక్కలో ఐడియాలను తిట్టుకుంటాను...

మరిన్ని శీర్షికలు
veekshanam