Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: జెస్సికా  గురించి పూర్తి వివరాలు సేకరిస్తాడు తేజా. తను రావడానికి పది నిముషాల ముందే జెస్సికా రెసిడెన్స్‌ అడ్రస్‌తో సహా రహస్యంగా సేకరించిన అన్ని వివరాలు ఆనందరావుకి అందింస్తాడు సిద్ధార్థ ఆ తరువాత...

  

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 లోకి సిద్దార్థ కారు ప్రవేశించింది.  విశాలమైన ఆ రహదారికిరు పక్కలా అంబరచుంబిత భవంతులు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. జన సంచారం అంతగా లేని ఆ పరిసరాల్లోని శబ్ధం తాండవిస్తోంది.

‘‘జెస్సికా గురించి సంపూర్ణంగా తెలుసుకున్నావ్‌ కదా! ఆమె ఉన్న స్ట్రీట్‌ లోకి వచ్చేసాం. ఇప్పుడు నీకో సింపుల్‌ క్వశ్చన్‌. అన్నీ తెలిసిన నువ్వు చిటికెలో ఆన్సరిస్తావనుకో. అయినా, ఎందుకో అడగాలనే క్యూరియాసిటీతో అడుగుతున్నా. ఈ చుట్టూ కనిపించే భవంతుల్లో తన రెసిడెన్సీ ఏదో చెప్పు’’ సవాల్‌ విసిరాడు సిద్దార్థ.

‘‘అంటే... నన్ను అనుమానిస్తున్నావా?’’ అడిగాడు తేజ.

‘‘నోనో! అనుమానం కాదు. ఆసక్తి. అంతే. తన గురించి ఆరా తీసే సందర్భంలో ఎన్నో సార్లు నువ్విక్కడికి వచ్చే ఉంటావు కదా! అందుకే... ఆమె చిరునామానీకుచిరపరిచితమేననిఅడిగా’’అంటూ కారును చాలా స్లోగా డ్రైవ్‌ చేస్తున్నాడు సిద్దార్థ.

‘‘అయితే, ఇంతసేపూ నే చెప్పిన విషయాలేవీ నువ్వు నమ్మలేదన్న మాట. డిటెక్టివ్‌ బుద్ది చూపించుకున్నావ్‌’’ అలకబూనాడు తేజ.

‘‘నమ్మాను కాబట్టే హుటాహుటిన బయల్దేరి ఇంత దూరం వచ్చాం. ఫణిభూషణరావు ద్వారా ఆమెకి ఏం జరక్కూడదనే భావనతోనే ఈ రిస్క్‌ తీసుకున్నాం. ఇక్కడి దాకా వచ్చాక ఆమె ఇల్లు నువ్వే చూపించాలని నా సరదా. అంతే’’అన్నాడు విండో లోంచి బయటకు చూపు సారిస్తూ సిద్దార్థ.

‘‘స్టాప్‌...స్టాప్‌! జెస్సికా ఇల్లు దాటి వచ్చేసాం’’ అని అరిచాడు తేజ.

‘‘ఔనా...?’’  అన్నాడు సిద్దార్థ.

‘‘మరి ఆ సంగతి చెప్పవేం.  ఎక్కడ తన ఇల్లు?’’ అన్నాడు బ్రేక్‌ వేస్తూ.

‘‘కారును బ్యాక్‌ చేయి...’’ సూచించాడు తేజ. సిద్దార్థ హారన్‌ మోగిస్తూ కారును వెనక్కి డ్రైవ్‌ చేస్తున్నాడు. ఓ భవంతి దగ్గరకొచ్చాక తేజా అన్నాడు`‘‘ ఈ లెఫ్ట్‌ సైడ్‌లోని బిల్డింగ్‌ లోనే జెస్సికా ఉంటోంది’’

‘‘కరెక్ట్‌గానే చెప్పావ్‌... నేను నీ మాటల్ని కంప్లీట్‌గా నమ్ముతున్నాను. నువ్వన్నట్లు జెస్సికా ఫణిభూషణరావు కూతురే’’ అంటూ కారు ఓ పక్కకి తీసి ఆపాడు సిద్దార్థ.  వెంటనే కారు నుంచి దిగిన తేజని అంతకు ముందే అక్కడికి వచ్చిన యాంకర్‌ వరలక్ష్మి విష్‌ చేసింది.

‘‘సర్‌! ఇందాకా మీరిచ్చిన ఫోన్‌ మెసేజ్‌ ఆధారంగానే పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ దగ్గర ఆమె కోసం వెయిట్‌ చేసాను. హాఫెనవర్‌ తర్వాత ఆమె కారులో వెళ్తూ కనిపించింది. వెంటనే నా స్కూటీతో వెంటాడాను. ఇప్పుడే మీకు మెసేజ్‌ ఇద్దామనుకుంటుండగా మీరే వచ్చారు’’ చెప్తోంది.

‘‘ఓకే... ఓకే! ఇక్కడ ఇంకేం మాట్లాడకు’’ అంటూ సైగ చేసాడు తేజ. ఇంతలో కారును కాస్త దూరంగా ఆపిన సిద్దార్థ వారిద్దరినీ చేరుకున్నాడు.

‘‘మీట్‌ మిస్టర్‌ సిద్దార్థ. సిటీలో ఫేమస్‌ డిటెక్టివ్‌. జెస్సికా కేసులో మనకు సాయపడుతోంది ఈయనే..’’ అంటూ సిద్దార్థ వైపు తిరిగిన తేజ` ‘‘బహుశా ఈమెను మీకు ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదనుకుంటున్నాను’’ అన్నాడు.

‘‘భలే వారు సర్‌! నేను...’’ అంటూ వరలక్ష్మి తనను తాను పరిచయం చేసుకోబోతుండగా`‘‘యాంకర్‌ వరలక్ష్మి. మా ఫ్రెండ్‌ తేజ్నక్రయిం బులెటెన్‌ని ఇన్నాళ్లు సమర్ధవంతంగా నిర్వహిస్తోంది మీరే కదా! తరచూ ఆ ప్రోగ్రామ్‌లో స్క్రీన్‌పై మిమ్మల్ని చూస్తుంటాను. ఇవాళ మిమ్మల్ని కలవడం నిజంగా సంతోషంగా ఉంది’’ అన్నాడు అభినందనగా కరచాలనం చేసేందుకు ఓ చేతిని ముందుకు చాపుతూ. వరలక్ష్మి కూడా అతడి చేతిని అందుకుని షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ`‘‘ఆ ప్రోగ్రామ్‌ కి రెస్పాన్స్‌ బాగా వస్తోంది’’ అంది. 

‘‘ఔను...నా ఎక్స్‌పీరియన్స్‌తో ఓ మాట చెప్పనా?’’ అడిగాడు సిద్దార్థ.

‘‘చెప్పండి’’ అంది వరలక్ష్మి.

‘‘సెక్స్‌, క్రైం ... ఈ రెండు అంశాలను బేస్‌ చేసుకుని నిర్వహించే ఏ ప్రోగ్రామ్‌కైనా వ్యూయర్స్‌ అట్రాక్ట్‌ అవుతారు. సెక్స్‌ ప్రతి ఒక్కర్నీ అలరించేది. అలాగే, క్రైం ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తుంది. ఎప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠే ప్రోగ్రామ్‌ని సక్సెస్‌ తీరాలకు చేరుస్తుంది’’ అన్నాడు.

‘మీ విశ్లేషణ బాగుంది’’ అంది వరలక్ష్మి.

‘‘అన్నట్లు... ఇక్కడికి వస్తామని మా ఇద్దరికే తెలీదు. ఆశ్చర్యంగా మీరూ ప్రత్యక్షమయ్యారు. నాకు తెలీక అడుగుతాను. మీ ఇద్దరి మధ్యా టెలిపతీ ఏమైనా వర్కవుటవుతోందా?’’ నవ్వుతూ అన్నాడు సిద్దార్థ.

‘‘టెలిపతా...? అదేం లేదు. ఈ కేసులో తనూ కోపరేట్‌ చేస్తోంది....’’ సమాధానమిచ్చాడు తేజ.

‘‘అయినా... మీ ఇద్దరి మైండ్‌ ఒకేలా ఆలోచిస్తున్నాయంటే సమథింగ్‌ స్పెషల్‌’’ అన్నాడు సిద్దార్థ.

‘‘సో...వరలక్ష్మి. మీరు ఆఫీసుకెళ్లండి. నేనిక్కడి విషయాలు ఆరా తీసి వస్తాను’’ అన్నాడు తేజ.

‘‘అలాగే సర్‌! సిద్దార్థగారూ వస్తానండీ’’ ఇద్దరి దగ్గరా సెలవు పుచ్చుకుంది వరలక్ష్మి.

‘‘అనూహ్యంగా వరలక్ష్మి ఎదురై క్రైసిస్‌ నుంచి తనని తప్పించింది. నిజానికి జెస్సికా నివాసమెక్కడో తనకు తెలీనే తెలీదు. ఆమె గురించి అన్నీ తెలిసినట్లు నోటి కొచ్చిన కోతలుకోసేస్తూ ఉంటే ఆమె గురించి ఆరా తీసిన సిద్దార్థ ఒక్కో సీక్రెట్‌ని బయటపెడ్తున్నాడు. అయితే, ఫణిభూషణరావు, జెస్సికా విషయంలో తను చెప్పినవన్నీ అబద్దాలే అని తెలిసిన తర్వాత సిద్దార్థ ఏ రకంగా రియాక్టవుతాడో?’’ పైకి కనిపించకుండా మనసు లోనే ఆందోళనపడుతున్నాడు తేజ. అంతలో నేతనని తాను సంభాళించుకుంటూ ఓ విషయంలో వివరాలు తెలుసుకోవాలంటే సామ దాన భేద దండోపాయాలు తప్పనిసరి. కించిత్‌ కౌటిల్యం, కాస్తం చాణక్యం అమలుచేసైనా అసలు సంగతి రాబట్టుకోవాలి. అవసర సమయాల్లో అబద్దాలు చెప్పడం కూడా నిజాయితీయే... అనుకున్నాడతడు.

‘‘ఇంతకీ ఇక్కడేం జరగబోతున్న దాఖలాలు లేవే?’’ అన్నాడు సిద్దార్థ.

‘‘తుఫాను ముందు ప్రశాంతత ఇలాగే ఉంటుంది’’ అన్నాడు తేజ తనని ఇంకా నమ్మిస్తూ.

‘‘కాసేపు ఇక్కడే మనం ఉందాం. ఏం జరగబోతోందో ఫస్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ మనకే తెలుస్తుంది’’ అన్నాడు మళ్లీ.  ఇద్దరూ పిచ్చాపాటి  ట్లాడుకుంటూ రోడ్‌ నంబర్‌ ఫార్టీ ఫైవ్‌ని ఆ చివర్నుంచీ ఈ చివరి వరకూ

ఈదేస్తున్నారు.  అలా ఒకసారి కాదు వరుసగా నాలుగు సార్లు అట్నుంచి ఇటూ, ఇట్నుంచి అటూ తిరిగారు. రాజకీయాలై పోయాయి. సినిమా కబుర్లు అయిపోయాయి. అక్కడికి వచ్చి రెండు గంటల పైనే గడిచింది.

జెస్సికా నివాసముంటున్న భవంతి నిశ్శబ్ధంగా ఉంది. అసలు తను ఇంట్లో ఉందో.. లేదో?  అనుమానం వచ్చిందిద్దరికీ.

‘‘ఊహూ! ఫణి భూషణరావు వ్యూహం వేరే ఉందేమో?’’ అనుకుంటున్నాడు సిద్దార్థ.

‘‘జెస్సికాతో ఏ అవసరం లేకపోతే ఆమె కోసం ఫణిభూషణరావు అంతలా ఎందుకు అర్రులు చాస్తాడు? అయితే, తను చెప్పిన కథలో నిజం ఉన్నా లేకున్నా ఇక్కడికి తప్పకుండా వచ్చి తీరుతాడు. ఎందుకంటేజెస్సికానుకలవాలికాబట్టి. అలా కలవడం కోసమే కదా... ప్రైవేట్‌ డిటెక్టివ్‌ చేత రహస్యంగా ఆమె ఉనికి గురించి తెలుసుకున్నాడు’’ అనుకున్నాడు.

మరో అరగంట గడిచిపోయింది. సిద్దార్థకు ఓపిక నశించింది.

‘‘ఇక్కడేం జరిగేట్లు లేదు. మనం వెళదాం పద’’ అన్నాడు కారు వైపు నడుస్తూ.

ఇక, తప్పనిసరి పరిస్థితిలో తేజ కూడా అతడ్ని అనుసరించాడు. ఇద్దరూ కార్లో కూచున్న తర్వాత సిద్దార్థ కారు స్టార్ట్‌ చేయబోతుండగా ఆ రోడ్డు కి ఓ కారు ప్రవేశించింది.  ఆ కారును ఆసక్తిగా చూసారిద్దరూ. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika