Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
katrina was angry

ఈ సంచికలో >> సినిమా >>

చరణ్‌ 'ఆరెంజ్‌'ని మర్చిపోలేదు

charan never forget orange movie
 'మగధీర' సినిమా తర్వాత వచ్చిన రాంచరణ్‌ మూవీ 'ఆరెంజ్‌' అంచనాల్ని అందుకోలేకపోయింది. 'మగధీర'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రాంచరణ్‌ పూర్తి మేకోవర్‌ ఛేంజ్‌తో 'ఆరెంజ్‌' చేశాడు. లవర్‌ బాయ్‌లా కనిపించేందుకు రామ్‌చరణ్‌ ఎంతో కష్టపడ్డాడు. డాన్సులూ, పాటలు ఎంతో డిఫరెంట్‌గా అనిపించాయి. అయితే కాన్సెప్ట్‌ కన్‌ఫ్యూజింగ్‌గా ఉండడం, హీరోయిన్‌ యాక్టింగ్‌ ఓవర్‌ అయిపోవడంతో 'ఆరెంజ్‌' సినిమా పరాజయాన్ని చవిచూసింది. కెరీర్‌లో హిట్‌ సినిమాలే కాదు, ఫ్లాప్‌ సినిమాల్నీ గుర్తు పెట్టుకున్న రామ్‌చరణ్‌, అభిమానులతో ప్రేమగా ఈ సినిమా జ్ఞాపకాలను పంచుకున్నాడు. 'ఆరెంజ్‌' సినిమా అంటే తనకెంతో ఇష్టమనీ హార్ట్‌ టచింగ్‌ లవ్‌ స్టోరీ అనీ అన్నారు.

కమర్షియల్‌గా సినిమా ఆడకపోయినా, 'ఆరెంజ్‌' సినిమాపై రామ్‌చరణ్‌కి మమకారం ఎక్కువ. 'అంతవరకూ నా ప్రేమ మీకే' అంటూ అప్పటినుండీ విభన్న తరహాల్లో అభిమానులకు తన ప్రేమను పంచుతూనే ఉన్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ 'తనీ ఒరువన్‌' సినిమా రీమేక్‌లో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాంచరణ్‌ పక్కన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ తర్వాత బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని సమాచారమ్‌. 
మరిన్ని సినిమా కబుర్లు
raj tarun ready for double hatric