Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
హీరోయిన్ అంటే.. అందంగా క‌నిపించాల్సిందే  - సాయేషా సైగ‌ల్‌

అఖిల్ తొలి సినిమాలో క‌థానాయిక ఎవ‌రు??  అనే అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. క్రేజీ సినిమా కాబ‌ట్టి.. పేరున్న క‌థానాయిక‌నే తీసుకొస్తార‌నుకొన్నారు. కొంత‌మంది బాలీవుడ్ స్టార్ క‌థానాయిక‌ల పేర్లూ చ‌ర్చ‌కు వ‌చ్చాయి. రాశీఖ‌న్నా, ర‌కుల్ రేసులో నిలిచారు. వీళ్లంద‌రికీ షాక్ ఇస్తూ.. అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది సాయేషా సైగ‌ల్‌. తొలి సినిమాతోనే అంద‌రి దృష్టిలో ప‌డిపోయింది. న‌ట‌న విష‌యంలో ఇంకా నేర్చుకోవాల్సింది చాల‌నే ఉన్నా.. డాన్సుల విష‌యంలో మాత్రం అఖిల్‌కి నిజంగానే పోటీ ఇచ్చింది సాయేషా. తెలుగులో క‌థానాయిక‌గా నిల‌దొక్కుకొంటాన‌ని న‌మ్మ‌కంతో చెబుతున్న సాయేషాని ప‌ల‌క‌రించింది గోతెలుగు. ఆమె చెప్పుకొచ్చిన క‌బుర్లువి.

* హాయ్ సాయేషా...
- హాయ్‌ 

* అఖిల్ సినిమాకి వ‌స్తున్నరెస్పాన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది?
- చాలా హ్యాపీగా ఉంది. ఈసారి నేను దీపావ‌ళి పండ‌గ‌ని.. థియేట‌ర్ల‌లోనే జ‌రుపుకొన్నా. ఒక్క డైలాగ్ కూడా అర్థం కాలేదు. అంత‌గా అరుపులూ.. కేక‌లు. ఇంత స్పంద‌న క‌ళ్లారా చూడ‌డం ఇదే తొలిసారి. ఐ యామ్ హ్యాపీ.

* మీ పాత్ర‌కు మీ వ‌ర‌కూ న్యాయం చేశాన‌నే అనుకొంటున్నారా?
- నూటికి నూరు శాతం. వినాయ‌క్ గారు చెప్పింది చేశా. ఆయ‌న‌కు ఎలా కావాలో.. అలా చెప్పి చేయించుకొన్నారు.

* అఖిల్ స్పీడు చూస్తే ఏమ‌నిపించింది?
- అమ్మో.. అఖిల్ య‌మ ఫాస్ట్. డాన్సుల్లో అత‌ని వేగాన్ని అందుకోవ‌డం క‌ష్ట‌మైంది.

* సాయేషా నాకే పోటీ ఇచ్చింద‌ని అఖిల్ చెబుతున్నాడు..
- అదేం కాదు. త‌న స్పీడు అందుకోవ‌డం నాకు చాలా క‌ష్ట‌మైంది. స్వ‌త‌హాగా నేను డాన్స‌ర్‌ని. డాన్స్ నేర్చుకొని వ‌చ్చా. అయినా స‌రే.. అఖిల్ ముందు కాస్త ఇబ్బంది ప‌డ్డా.

* నాగార్జున ఏమైనా స‌ల‌హాలు ఇచ్చారా?
- నాగ్‌సార్‌ని క‌లుసుకోవ‌డం అఖిల్ ఆడియో ఫంక్ష‌న్లోనే. అంత‌కు ముందు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ఆయ‌న స‌ల‌హాలూ ఇవ్వ‌లేదు. అఖిల్ , నువ్వూ  మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ లా ఉన్నారు.. అన్నారు. 

* తొలి సినిమా క‌దా, సెట్లో కంఫ‌ర్ట్‌గానే అనిపించిందా?
- చాలా.. న‌న్ను కంఫ‌ర్ట్‌గా ఉంచ‌డానికి టీమ్ అంతా బాగా క‌ష్ట‌ప‌డింది... (న‌వ్వుతూ). ఫ‌స్ట్ నువ్వు కంఫ‌ర్ట్‌గా ఉండు.. ఆ త‌ర‌వాత కెమెరా ముందు ఈజీగా చేసుకొంటూ వెళ్లిపోతావ్‌... అంటూ వినాయ‌క్ సార్ చాలా ధైర్యం చెప్పారు.

* తెలుగులో సినిమా చేస్తానంటే ఇంట్లోవాళ్లు ఏమన్నారు?
- ఈ ప‌రిశ్ర‌మ గురించి చాలా గొప్ప‌గా చెప్పారు. `క‌ష్ట‌ప‌డితే... త‌ప్ప‌కుండా గుర్తింపు వ‌స్తుంది` అన్నారు. ద‌ర్శ‌కుడు చెప్పింది ఫాలో అయిపో.. అని స‌ల‌హా ఇచ్చారు.

* న‌ట‌న‌కు సంబంధించిన శిక్ష‌ణ తీసుకొన్నారా?
- లేదు. ఓ మెంట‌ర్ ఉండేవారు. ఆయ‌న ప్ర‌తిరోజూ ఇంటికొచ్చి, న‌ట‌కు సంబంధించిన విష‌యాల్లో కొంత త‌ర్ఫీదు ఇచ్చేవారు. ప్ర‌త్యేకంగా కోచింగ్ అంటూ తీసుకోలేదు.

* తెలుగు క‌ష్టం అనిపించ‌లేదా?
- మొద‌ట్లో ఇబ్బందిగా ఉండేది. త‌ర్వాత‌ర్వాత కొన్ని ప‌దాల్ని అర్థం చేసుకొన్నా. తెలుగులో స్ప‌ష్టంగా మాట్లాడ‌లేనుగానీ... ఎవ‌రైనా మాట్లాడితే అర్థం అయిపోతుంది. 

* అఖిల్‌కీ ఇదే తొలి సినిమా. మ‌రి త‌న న‌ట‌న చూస్తే ఏమ‌నిపించింది?
- అఖిల్ కి ఇదే తొలి సినిమా అంటే న‌మ్మ‌బుద్ది కాలేదు. న‌ట‌న‌లో చాలా ఈజ్ ఉంది. డెబ్యూ హీరోలా లేడు. ఇద్ద‌రూ యాక్టింగ్‌కి కొత్తే కాబ‌ట్టి.. ప‌ర‌స్ప‌రం స‌ల‌హాలు ఇచ్చిపుచ్చుకొనేవాళ్లం.

* షూటింగ్ స‌మ‌యంలో ఇబ్బంది ప‌డిన సంద‌ర్భాలు..
- ఏమాత్రం లేవు. నన్నో మ‌హారాణిలా చూసుకొన్నారు. అయితే.. ఆస్ట్రియా లో షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మాత్రం ఆ చ‌లికి త‌ట్టుకోలేక‌పోయా. మైన‌స్ డిగ్రీల సెల్సియ‌స్ ద‌గ్గ‌ర షూట్ చేశాం. అక్క‌డ వాతావ‌ర‌ణం ఇబ్బందిగా ఉండేది. అది త‌ప్ప‌.. ఇంకెప్పుడూ ఎలాంటి ఇబ్బందులూ తలెత్త‌లేదు.

* తెలుగు సినిమాలు చూస్తున్నారా?
- ఈమ‌ధ్యే మొద‌లెట్టా. బాహుబ‌లి, శ్రీ‌మంతుడు చూశా. ఇక వ‌రుస‌గా తెలుగు సినిమాలు చూస్తుంటా.

* ఏ హీరోతో న‌టించాల‌ని ఉంది..?
- హీరోల పేర్లు చెప్ప‌మంటే నా ద‌గ్గ‌ర పెద్ద లిస్టు ఉంది. చ‌ర‌ణ్‌, బ‌న్నీ, మ‌హేష్‌... ఇలా అంద‌రి పేర్లూ చెప్పాల్సిందే.

* గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై మీ అభిప్రాయం ఏమిటి?
- క‌థానాయిక అన్నాక గ్లామ‌ర్‌గానే క‌నిపించాలి. అందులో త‌ప్పేం లేదు. ముందు గ్లామ‌ర్ తార‌గా నిరూపించుకోవాలి. ఆ త‌ర‌వాతే.. న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న పాత్ర‌ల్ని ఎంచుకోవాలి.

* తెలుగులో కొత్త సినిమాలేమైనా ఒప్పుకొన్నారా?
- ఇంకా ఏం లేదు. ఒక‌ట్రెండు ప్రాజెక్టులు వ‌చ్చాయి. ఇంకా సంత‌కాలు చేయ‌లేదు.

* ఓకే ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
movie review