Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
samanta in depression

ఈ సంచికలో >> సినిమా >>

కోరిక తీర్చుకోలేకపోతున్న ప్రభాస్‌

prabhas missed bollywood entry
'బాహుబలి' సినిమాతో ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ 'బాహుబలి' సినిమా అసంపూర్తి సినిమా కాబట్టి దానితో అతని గుర్తింపు ఆగిపోలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. 'బాహుబలి 2' కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇంతలో డైరెక్టర్‌ రాజమౌళి 'బాహుబలి 2' నే కాదు. మరో సీక్వెల్‌ కూడా ఉందని సమాచారం ఇవ్వడంతో హీరో ప్రభాస్‌ గుండెల్లో రాయి పడ్డట్లయింది.ప్రభాస్‌ నుంచి 'డార్లింగ్‌' లాంటి లవర్‌ బాయ్‌ సినిమాను ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఇప్పుడప్పుడే ఆ కోరిక తీరేలా కనిపించడం లేదు. మరో పక్క 'బాహుబలి' తెచ్చిన క్రేజ్‌తో ప్రభాస్‌కు బాలీవుడ్‌ నుంచి అవకాశాలు తన్నుకొస్తున్నాయ్‌. 

గతంలో బాలీవుడ్‌ ఎంట్రీపై తనకి కోరిక ఉందన్న సంగతి చాలా సార్లు ప్రభాస్‌ తెలియజేశాడు. తీరా ఆ అవకాశం ఇప్పుడు రానే వచ్చింది. కానీ 'బాహుబలి' సీక్వెన్స్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడ ప్రభాస్‌ది. దాంతో ఆ కోరిక తీర్చుకోలేకపోతున్నందుకు చాలా ఫీల్‌ అవుతున్నాడట మన టాలీవుడ్‌ కండల వీరుడు ప్రభాస్‌. మన హీరో ఎప్పుటికి 'బాహుబలి' సీక్వెల్స్‌ నుంచి రిలీజయ్యి వేరే గెటప్‌లో కనిపిస్తాడో చూద్దాం. 
మరిన్ని సినిమా కబుర్లు
allu arjun comminig with biggest sensation movie