Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంట‌ర్వ్యూ

interview
రామ్‌చ‌ర‌ణ్ కాంప్లిమెంట్ మ‌ర్చిపోలేను  - ప్ర‌గ్య జైస్వాల్‌

తెలుగు సినిమాకి మ‌రో కొత్త హీరోయిన్ వ‌చ్చింది. త‌నే ప్ర‌గ్య జైస్వాల్‌!
ఎత్తు, రంగు, అందం - క‌మర్షియ‌ల్ హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. దానికితోడు ప్రెస్టేజియ‌స్ మూవీ కంచెలో అవ‌కాశం అందుకొంది. క్రిష్ సినిమాల్లో క‌థానాయిక పాత్ర‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. క్రిష్‌లోనూ... క‌థానాయిక పాత్ర ప్ర‌త్యేక‌మే. ఆ ఛాన్స్ అందుకొని ప్ర‌గ్య అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే తొలి సినిమా మిర్చీ లాంటి కుర్రాడు ఫ్లాప్ అయ్యింది. అయినా స‌రే.. మెగా హీరోయిన్‌గా ఛాన్స్ అందుకొంది. ప్ర‌చార చిత్రాల్లో ప్ర‌గ్య‌ని చూస్తుంటే.. ప్రామిసింగ్ హీరోయిన్ అయ్యే ల‌క్ష‌ణాలు ఆమెలోనూ ఉన్నాయ‌నిపిస్తోంది. మ‌రి కంచెతో.... ప్ర‌గ్య ఎన్ని మార్కులు సాధిస్తుందో చూడాలి. అన్న‌ట్టు కంచె ఈ ద‌స‌రా పండ‌క్కి వ‌చ్చేసింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌గ్య‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది.


* హాయ్ ప్ర‌గ్యా..
- హాయండీ.

* ఎలా ఉంది తెలుగు సినిమా వాతావ‌ర‌ణం?
- ఇట్స్ రియ‌ల్లీ కూల్‌. ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టే పెద్ద మ‌న‌సు తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఉంది. టాలెంట్ ఉంటే చాలు.. ఇక్క‌డ అవ‌కాశాలు అవే వెదుక్కొంటూ వ‌స్తాయి. నేను ప‌రాయి అమ్మాయినే అయినా.. అంద‌రూ అక్కున చేర్చుకొన్నారు. కంచె సెట్లోఅయితే న‌న్నో మ‌హారాణిలా చూసుకొన్నారు?

* ఇంత‌కీ ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి?
- చెప్పాగా.. మ‌హారాణిలా చూసుకొన్నార‌ని.. తెర‌పైనా అలానే క‌నిపిస్తా. ఓ గొప్పింటి అమ్మాయి పాత్ర‌. పేరు సీత‌... కానీ అంత సాప్ట్ కాదు. ఏం అనుకొంటే అది చేయ‌గ‌ల‌దు, తెగింపు, ధైర్యం రెండూ ఎక్కువే.

* 1940 నాటి సినిమా ఇది... రెగ్యుల‌ర్ హీరోయిన్‌లా క‌నిపిస్తానంటే కుద‌ర‌దు. మ‌రి సెట్‌కి వ‌చ్చేముందు ఎలాంటి హోమ్ వ‌ర్క్ చేశారు?
- నేను చేసింది త‌క్కువే. అంతా క్రిష్‌గారే చూసుకొన్నారు. నాలుక్‌, న‌డ‌క‌, మాట్లాడే విధానం, కూర్చునే ప‌ద్ధ‌తి అన్నీ ఆయ‌నే డిజైన్ చేశారు. నా కాస్ట్యూమ్స్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. నాకేం రాదు అనుకొని సెట్స్ లోకి అడుగుపెట్టేదాన్ని. 'సార్‌.... మీరేం చెబుతారో చెప్పండి, నేను చేస్తా' అనేదాన్ని. డైరెక్ట‌ర్‌కి స‌రెండ‌ర్ అయిపోవ‌డం నాకిష్టం. ఆయ‌న ఎలా చెబితే అలా.

* కానీ మీకంటూ ఓ హోమ్ వ‌ర్క్ ఉండాలి క‌దా?
- ఎక్కువ‌గా పాత సినిమాలు చూసేదాన్ని. ఇంగ్లీష్, హిందీ, తెలుగు.. ఇలా ఆ త‌రంలో వ‌చ్చిన సినిమాల్ని చూశా. దాన్ని బ‌ట్టి అప్ప‌టి అమ్మాయిలు ఎలా ఉండేవారు అనే విష‌యంపై ఓ అంచ‌నాకు వ‌చ్చా. ఆ త‌ర‌వాత క్రిష్ స‌ల‌హాల‌తో... సీత పాత్ర‌లోకి వెళ్లిపోయా.

* తొలి సినిమా మిర్చీలాంటి కుర్రాడు ఫ్లాప్ అయ్యింది. అయినా ఈ ఛాన్స్ ఎలా ప‌ట్టుకోగ‌లిగారు?
- క్రిష్ బాలీవుడ్ లో గ‌బ్బ‌ర్ చేశారు క‌దా?  ఆ సినిమా కోసం హీరోయిన్ల ను అన్వేషిస్తున్న‌ప్పుడు నేనూ ట్రై చేశా. ముంబై వెళ్లి అడిష‌న్స్ లో పాల్గొన్నా. అప్ప‌టి ప‌రిచ‌యాన్ని దృష్టిలో ఉంచుకొని, క్రిష్ న‌న్ను పిలిచారు. కంచె లాంటి పెద్ద సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చిన క్రిష్‌కి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటా.

* మిర్చిలాంటి కుర్రాడు ఫ్లాప్ అయ్యింది క‌దా?  ఆ స‌మ‌యంలో మీ ఆలోచ‌న‌లు ఎలా ఉండేవి?
- హిట్లు, ఫ్లాపుల్ని మ‌నం ఊహించ‌లేం క‌దా, ఫ‌లితం ఏదైనా స్వీక‌రించ‌డ‌నికి సిద్ధంగా ఉండాలి.

* తొలి సినిమా ఫ్లాప్ అంటే.. హీరోయిన్ కెరీర్‌కి ఇబ్బంది క‌దా?
-  అలాగైతే నాకు కంచెలో అవ‌కాశం వ‌చ్చేదే కాదు. హిట్టో, ఫ్లాపో అనుభ‌వం సంపాదించ‌డం ముఖ్యం. మిర్చిలాంటి కుర్రాడుతో నాకు కావ‌ల్సినంత అనుభ‌వం వ‌చ్చింది.

* కంచెతో ఏం నేర్చుకొన్నారు?
- చాలా. న‌టిగా ఏం నేర్చుకొన్నా.. కంచెతోనే. ఈ విష‌యంలో నాకు గురువు క్రిష్ గారే.

* వ‌రుణ్ తేజ్ బాగా హైట్ క‌దా, ఇబ్బంది ప‌డ్డారా?
- నేనూ బాగా హైటేనండీ. మ‌రీ వ‌రుణ్‌లా ఆరున్న‌ర అడుగులు ఉండ‌క‌పోయినా... ప‌ర్వాలేదు. ఎత్తుకు స‌రిప‌డే క‌థానాయిక‌లే దొర‌కాలంటే కుద‌ర‌దు. అప్పుడ‌ప్పుడూ ఎడ్జ‌స్ట్ అవ్వాల్సిందే.

* ఇంత‌కీ వ‌రుణ్ ప్ల‌స్ పాయింట్స్ ఏంటి?  అత‌నిలో మీకేం న‌చ్చాయి?
- చాలా డీసెంట్‌. అంద‌రితో ఫ్రెండ్లీగా ఉంటాడు. సెట్లో వంద మంది ఉంటే, ఆ వంద మందితోనూ త‌న‌కు ప‌రిచ‌యం ఉంది. డౌన్ టు ఎర్త్‌. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో చాలా ఈజీగా న‌టించేశాడు. అస్స‌లు వ‌న్ మోరే అడ‌గలేదు. అంత ప‌ర్ ఫెక్ట్ గా చేశాడు.

* సెట్లో మీకు ఇబ్బందిగా అనిపించిన సంద‌ర్భాలేమైనా?
- ఇబ్బందిగాదుగానీ, ఛాలెంజింగ్‌గా అనిపించిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఓ పాట కోసం జోళ్లు లేకుండా, మ‌ట్టి రోడ్డుపై డాన్స్ చేయాల్సివ‌చ్చింది. పైగా అది హాట్ స‌మ్మ‌ర్‌లో. ఇంకోసారి వాన పాట‌లో కాస్త ఇబ్బంది ప‌డ్డా. వ‌రుస‌గా నాలుగు రోజులు నీట్లో త‌డుస్తూ ఉండ‌డం అంటే మాట‌లు కాదు. 

* నాగ‌బాబు మీకేదో కాంప్లిమెంట్ ఇచ్చార‌ట‌..
- అవునండీ.. పాత సినిమాల్లోని కాంచ‌లా ఉన్నావ్ అన్నారు. అది కేవ‌లం కాంప్లిమెంట్‌గానే స్వీక‌రిస్తా. ఎందుకంటే.. ఆవిడెక్క‌డ‌, నేనెక్క‌డ‌? క‌ంచె ఆడియో వేడుక‌కు రామ్‌చ‌ర‌ణ్ వ‌చ్చారు. `నీ లుక్, ప్రెజెన్స్ చాలా బాగున్నాయ్‌.. కీపిట‌ప్‌` అన్నారు. ఆ కాంప్లిమెంట్ మ‌ర్చిపోలేను.

* తెలుగులో మీకు న‌చ్చిన హీరోలెవ‌రు?
- ఒక‌రి పేరు చెప్ప‌లేను. అంద‌రూ ఇష్ట‌మే. వాళ్లంద‌రితోనూ న‌టించాల‌ని ఉంది.

* ఎలాంటి రిస్కూ లేని స‌మాధానం చెప్పారు...
- (న‌వ్వుతూ) నిజమేనండీ. ఇక్క‌డ స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఒకొక్క‌రిదీ ఒక్కో శైలి. వాళ్లంద‌రితోనూ న‌టించాలి..

* కొత్త‌గా ఒప్పుకొన్న సినిమాలేమైనా ఉన్నాయా?
- ప్ర‌స్తుతం రెండు క‌థ‌లు విన్నా. అయితే సంకాలు చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ఆ సినిమాలేంట‌న్న‌ది చెబుతా.

* ఒకే ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ....
మరిన్ని సినిమా కబుర్లు
mass touch with nara rohit