Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

మాస్‌ టచ్‌తో నారా రోహిత్‌ 'తుంటరి'

mass touch with nara rohit
 
ఇంత వరకూ క్లాస్‌ టచ్‌ ఉన్న సినిమాల్లోనూ, మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లోనూ నటించిన నారా వారబ్బాయ్‌ నారా రోహిత్‌ రూటు మార్చాడు. పక్కా మాస్‌తో తను కూడా మాస్‌ హీరోనే అని నిరూపించుకోవాలనుకుంటున్నాడు. కుమార్‌ నాగేంద్ర దర్శకత్వంలో కీర్తి ఫిలింస్‌ పతాకపంపై అశోక్‌బాబా, నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో హీరో క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు 'తుంటరి' అనే మాస్‌ టైటిల్‌ను ఎంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ రిలీజయ్యింది.

ఫస్ట్‌ లుక్‌ను హీరో నారా రోహిత్‌ స్వయంగా తన ట్విట్టర్‌ అక్కౌంట్‌ ద్వారా రిలీజ్‌ చేశాడు. 'మాన్‌ కరాటే' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'బాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న నారా రోహిత్‌ ఈ సినిమాతో కమర్షియల్‌ హీరోగా కూడా ప్రూ చేసుకోబోతున్నాడట. ఫస్ట్‌ లుక్‌లో నారా రోహిత్‌ డిఫరెంట్‌గా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. 
మరిన్ని సినిమా కబుర్లు
manchu hero saradaa..