Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akhil new angle

ఈ సంచికలో >> సినిమా >>

త్రిష డిమాండ్‌ పెరుగుతోంది

increased trisha demand
కెరీర్‌లో త్రిష ఎన్నో ఎత్తుపల్లాల్ని ఎదుర్కొంది. వాస్తవానికి త్రిష కెరీర్‌ సాఫీగా ఏమీ ప్రారంభం కాలేదు. ఫ్లాపులతో కెరీర్‌ అయిన త్రిష కెరీర్‌ సూపర్‌ హిట్స్‌తో ఊపందుకుంది. మళ్ళీ డీలాపడింది. అంతలోనే తేరుకుంది. పెళ్ళి వార్తలతో త్రిష సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తుందనుకునేలోపు కొన్ని కారణాలతో ఆ పెళ్ళి ఆగిపోయి, తిరిగి సినిమాలతో త్రిష బిజీ అయిపోయింది. ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉందంటే, కోటి పైనే త్రిష రెమ్యునరేషన్‌ డిమాండ్‌ ఉందట. ఎంత డిమాండ్‌ ఉన్నా, నిర్మాతల శ్రేయస్సుని కోరి సినిమాలు చేస్తుందట త్రిష. 'నాయకి' అనే సినిమాలో చేస్తున్న త్రిష, కమల్‌హాసన్‌తో ఇంకో సినిమా చేస్తోంది.

అలాగే కమల్‌తో కలిసి సినిమాల్ని నిర్మించాలనే ఆలోచనలో కూడా త్రిష ఉన్నట్లు సమాచారమ్‌. తెలుగులో ఓ అగ్ర హీరో నటించే సినిమాలో త్రిష హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారమ్‌. ఇది కాకుండా చర్చల దశలో ఆరు పెద్ద ప్రాజెక్టులు ఉండడంతో త్రిష కెరీర్‌ మళ్ళీ జోరందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆల్‌ ది బెస్ట్‌ టు చెన్నయ్‌ బ్యూటీ త్రిష.
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam