Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

మంచు మనోజ్‌ థ్రిల్లింగ్‌ లవ్‌ స్టోరీ

manchu manoj  trilling love story
ఇంతవరకూ మాస్‌ లుక్‌లోనే కనిపించి ఎంటర్‌టైన్‌ చేసిన మనోజ్‌ తొలిసారిగా క్లాస్‌లుక్‌లో కనిపించబోతున్నాడు. దశరధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మంచు మనోజ్‌ సినిమా 'శౌర్య'. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యింది. ఫస్ట్‌లుక్‌లోనే మంచు మనోజ్‌, రెజీనా జంట చాలా బాగుంది. సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా క్లాస్‌లుక్‌లో మంచు మనోజ్‌ ప్యాన్స్‌ని బాగా అట్రక్ట్‌ చేస్తున్నాడు. థ్రిల్లర్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇంతవరకూ హారర్‌ ధ్రిల్లర్స్‌, కామెడీ ధ్రిల్లర్స్‌ చూశాం. వెరైటీగా లవ్‌లో ధ్రిల్‌ని చూపిస్తానంటున్నాడు డైరెక్టర్‌ దశరధ్‌.

ఇంత వరకూ దశరధ్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలుగానే నిలిచాయి. 'శౌర్య' సినిమాతో డిఫరెంట్‌ జోనర్‌ని దశరథ్‌ టచ్‌ చేసినట్లుగా అనిపిస్తోంది. డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిశంబర్‌ నెలాఖరుకల్లా షూటింగ్‌ పూర్తి చేసుకుని, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు మనోజ్‌కు ఈ సినిమా కెరీర్‌లో మరో సక్సెస్‌ఫుల్‌ మూవీ అవుతుందని ఆశిద్దాం. 
మరిన్ని సినిమా కబుర్లు
victory venkatesh double dhamaka