Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review
చిత్రం: చీకటి రాజ్యం 
తారాగణం: కమల్‌హాసన్‌, త్రిష, ప్రకాష్‌ రాజ్‌, ఆశా శరత్‌, సంపత్‌, కిషోర్‌ తదితరులు 
ఛాయాగ్రహణం: జాన్‌ వర్గీస్‌ 
సంగీతం: గిబ్రాన్‌ 
దర్శకత్వం: రాజేష్‌ ఎం సెల్వ 
బ్యానర్‌: రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ 
నిర్మాత: చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌ 
విడుదల తేదీ: 20 నవంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోలో అధికారి సికె దివాకర్‌ (కమల్‌హాసన్‌), తోటి అధికారి (యోగి సేతు)తో కలిసి భారీగా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంటాడు. అయితే ఈ విషయం తెలుసుకునన డ్రగ్‌ డీలర్‌ విఠల్‌ రావ్‌ (ప్రకాష్‌ రాజ్‌), దివాకర్‌ కొడుకుని కిడ్నాప్‌ చేస్తాడు. తన డ్రగ్స్‌ తనకు ఇచ్చేస్తే, కొడుకును ఇచ్చేస్తానంటూ విఠల్‌ రావ్‌, దివాకర్‌ ముందు కాంప్రమైజ్‌ ప్రపోజల్‌ ఉంచుతాడు. దివాకర్‌ డ్రగ్స్‌ని వెనక్కి ఇచ్చేసి, తన కొడుకుని కాపాడుకోవాలని భావించినంతలోనే అతని మీద నార్కోటిక్స్‌ బ్యూరోకి చెందిన ఇద్దరు అధికారులు మల్లిక (త్రిష), కిషోర్‌ల నిఘా ఉంటుంది. అప్పుడు దివాకర్‌ ఏం చేశడు? కొడుకుని రక్షించుకున్నాడా? డ్రగ్‌ డీలర్‌ని పట్టుకున్నాడా? అనేది తెరపై చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 
విశ్వ నటుడు కమల్‌హాసన్‌ నటన గురించి కొత్తగా ఏం చెప్పగలం? అద్భుతమైన నటనతో దివాకర్‌ పాత్రకు ప్రాణం పోసేశాడు. ఇదివరకు కొన్ని సినిమాల్లో ఇలాంటి పాత్రలు చేసినా, దేనికదే కొత్త అన్నట్లుగా నటనలో కమల్‌హాసన్‌ చెలరేగిపోయాడు. కొడుకుని కాపాడుకునే క్రమంలో దివాకర్‌ పడ్డ తపన కనిపిస్తుంది తప్ప, కమల్‌హాసన్‌ అందులో కనిపించడు. దివాకర్‌ పాత్రలో జీవించేశాడు కమల్‌. పోలీస్‌ ఆఫీసర్‌గా త్రిష ఆకట్టుకుంటుంది. నెగెటివ్‌ రోల్‌లో ప్రకాష్‌ రాజ్‌ తన పాత్రకు ప్రాణం పోశాడు. కిశోర్‌, సంపత్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. 
కమర్షియల్‌ హంగుల కోసం అనవసరమైన కామెడీని జొప్పించలేదు. పాటలూ అవసరం అనుకోలేదు. చివర్లో మాత్రం ఒకే ఒక్క పాటను పెట్టారు. అది చాలా బాగుంది. సినిమా అంతా చకచకా జరిగిపోతుందంటే, కథనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెల్ళాడు గిబ్రాన్‌. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌, సినిమాటోగ్రఫీ దేనికదే. సినిమాటోగ్రఫీ అయితే సింప్లీ సూపర్బ్‌. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. అక్కడక్కడా స్లో అనిపించినా, ఇలాంటి సినిమాలకు అది కొద్దో గొప్పో తప్పదు.ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీనే ప్రాణం. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సెకెండాఫ్‌లో. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు. బావోద్వేగాల్ని నటీనటులు పండించేందుకు వీలుగా సన్నివేశాల్ని రాసుకున్నాడు. మాస్‌ మెచ్చే అంశాలు లేకపోవడం, క్లాస్‌ ఆడియన్స్‌లోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకునే వారికి నిరాశకు గురిచేయడం ప్రతికూలాంశాలు. అయితే యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాల కోసం ఎదురుచూసేవార్ని బాగా ఆకట్టుకుంటుంది. 

ఫస్టాఫ్‌ వేగంగా సాగిపోతుంది. సినిమాపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్‌ని సెకెండాఫ్‌లో కొనసాగించలేకపోవడం మైనస్సే. సెకెండాఫ్‌ అంతా ప్రిడిక్టబుల్‌గానే ఉంటుంది. యాక్షన్‌, థ్రిల్లింగ్‌, టేకింగ్‌ పరంగా సినిమా సూపర్బ్‌గా అనిపిస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
చీకటి రాజ్యం డీసెంట్‌ అటెంప్ట్‌ 

అంకెల్లో చెప్పాలంటే 
3.5/5 
మరిన్ని సినిమా కబుర్లు
movie review