Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

పాపం మెగాస్టార్‌కి కథలే దొరకట్లేదు

megastar searching new stories
 
మెగాస్టార్‌ రీ ఎంట్రీ ఇచ్చే సినిమాకి కథ వెతకడం అంటే కష్టమే మరి. మెగా లెవల్లో ఉండాలి కదా.. 'బ్రూస్‌లీ' సినిమాతో రీ ఎంట్రీలో తొలిసారి ముఖానికి మేకప్‌ వేసుకున్న చిరంజీవికి అభిమానుల నుంచి ఆదరణ అంతగా దక్కలేదనే చెప్పాలి. దాంతో మెగా ఫ్యామిలీ కొంత డిప్రెషన్‌కు లోనైన సంగతి తెలిసిందే. పెద్ద డైరెక్టర్లు కొంత మంది తీసుకొచ్చిన కథలు చిరంజీవికి నచ్చకపోవడంతో ఎలాగో వెతికి, వెతికి చివరికి తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి' సినిమా రీమేక్‌లో నటించేందుకు దర్శకుడు మురుగదాస్‌కు చిరంజీవి ఓకే చెప్పాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది కూడా వర్కవుట్‌ కావట్లేదని తేలిపోయింది.

మళ్లీ కథల వేట మొదలయ్యింది. తండ్రికి తగ్గ కథ కోసం చరణ్‌ కూడా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడట. దాంతో చిరంజీవి మొదటనీ కెరియర్‌ మీద కేర్‌ తీసుకో.. తరువాత నా సంగతి ఆలోచిస్తాను అని చరణ్‌కి సలహా ఇచ్చాడట. దాంతో చరణ్‌ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గాడట. అంటే ఇప్పుడప్పుడే చిరంజీవి 150వ సినిమాకి ఇంకా లైన్‌ క్లియర్‌ కాలేదనే తెలుస్తోంది. 
మరిన్ని సినిమా కబుర్లు
samanta in depression