Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasi pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: ఫణిభూషణ్ రావుగారు అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెపుతాడు. అదేమిటంటే..ప్రతిమ... ఈ సంస్థకు క్రియేటివ్‌హెడ్‌గానే తెలుసు. కానీ, ప్రతిమ నా కన్నకూతురు. అంటూ రెండు చేతులు సాచి ఆహ్వానిస్తాడు వేదిక మీదకి. ఏంటీ ... గడిచిన క్షణం వరకూ మన ఆఫీసులో క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేసిన ప్రతిమ ఫణిభూషణరావు గారి కూతురా? నమ్మలేక పోతారు సంస్థ సిబ్బంది. ఎవరికి వారే ఆశ్చర్యంతో నోళ్లు తెరుస్తారు. ఆ తరువాత...

 

ఆ మర్నాడే...తేజాని పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పుడే...  సరికొత్త ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుడుతున్నానని ఎనౌన్స్‌ చేసింది. ఆ ప్రాజెక్ట్‌ డిటెయిల్స్‌ ప్రముఖంగా రావాలని కోరింది.

‘నా ఇంటర్వ్యూ కట్‌చేసినా ఫర్వాలేదు. ప్రాజెక్ట్‌ సమాచారం ముఖ్యం’ అని పదేపదే చెప్పింది.

వెళ్తూ వెళ్తూ`‘ ‘ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు కొత్త పొజిషన్‌ని?’’  అడిగాడు తేజ.

‘‘కొత్తేం ఉంది? ఇది వరకు హ్యాండిల్‌ చేసిన పొజిషనే కదా!’’

‘‘కానీ.. ఫణిభూషణరావు గారమ్మాయిగా’’ ఇంకా ఏదో అనబోయి మధ్యలోనే ఆగిపోయాడతడు.

అప్పుడే అంది ప్రతిమ`‘‘ఫర్వాలేదు అనండి. ప్రతిమగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. 

ఫణిభూషణరావుగారమ్మాయినని ఎప్పుడైతే ప్రపంచానికి తెలిసిందో... ఎక్కడలేని గుర్తింపుదానంతటది వచ్చేసింది. సాదాసీదాగా బతకడంకన్నా... సంపన్నుడి కూతురిగా బతకడం కష్టమని నాకిపుడిపుడే అర్ధమవుతోంది.  ఇష్టమైన ఫ్రెండ్స్‌తో మాట్లాడేందుకు కొన్ని క్షణాల్ని కూడా మనకి మనం మిగుల్చుకోకపోవడాన్ని మించినబాధఇంకేముంటుంది? సిటీ బస్‌ దిగగానే ఎదురుగా కనిపించే బండి దగ్గరి కి వెళ్లి పానీపూరీ లాగించేయడం లాంటి చిన్నచిన్న సరదాలు, సంతోషాల కీ దూరమవుతున్నాననిపిస్తోంది. ప్రతిమగా అవన్నీ చేసాను. ఇప్పుడు వరించి వచ్చిన కొత్తట్యాగ్‌లైన్‌తో ఏవీ చేయలేకపోతున్నాను...’’

‘‘అంటే.. .ఫణిభూషణరావుగారమ్మాయిగా హ్యాపీగా లేరా?’’

‘‘ఊహూ.. . కాకపోతే,  కార్పొరేట్‌ కల్చర్‌లోని ఫాల్స్‌ ప్రిస్టేజ్‌ అర్ధమవుతోంది. అంతేకాదు... ఈ కార్పోరేట్‌ పోటీ ప్రపంచంలో ప్రతిక్షణం కనిపించని యుద్ధం జరుగుతుంటుంది. అది మేధోయుద్ధం. పైకి ఆయుధాలు కనిపించవు. మన చుట్టూ ఉన్న గుంపులో శత్రువులెవరో ... మిత్రులెవరో గుర్తించడం కష్టమే. అందుకే, ఈ యుద్ధాలు కురుక్షేత్ర సంగ్రామం కన్నా భీకరమైనవి... భయానకమైనవి. అనుక్షణం అప్రమత్తంగా లేకుంటే ఈ యుద్ధంలో నెగ్గుకు రావడం కష్టం. విజేతలుగా నిలవడం మరీ కష్టం’’

ప్రకృతితో సహవాసం చేస్తూ స్వేచ్ఛగా తిరిగే పంచవన్నెల చిలకను పంజరంలో బంధించినట్లనిపించింది ప్రతిమని చూస్తే. ఎందుకో, ఆమె కళ్లలో నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

‘బ్యూటీవిత్‌ బ్రెయిన్‌’ పేరుతో ఇంటర్వ్యూ టెలికాస్ట్‌ చేయడానికి ఒక్కరోజు ముందే... ప్రతిమ ఈ లోకం నుంచి... మరెన్నటికీ తిరిగిరాలేని దూర తీరాలకు తరలిపోయింది. ‘చానెల్‌ సిక్సిటీన్‌కి ప్రతిమ ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ’ అంటూ ఆ ఇంటర్వ్యూ ప్లే అయింది. 

‘చక్కనమ్మచిక్కినా అందమే’ అన్నట్లుంది ప్రతిమ.  పరిశీలనగా చూస్తే ముఖంలో స్పష్టా స్పష్టంగా కదలాడ్తున్న బాధావీచికలు. మనసును కృంగదీస్తున్న నీలి నీడలవి షాద ఛాయలేవో ముఖబింబాన్ని కమ్మేసినట్లు కనిపిస్తోందామె.

చానెల్‌ లైబ్రరీలో ఆ ఇంటర్వ్యూ చూస్తూ... అప్పటి ఇన్సిడెంట్‌ నేపధ్యాన్ని గుర్తుచేసుకుంటున్నాడు తేజ.

ప్రతిమ చుట్టూ ఉన్న పాత్రల్లో ఫణిభూషణరావు,  ఆనందరావు, పరంధామ్‌తో పాటు ఆమె ఎంతగానో ప్రేమిస్తున్న అభిరామ్‌ ప్రధానంగా కనిపిస్తున్నారు.  వీరితో పాటు ఇండస్ట్రీలో కూడా ప్రతిమకు పరిచయాలు బాగానే ఉన్నాయి.  అయితే, ఆ రోజు ఏడో అంతస్థు టెర్రస్‌ మీంచి ప్రతిమ ఎందుకు పడిపోయింది?  అంతెత్తు నుంచి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే దూకిందా? వెనుక నుంచి ఎవరైనా తోసేసారా?  ఒకవేళ దూకితే... బలవంతంగా చచ్చిపోవాలనే ఆలోచన ఆమెకెందుకొచ్చింది?

ఈ ఘటనలో పరోక్షంగా పరంధామ్‌ పాత్రేమైనా ఉందా? లేక, ప్రేమలో అపార్ధాలు చోటుచేసుకోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆమె ఈ పని చేసిందా? ఎంతో గారాబంగా పెంచుకున్న ఫణిభూషణరావు ప్రతిమ జీవితంలో అటువంటి క్షణాలు రాకుండా నిరోధించడంలో విఫలమయ్యాడా?
అసలింతకీ ఏం జరిగింది?

ఇలా పలుకోణాల్లో ఆలోచిస్తున్నాడు తేజ.
ఆ రోజు వీక్లీఆఫ్‌.

ఇంట్లోనే ఉన్నాడు తేజ.

ఆరు రోజుల తర్వాత వచ్చే ఆఫ్‌ అంటే ఆనందమే అయినా... వీక్లీ ఆఫ్‌లు, విరామాలుండని క్రయింని రిపోర్ట్‌ చేసే ప్రొఫెషన్‌లో ఉన్న తేజా చాలా రోజుల తర్వాత తీసుకున్న ఆఫ్‌ అది.

తేజా ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు.

తల్లి సుబ్బలక్ష్మి,  చెల్లి అర్చన ఆటపట్టిస్తారు.  అల్లరల్లరి చేస్తారు.

అంతేనా!

ఇంటికి  ఫెస్టివల్‌  మూడొచ్చినట్లు...  ప్రత్యేక వంటకాలు చేస్తారు.

డ్రాయింగ్‌రూం లో ‘ టీవీ క్షణం’లో తేజ క్షణాలు ఖర్చుచేస్తుంటే కిచెన్‌లో ఆ ఇద్దరూ పనుల్లో మునిగి తేలుతున్నారు. ఇంతలో తల్లి అంది`‘‘ వెంటనే వాడికో చుప్ప నా తిని కట్టి పడేస్తే ఎంచక్కా ఈ కిచెన్‌ అప్పగించేయొచ్చు. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ గ్యాస్‌ మంటల్తోనే కాలక్షేపమవుతోంది’’ విసుక్కుంటున్నట్టు అంటున్నా... వెంటనే తేజాకి పెళ్లిచేయాలనే ఆత్రుత తల్లి మాటల్లో వ్యక్తమవుతోంది.

ఆ మాటల్ని వింటున్న తేజా నవ్వుకున్నాడు. కోడలి పిల్లంటే కిచెన్‌కే  పరిమితమా? అప్పడాలు, అట్లకాడల్తో వంటిల్లుని రాసిచ్చేయడమా? తనకు కోడలే కావచ్చు. వరించి వచ్చిన ఆమె తన అర్ధాంగి. అంటే, తన అర్ధ భాగం. నాశ్వాస, నాధ్యాస, నా ఆశలన్నీ ఆమె. ఆమె వస్తే హృదయంలోకి ఆకుపచ్చ ఆమని విచ్చేసినట్లే. తను ఆమె నడుం పట్టుకుని నడిపిస్తుంటే, అలవోకగా ఆమె తన తలని భుజంపై వాల్చడంలో ని సొగసు అనుభవించాల్సిందే తప్ప వర్ణించడానికి వీల్లేదు. వెన్నెల్లో షికార్లు, పచ్చిక తిన్నెలపై పవళింపులు, వెచ్చని శ్వాసల్తో వేడెక్కించుకోవడాలు... ఓప్‌ా!  ఒంటరితనాన్ని వెలివేసే జంటజావళి కన్రెప్పల్లో వికసించే వెలుగు జిలుగుల దీపావళి.

ఊహల పల్లకిలో ఊరేగుతుంటే...

‘‘మమ్మీ... మనింటికి త్వరలో వదినొచ్చేస్తోందే’’ గట్టిగా అరుస్తోంది అర్చన.‘‘ఏంటీ అర్చనా!  ఏమంటున్నావ్‌?’’  అంతే స్థాయిలో కిచెన్‌లోంచి సుబ్బలక్ష్మి కూడా  అరుస్తోంది. డ్రాయింగ్‌రూంలోకూచునిటీవీచూస్తున్నతేజాఆఇద్దరిమాటలకిఉలిక్కిపడ్డాడు.

‘‘అర్చనకువదినంటే...తనకుభార్యేగా? తనకుతెలీకుండాతనభార్యఈఇంట్లోకివస్తోందా? అదీఅర్చనచెప్తోందా? ఇంట్లోకి తుఫానేదో వస్తున్నట్లే ఉంది..’’అనుకుంటూ ఒక్క ఊదుటున సోఫాలోంచి లేచి కిచెన్‌లోకి ఓ దూకు దూకాడు తేజ.

‘‘ఏంటే... ఏమంటున్నావ్‌ నువ్వు?’’ అడిగాడు అర్చన చెవి మెలిపడుతూ.

‘‘మమ్మీ!  అన్నయ్య చూడవే’’ అంటూ ఫిర్యాదు చేసింది అర్చన.

‘‘ఏంట్రాగొడవ?’’ అంటూసుబ్బలక్ష్మివచ్చితేజచేతుల్లోంచిఅర్చననివిడిపించింది.

‘‘చూడు ...ఇదేంవాగుతుందో?’’ అన్నాడుతేజ.

‘‘ఉన్నమాటంటేఉలుకెక్కువంటారు’’అందిఅర్చన.

‘‘ఉన్నమాటేంటే?’’ మళ్లీ అర్చనను దొరకపుచ్చుకునేందుకు తేజ ప్రయత్నించాడు.  వాడి చేతికి దొరక్కుండా అర్చన అమ్మచీర చాటున దాక్కుంది.

‘‘ఏంట్రా ఈ అల్లరి...’’ అంది సుబ్బలక్ష్మి ముద్దుగా ఇద్దర్నీ కసురుతూ.

‘‘చూడమ్మా... వదినొస్తుందంటూ ఎలా అల్లరి పెడుతోందో?’’

‘‘అన్నయ్య పెళ్లిచేసుకుంటే వచ్చేది వదినే కదమ్మా’’అడిగింది అర్చన అమాయకంగా.‘‘ఔను... అన్నయ్య పెళ్లాం నీకు వదినే కదా!’’  అంది తల్లి.

‘అదే మాట చెప్తుంటే అలకెందుకో?’’ ‘‘ఇంతకీ వదిన్ని ఎక్కడ చూసావే?’’  అడిగాడు తేజ.

‘‘ఇదిగో... ఇక్కడే.  నీ డైరీలో...’’ అంటూ ఓ ఫొటో చూపించింది.  అర్చన చేతిలోంచి ఆ ఫొటో సుబ్బలక్ష్మి లాక్కుని`‘‘ కుందనపు బొమ్మలా ఉందిరా!  ప్రేమించావా? అమ్మాయి పేరేంటీ?’’ అనడిగింది ఆత్రుత ఆపుకోలేక.

అప్పుడు చూసాడు ఆ ఫొటోని తేజా `‘‘ఓ.. అదా... అమ్మా!  నా డైరీలో ఇలాంటి ఫొటోలు లక్షఉంటాయి. పోలీస్‌ కేసులకు సంబంధించిన ఫొటోలవి.  ప్రోగ్రాం చేసేందుకు తెస్తుంటాం...’’

‘‘ఇంతకీ ఈ అమ్మాయెవర్రా?’’ అడిగింది తల్లి.

‘‘ఆ అమ్మాయా? ఈ లోకంలోనే లేదు. చనిపోయింది. పేరు ప్రతిమ’’ చెప్పాడు.

‘‘అయ్యో పాపం!  ఏం... ఎందుకు చనిపోయింది?’’

‘‘అదే ఆరా తీస్తున్నాం...’’చెప్పాడు.  ఆ వెంటనే అర్చన వైపు తిరిగి`‘‘ పిచ్చి పిచ్చి వేషాలేయకు.  ఏ ఫొటోపడితే ఆ ఫొటోని చూపించి అమ్మని, నన్ను అల్లరి పెట్టకు’’ హెచ్చరించాడు తేజ కాస్త కటువుగా. ‘‘అన్నీ అబద్దాలే. నచ్చింది కనుకనే ఆ అమ్మాయి ఫొటోని డైరీలో పెట్టుకుని ఊరేగుతున్నాడు. పైగా చనిపోయిందంటూ అబద్దాలాడుతున్నాడు’’

‘‘ఆ  అమ్మాయి  గురించి నీకు తెలుసా? నాకు తెలుసా?’’ అడిగాడు తేజ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika