Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
superb anushka dedication

ఈ సంచికలో >> సినిమా >>

ఫుల్‌ జోష్‌ మీదున్న సర్దార్‌

sardar on full josh
పవన్‌ కళ్యాణ్‌ అంటే ఎనర్జీ, పవన్‌కళ్యాణ్‌ అంటే పవర్‌, పవన్‌కళ్యాణ్‌ అంటే సరదా. ఇవన్నీ సరిగ్గా కుదిరి 'గబ్బర్‌సింగ్‌' పెద్ద హిట్‌ అయ్యింది. దాన్ని మించే హిట్‌ కొట్టడానికి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' రెడీ అవుతున్నాడు. బాగా గడ్డం పెంచేసి, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాకి ముందు ఓ రకమైన లుక్‌లో కనిపించిన పవన్‌, ఇప్పుడు నీట్‌ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ఆ గడ్డం లుక్‌ సినిమా స్టిల్‌ పరంగా రివీల్‌ కాలేదు. కానీ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' హ్యాండ్సమ్‌ స్టిల్స్‌ ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయి.

యూనిట్‌ సభ్యులతో గన్‌ పట్టుకుని పవన్‌ ఉన్న స్టిల్స్‌ అయితే పరిశ్రమ, ప్రేక్షక వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. సినిమాలో ఆద్యంతం కామెడీ ఉంటుంది. అవసరమైనంత యాక్షన్‌ ఉంటుంది. పంచ్‌ డైలాగులకైతే కొదవే లేదట. పవన్‌కళ్యాణ్‌తో కలిసి ఆయన స్నేహితుడు శరద్‌ మరార్‌ నిర్మిస్తున్న చిత్రమిది. బాబి ఈ చిత్రానికి దర్శకుడు. ఎక్కువ భాగం గుజరాత్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. సంక్రాంతి బరిలో నిలవనున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సృష్టించే సంచలనాలెలా ఉంటాయో చూడాలిక. 
మరిన్ని సినిమా కబుర్లు
akhil new angle