Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review
చిత్రం: షేర్‌ 
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌ చౌహన్‌, ముఖేష్‌ రుషి, బ్రహ్మానందం, విక్రమ్‌జీత్‌, ఆశిష్‌ విద్యార్థి, పోసాని కృష్ణముఉరళి, ఎంఎస్‌ నారాయణ, అలీ, షఫీ, షయాజీ షిండే తదితరులు. 
చాయాగ్రహణం: సర్వేష్‌ మురారి 
సంగీతం: తమన్‌ 
దర్శకత్వం: మల్లికార్జున్‌ 
నిర్మాణం: విజయలక్ష్మి పిక్చర్స్‌ 
నిర్మాతలు: కొమర వెంకటరత్నం 
విడుదల తేదీ: 30 అక్టోబర్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే 
కుటుంబమంటే అమితమైన ప్రేమగలిగిన పవర్‌ఫుల్‌ యంగ్‌ స్టర్‌ గౌతమ్‌ (కళ్యాణ్‌రామ్‌). తన స్నేహితుడు ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్ళి జరుగుతోంటే, దాన్ని అడ్డుకుని, తన స్నేహితుడి పెళ్ళిని అతనిష్టపడ్డ అమ్మాయితోనే జరిపిస్తాడు గౌతమ్‌. అయితే ఈ క్రమంలో గౌతమ్‌, పప్పీ (విక్రమ్‌జీత్‌)తో గొడవపడ్తాడు. తన పెళ్ళిని అడ్డుకున్నాడన్న అక్కసుతో పప్పీ, గౌతమ్‌పై పగ పెంచుకుంటాడు. గౌతమ్‌ ప్రేమించిన నందిని (సోనాల్‌ చౌహన్‌)ని తాను పెళ్ళాడతానని పప్పీ సవాల్‌ విసిరి, నందినిని కిడ్నాప్‌ చేస్తాడు. అక్కడినుంచి ప్రియురాల్ని రక్షించుకునేందుకు గౌతమ్‌ ఏం చేశాడనేది మిగతా కథ. అది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
గౌతమ్‌ పాత్రలో కళ్యాణ్‌రామ్‌ ఒదిగిపోయాడు. ఫైట్లు బాగా చేశాడు, డాన్సులూ ఇరగదీశాడు. తన వరకూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు కళ్యాణ్‌రామ్‌. హీరోయిన్‌ సోనాల్‌ చౌహన్‌, నటనకన్నా గ్లామర్‌తోనే సరిపెట్టింది. అందాల విందు విషయంలో హద్దులు దాటేసింది. ఆమె గ్లామర్‌ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. 

విలన్‌గా నటించిన విక్రమ్‌ జీత్‌ జస్ట్‌ ఓకే. ముఖేష్‌ రుషి మామూలే. రావురమేష్‌, రోహిణి తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం నవ్వించే ప్రయత్నం చేశాడు. అలీ కామెడీ ఓకే. పృధ్వీ బాగా నవ్వించాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధుల మేర ఫర్వాలేదన్పించారు. 
కథ రొటీన్‌ అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌తో లాగించేశాడు దర్శకుడు. కథతోపాటు, కథనం విషయంలో కూడా కొత్తదనం కోసం ప్రయత్నించలేదు. రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌నే తీశాడు దర్శకుడు. పాటలు ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ కాస్త అవసరం అన్పించింది. చాలా చోట్ల బోరింగ్‌ సన్నివేశాలెక్కువ. వాటికి ఎడిటింగ్‌ కత్తెర పదును చూపడం అవసరం. డైలాగ్స్‌ బాగానే వున్నాయి. కొన్ని సీన్లలో పంచ్‌ డైలాగులు బాగా పేలాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైన సహకారాన్ని అందించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. రిచ్‌గానే సినిమా తెరకెక్కిందంటే నిర్మాణపు విలువలు బాగున్నట్టే కదా. 

ముందే చెప్పుకున్నట్టు కథలో మెరుపుల్లేవు. పెద్దగా ట్విస్టులు కూడా లేవు. ఒకటీ అరా ట్విస్ట్‌లతో రొటీన్‌ స్క్రీన్‌ప్లే, కథతో నెట్టుకొచ్చేశారు. ఫస్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విత్‌ యాక్షన్‌. సెకెండాఫ్‌లోనూ దాదాపుగా అంతే. అక్కడక్కడా బోరింగ్‌ సన్నివేశాలు. లాజిక్‌లు ఇలాంటి సినిమాల్లో వెతకడం అనవసరం. ఆడియన్స్‌ని పూర్తిగా నిరాశపరచదు. అలాగని పూర్తిగా ఆకట్టుకునే సినిమా కూడా కాదు. జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆశించేవారికి ఓకే అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్స్‌ని ఎంజాయ్‌ చేస్తూ, హీరోయిన్‌ గ్లామర్‌ని ఆస్వాదిస్తూ, రొటీన్‌ కామెడీకి నవ్వుకోగలిగితే షేర్‌ నిరాశపరచదు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
'షేర్‌' మరీ అంత షంషేర్‌ కాదుగానీ 

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5
మరిన్ని సినిమా కబుర్లు
megastar searching new stories