Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

16-10-2015 నుండి 22-10-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

..

మేష రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలు చేయువిషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దలతో కలిసి చేపట్టిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోండి. పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వలన పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసే అవకాశం కలదు. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువుల పట్ల మక్కువను కలిగి ఉంటారు. స్త్రీ / పురుష సంభందాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. దైవపరమైన పూజలకు లేదా యోగాకు కాస్త సమయం ఇవ్వడం చాలావరకు మేలుచేస్తుంది.  

 

 

వృషభ రాశి  ఈవారం మొత్తంమీద నూతన పనులను మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినను సర్దుకుంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో పెద్దలతో చర్చలు చేయుటకు ఆస్కారం కలదు. బంధువులతో కలిసి నూతన పనులను మొదలుపెడతారు. కుటుంబంలో నూతన ప్రయత్నాలు చేస్తారు. విదేశాల్లో ఉన్నవారినుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. దైవపరమైన పూజలకు సమయం ఇవ్వడం సూచన.       

 

 

                  
మిథున రాశి : ఈవారం మొత్తంమీద స్వల్పప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, వాటికి సమయం ఇస్తారు. ఉద్యోగంలో అధికారులతో చేసిన చర్చలు కార్యరూపం దాల్చుతాయి. పనుల్లో మొదట్లో ఇబ్బందులు కలిగినను చివరకు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరుల నుండి ఆశించిన తోడ్పాటు లభిస్తుంది. కుటుంబంలో సభ్యులనుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారు , విందుల్లో పాల్గొనే అవకాశం కలదు. బంధువుల వలన అనుకోని ఖర్చులు అయ్యే ఆస్కారం కలదు జాగ్రత్త. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దలను సంప్రదించుట వలన మేలుజరుగుతుంది. అనవసరమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి, సర్దుబాటు మంచిది.         

                                    

కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాల విషయంలో నిర్ణయం తీసుకుంటారు అలాగే జరిగే అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవాకాశం ఉంది, సాధ్యమైనంత వరకు స్వల్ప దూర ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు ఉన్నా సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. గతంలో మీరు మధ్యవర్తిత్వం చేసిన వ్యవహారాల వలన అనుకోని ఇబ్బందులు తలెత్తుటకు అవకాశం ఉంది జాగ్రత్త. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు.      
      

 

సింహ రాశి : ఈ వారం మొత్తంమీద నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. నచ్చిన పనులకు సమయాన్ని ఇస్తారు. కుటుంబంలో ధనమునకు సంభందించిన విషయాల్లో చర్చలకు అవకాశం ఉంది, సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకోవడం మేలుచేస్తుంది. మిత్రులతో కలిసి పనిచేసే విషయంలో స్పష్టమైన ఆలోచనలు అవసరం. విలువైన వస్తువులను కొనుగోలుచేసే ఆస్కారం కలదు. అలాగే నూతన గృహం కొనుగోలు చేయాలనుకొనే వారికి మంచి కాలం చిన్నపాటి ప్రయత్నం ద్వార మీ కలసాకారం అవుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు.      


కన్యా రాశి :ఈవారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. దూరప్రదేశప్రయాణాలు పెద్దగా అనుకూలించక పోవచ్చును, వీలయితే వాయిదా వేయుట ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. మీ ఆలోచనల్లో కొంత సందిగ్దత ఉంటుంది. పెద్దల అనుభవాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. సోదరులతో చేసిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో కొంత ఆందోళనకు లొనయినను సర్దుకుపోతారు. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. 

  

తులా రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సమయాన్ని ప్రయాణాలకు కేటాయించే అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న అనుభందం మరింత బలపడే అవకాశం ఉంది. మీ మాటతీరు మూలాన లేని సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. స్వల్పఅనారోగ్యసమస్యలకు ఆస్కారం కలదు కావున సమయానికి భోజనం చేయుట ఉత్తమం. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు పెట్టేముందు ఒక్కసారి ఆలోచన చేయుట సాధ్యసాధ్యాలు పరిశీలించుట అవసరం. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుట యందు అమితమైన ఆసక్తిని చూపిస్తారు. ఇష్టమైన వ్యక్తుల నుండి ముఖ్యమైన సమాచరం లభిస్తుంది.      

 

 

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనుల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. పనిభారం ఉంటుంది అలాగే మానసికంగా కొంత ఒత్తిడి తప్పకపోవచ్చును. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి విలువైన సమాచరం పొందుతారు. కొంత మీ మాటతీరు మూలాన తోటివారిలో అయోమయ స్థితికి కారణం అవుతారు. కుటుంబసభ్యులతో కలిసి పూజాదికార్యక్రమాల్లో పాల్గొనే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుకూలమైన స్థితి ఉంటుంది , కష్టానికి తగిన ఫలం పొందుతారు.   

 

 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెదతరు. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. పనులవలన శ్రమ పెరుగుతుంది, తోటివారి సహయంతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. దూరప్రదేశాల నుండి నూతన విషయాలు  కుటుంబంలో స్వల్ప మార్పులకు మీరే శ్రీకారం చుడుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సూచన. సంతానపరమైన  ఒత్తిడి తప్పకపోవచును.  సూచనల మేర ముందుకు వెళ్ళండి.       

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో  అనుకూలమైన మార్పులు కలుగుతాయి, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలకు సమయాన్ని ఇస్తారు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు పెడతారు. బంధువులనుండి వచ్చిన సమాచారం మిమ్మల్ని సంతోషానికి గురిచేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన లావాదేవీల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. వాహనముల వలన ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం ఉంది జాగ్రత్త. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో మీ పరిధులు దాటకపోవడం సూచన. తండ్రి లేదా తండ్రి తరుపు వారితో చర్చలు చేస్తారు.   . 

 


కుంభ రాశి : ఈవారం మొత్తంమీద నూతన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో ఊహించని మార్పులు కలుగుతాయి. సమాజంలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన దానం ధనం చేతికి అందుతుంది. మిత్రులనుండి విలువైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. స్వల్పఆరోగ్య జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన , ఈ విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు. కొంతమీ మాటతీరును సవరించుకోవడం ద్వార మరింత లబ్దిని పొందుటకు అవకాశం ఉంది.         

 

    

మీన రాశి : ఈవారం మొత్తంమీద మొదట్లో పనిఒత్తిడి ఉంటుంది , అలాగే అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. ఊహించని పరిణామాలకు అవకాశం ఉంది , జాగురుకతతో ఉండండి. వారంమధ్యనుండి తోటివారినుండి అలాగే మిత్రులనుండి సహకారం రావడం వలన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. మధ్యవర్తిత్వం చేసే విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట మంచిది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. స్వల్పఅనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో అలాగే భాగస్వామి ఒప్పందాలు కలిసి వస్తాయి. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.     

టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu