Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
prabhas missed bollywood entry

ఈ సంచికలో >> సినిమా >>

'రేసుగుర్రాన్ని' మించిన హిట్‌ కొడ్తాడట

allu arjun comminig with biggest sensation movie
 
బోయపాటి శీను దర్శకత్వంలో వస్తున్న అల్లు అర్జున్‌ సినిమా 'సరైనోడు'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఫైటింగ్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇంత వరకూ బన్నీ సినిమాల్లో లేని డిఫరెంట్‌ ఫైట్‌ సీన్స్‌తో, పవర్‌ఫుల్‌ మాస్‌ హీరోగా బన్నీని ఈ సినిమాలో ప్రేక్షకులు చూస్తారని డైరెక్టర్‌ బోయపాటి శీను చెబుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

అల్లు అరవింద్‌ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా మరో హిట్‌ని సొంతం చేసుకోవడానికి బన్నీ రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కేధరిన్‌ నటిస్తోంది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ 'రేసుగుర్రం'. ఆ తర్వాత వచ్చిన 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' కూడా చెప్పుకోదగ్గ విజయమే సాధించినా, 'రేసుగుర్రం'ను అందుకోలేకపోయింది. 'సరైనోడు'తో బన్నీ, 'రేసుగుర్రం'ను మించిన కమర్షియల్‌ హఙట్‌ కొడతాననే ధీమాతో ఉన్నాడట. ఆల్‌ ది బెస్ట్‌ బన్నీ. 
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam