Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ప్ర‌యోగాలు చేయ‌డం ఆప‌ను!  - క‌ల్యాణ్ రామ్‌
 
క‌ల్యాణ్ రామ్ చాలా డిఫ‌రెంట్‌. ఎప్పుడూ సినిమాల గురించి ఆలోచిస్తాడు. కానీ.. సినిమా ఫంక్ష‌న్ల‌లోనూ, పార్టీల్లోనూ క‌నిపించ‌డు. ఎక్కువ‌గా మాట్లాడ‌డు. త‌న గోల త‌న‌దే. త‌న మార్కెట్ స్టామినా ఏంటో త‌న‌కు తెలుసు. త‌న కోసం థియేట‌ర్ల‌కు జ‌నం ఎందుకొస్తారో కూడా తెలుసు. `నా స్టామినా నాకు అర్థ‌మైంది. నా మార్కెట్‌ని బ‌ట్టి సినిమా తీయాలంటే రిస్క్ చేస్తున్న‌ట్టే.  సొంత బ్యాన‌ర్ అయితే బ‌డ్జెట్ గురించి ఆలోచించ‌క్క‌ర్లెద్దు. అందుకే నా సినిమాలు నేనే తీసుకొంటా` అని నిజాన్ని ధైర్యంగా ఒప్పుకొంటాడు. క‌ల్యాణ్ రామ్ తీసిన ఏ సినిమా అయినా తీసుకోండి - త‌న బ‌డ్జెట్‌కి, త‌న మార్కెట్‌కి మించి తీసిన‌వే!  అయితే చాలా కాలం త‌ర‌వాత‌.. బ‌య‌టి బ్యాన‌ర్ లో న‌టించాడు క‌ల్యాణ్ రామ్‌. అదే షేర్‌. ఈవారం ఈ సినిమా థియేట‌ర్ల‌ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్  తో చిట్ చాట్‌.
 
* హాయండీ..
- హాయ్‌..

* చాలా రిలాక్డ్స్‌గా ఉన్న‌ట్టున్నారు...
- అలా క‌నిపిసిస్తున్నానా (న‌వ్వుతూ). సినిమా రిలీజ్ క‌దండీ. కొన్ని టెన్ష‌న్లు ఉంటాయి. 

* బ‌య‌టి ప్రొడ్యూస‌ర్ తో సినిమా చేశారు క‌దా... ఆ టెన్ష‌న్లు త‌ప్పాయేమో అనుకొన్నాం..
- అదేం లేదండీ. బ‌య‌టి ప్రొడ్యూస‌ర్‌కీ, సొంత సినిమాకీ నాకు తేడా తెలీదు. ఏ సినిమా అయినా ఒకేలా ఆలోచిస్తా. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ప‌టాస్ సినిమాకే నేను రిలాక్స్డ్‌గా ఉన్నానేమో. ప్రొడ్యూస‌ర్ ఎవ‌రైనా, ఇది నా సినిమా. అందుకే.. అన్ని విష‌యాలూ ప‌ట్టించుకొంటా. నిర్మాత ఎక్క‌డైనా ఎక్కువ ఖ‌ర్చు పెడితే.. ఆ సంగ‌తి చెప్పేసేవాడ్ని. ఓ పాట‌కు భారీ భారీ సెట్లు వేద్దామ‌నుకొన్నారు. అంత ఖ‌ర్చెందుకు..??  సీజీలో చేసేద్దాం అన్నాను. అలా.. నిర్మాత గురించీ ఆలోచిస్తా.

* షేర్ టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
- షేర్ లాంటి కుర్రాడ‌ని అర్థం. ఇంజ‌నీరింగ్ స్టూడెంట్‌. లోప‌ల ఒక‌టి అనుకొని బ‌య‌ట మ‌రోటి చేసే ర‌కం. అత‌ని మెంటాలిటీ అర్థం చేసుకోవ‌డం క‌ష్టం. 
అత‌ను ప్రేమ‌లో ప‌డితే... ఆ ప్రేమ‌ని ఎలా ద‌క్కించుకొన్నాడు.. అనే దే క‌థ‌.

* ఇలాంటి క‌థ‌లు చాలా వ‌చ్చాయి క‌దా.?
- గొప్ప క‌థ‌, ట‌ర్న్‌లు ట్విస్టులూ ఉంటాయ‌ని నేనూ చెప్ప‌డం లేదు క‌దా?  రెగ్యుల‌ర్ క‌థే, కానీ క‌మ‌ర్షియ‌ల్ వేలో చూపించాం.

* ప‌టాస్ త‌ర‌వాత మీకు క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లే వినిపిస్తున్నారా?
- అవునండీ.. ఎవ‌రు చెప్పినా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లే చెబుతున్నారు. నాకా అలాంటివి న‌చ్చ‌వు. ఏదో స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్ ఉండాల‌నుకొంటా. నిజానికి
షేర్ క‌థ‌.. ప‌టాస్ కంటే ముందే ఒకే చేశాం. ప‌టాస్ కంటే షేర్ ముందు విడుద‌ల కావాలి. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైంది. 

* ప‌టాస్ రిలీజ్ అయ్యాక‌.. షేర్‌లో ఏమైనా మార్పులూ.. చేర్పులూ
- ఎంట‌ర్ టైన్ మెంట్ పార్ట్ కోసం కొన్ని స‌న్నివేశాల్ని రీ రైట్ చేశాం. అంతేత‌ప్ప క‌థేం మార్చ‌లేదు.

* త‌మ‌న్ మ్యూజిక్ ఎంత వ‌ర‌కూ హెల్ప్ అయ్యింది?
- త‌మ‌న్ గురించి ఈరోజు కొత్త‌గా చెప్పేదేముంది?  మంచి క‌మ‌ర్షియ‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. త‌న రెండో సినిమా నాతోనే చేశాడు. కిక్ స‌మ‌యంలో సురేంద‌ర్ రెడ్డి ఆ పాట‌ల్ని వినిపించాడు. కొత్త‌గా ట్రై చేస్తున్నాడ‌నిపించింది. అందుకే నా జ‌యీభ‌వ‌లో అవ‌కాశం ఇచ్చా. అప్ప‌టి నుంచీ మా అనుబంధం కొన‌సాగుతోంది.

* వ‌న్య‌మిశ్రాని తొల‌గించి సోనాల్ చౌహాన్‌ని తీసుకోవ‌డానికి కార‌ణం?
- ఆమె త‌ప్పేం లేదండీ.. స్ర్కీన్ ప్రెజెన్స్ విష‌యంలో మాకే కొంచెం తేడా కొట్టిందంతే. ఒక్కొక్క‌రు ఒక్కో కంటికి అందంగా క‌నిపిస్తారు. మాకు ఎందుకో.. ఆన‌లేదు. ర‌షెష్ చూశాక‌.. ఆమెను తొల‌గిస్తే న‌యం అనిపించింది.

* మ‌రి ఆ స‌న్నివేశాల్ని రీషూట్ చేశారా?
- త‌ప్ప‌దు క‌దా? మ‌రీ ఎక్క‌వ సీన్లు కాదులెండి. రెండు మూడు స‌న్నివేశాలే.

* పటాస్ త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఇది.. అంచ‌నాలు ఎక్కువ‌వుతాయి క‌దా?
- అంచ‌నాలు ఉంటే మంచిదే. కానీ పోలిక‌లు వెత‌కొద్దు. రెండూ వేర్వేరు క‌థ‌లు, వేర్వేరు సినిమాలు. అలా చూస్తే.. ఖ‌చ్చితంగా షేర్ కూడా న‌చ్చుతాడు.

* ఇండ్ర‌స్ట్రీలో హిట్టే కౌంట్‌. కానీ మీరు మీకు రెండు ఫ్లాపులిచ్చిన మ‌ల్లికి మూడో అవ‌కాశం ఎలా ఇచ్చారు?
- మీర‌న్న‌ది నిజ‌మే. ఇక్క‌డ హిట్ కే వాల్యూ ఎక్కువ‌. ఓ హిట్టిస్తే... ఫ్లాప్స్ కూడా మ‌ర్చిపోతారు. అలాంటి హిట్టు... మ‌ల్లికి షేర్ రూపంలో  అందుతుంద‌ని నా న‌మ్మకం. ఎందుకంటే అత‌ను ఎంత క‌ష్ట‌ప‌డ‌తాడో నాకు తెలుసు. కానీ ఆ క‌ష్టానికి తగిని ప్ర‌తిఫ‌లం మాత్రం ఇంత వ‌ర‌కూ ద‌క్క‌లేదు. ఈ సినిమా మ‌ల్లి కోస‌మైనా ఆడాల‌ని కోరుకొంటున్నా.

* నిర్మాత‌గా కిక్ 2 మిమ్మ‌ల్ని బాగా నిరుత్సాహానికి గురి చేసిన‌ట్టుంది?
- అవ‌న్నీ కామ‌నే క‌దండీ. నాతో నేను తీసుకొన్న సినిమాలూ స‌రిగా ఆడ‌లేదు. దానికేమ‌నాలి?  హిట్టూ, ఫ్లాపూ.... వీటికి విప‌రీతంగా స్పందించడం మానేశా. ఆసినిమాకీ అంద‌రూ క‌ష్ట‌ప‌డ్డారు. కానీ... వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదంతే

* ఓం ఫ్లాప్ తో మీరు ప్ర‌యోగాల‌కు దూర‌మ‌య్యార‌నుకోవ‌చ్చా?
- మూడేళ్లు క‌ష్ట‌ప‌డిన తీసిన సినిమా ఓం. ఆ సినిమా నుంచి చాలా ఆశించా. కానీ అన్నీ రివ‌ర్స్ అయ్యాయి. ఓ క‌థ‌లో ఎక్కువ గంద‌ర‌గోళం ఉండ‌కూడ‌ద‌న్న విష‌యం అర్థ‌మైంది. అయితే నేను మాత్రం ప్ర‌యోగాల‌కు దూరం కాదు. చేస్తూనే ఉంటా. వ‌రుస‌గా రెండు కమ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తే చాలు..`నా టైప్ ఆఫ్  సినిమా` చేసేయాల‌నిపిస్తుంటుంది.

* త‌దుప‌రి సినిమా ఎప్పుడు, ఎవ‌రితో?
- ఇంకా ఏం అనుకోలేదండీ. అన్ని ప‌క్కాగా కుద‌రితే చెప్తా. ఈలోగా ఊహాగానాలు ఎక్కువ‌వ్వ‌డం నాకిష్టం లేదు.

* ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు?
- వ‌చ్చే యేడాది త‌ప్ప‌కుండా ఉంటుంది.

* మీ సినిమాల్ని తార‌క్ చూస్తుంటారా?  ఏమంటారు?
- త‌ను ఏమ‌న్నాడ‌న్న‌ది మా ఇద్ద‌రి మ‌ధ్యే ఉంటుంది. బ‌య‌ట‌కు చెప్ప‌కూడ‌దు... (న‌వ్వుతూ)

* ఓకే ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ 

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
movie review