Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌ అంటే ఇష్టమంటున్న నందిత

nandita likes mahesh
తేజ సినిమా 'నీకు నాకు' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల తెలుగమ్మాయి నందిత. మొదటి సినిమా ఆశించినంత విజయాన్ని అందివ్వకపోయినా, 'ప్రేమ కథా చిత్రమ్‌' సినిమాతో హీరోయిన్‌గా ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. చిన్న సినిమాలకు పెద్ద హీరోయిన్‌ అనే గుర్తింపు తెచ్చుకుందంటే చిన్న విషయం కాదు. నిఖల్‌తో ప్రస్తుతం చేస్తున్న 'శంకరాభరణం' సినిమా విడుదలకు సిద్ధమైంది. డిఫరెంట్‌ థీమ్‌తో, డిఫరెంట్‌ జోనర్‌లో, డిఫరెంట్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిశంబర్‌ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. నందిత నటిస్తున్న మరో సినిమా 'సావిత్రి' షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం కోస్తాలోని ఏలూరు ప్రాంతంలోని అన్ని ప్రదేశాలను తిలకిస్తుంది. అక్కడి ప్రజలకు సినిమా వాళ్లంటే ఎంతో అభిమానమనీ, తమను ఎంతో బాగా ట్రీట్‌ చేస్తున్నారంటూ కోస్తా ప్రజలను మోసేస్తోంది నందిత. పవన్‌ సాదినేని దర్శకత్వంలో వస్తునన ఈ సినిమాలో నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్నాడు. నచ్చిన హీరో ఎవరంటే, ఇంకెవరు మహేష్‌ అని మురిసిపోతోందీ తెలుగమ్మాయి. అయినా మహేష్‌ని ఇష్టపడని హీరోయిన్‌ ఎవరుంటారు? మహేష్‌ అన్న పేరులోనే వైబ్రేషన్స్‌ ఉన్నాయి మరి. మహేష్‌ బావ సుధీర్‌తో రెండు సినిమాలు చేసిన నందితకి, మహేష్‌తో నటించే ఛాన్సెప్పుడొస్తుందో చూడాలిక. 
మరిన్ని సినిమా కబుర్లు
surya as hero & vilan