Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
crying tollywood comedy

ఈ సంచికలో >> సినిమా >>

అనుష్క డెడికేషన్‌ అద్భుతహ

superb anushka dedication
సన్నజాజిలా తయారవమని బొద్దుగా ఉన్న హీరోయిన్లను దర్శక నిర్మాతలు కోరితే, అదెంత పని అనంటారు. అదే కాస్త బొద్దుగా తయారవమంటే ఆలోచిస్తారు. బొద్దుగా తయారైతే వచ్చే కష్టాలు ఎక్కువే హీరోయిన్‌కి. దాన్ని అదుపులో పెట్టుకోడానికి నానా తంటాలూ పడాలి. అనుష్క అలా అనుకోలేదు. ఓవర్‌ వెయిట్‌తో కూడిన పాత్ర కోసం దర్శకుడు ప్రకాష్‌ అడిగీ అడగ్గానే అనుష్క ఛాలెంజింగ్‌గా తీసుకుంది. బరువెక్కింది. చాలా బరువెక్కింది. 'సైజ్‌ జీరో' కోసం అనుష్క చేసిన ఈ ప్రయత్నానికి తెలుగు సినీ పరిశ్రమ ఆశ్చర్యపోయిందనడంలో సందేహం లేదు.

అనుష్క నిజంగా బరువు పెరగలేదు, అదంతా ట్రాష్‌ అన్నవారికి 'సైజ్‌ జీరో' ఆడియో వేడుకకు హాజరైన అనుష్కే సమాధానం. సహజంగా యోగా టీచర్‌ కావడంతో అనుష్కకి బరువు మళ్ళీ తగ్గడం మరీ కష్టమైన పని కాదు. కానీ, కొంచెం కష్టమే. సినిమాలో అనుష్క రియల్‌గానే కనిపించింది. ఆమె డిడికేషన్‌ గురించి ఎంతలా, ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువ కాదు. అందుకే అనుష్క ఓ 'అరుంధతి' సినిమా చేసింది, ఓ 'బాహుబలి' చేసింది, ఓ 'రుద్రమదేవి' చేసింది. ఓ 'సైజ్‌ జీరో' చేసింది. అనుష్క కాక ఇంకెవరూ ఈ సాహసం చేయలేరు. 
మరిన్ని సినిమా కబుర్లు
sardar on full josh