Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: జగదీష్ తన మనసులో చంద్రకళకు ఎలాంటి స్థానం వుందో చెప్తాడు. తను చంద్రకళ పట్ల   ఎంత ప్రొటెక్టివ్ గా వుంటాడో, తన మనసులోని అనంతమైన ప్రేమను చంద్రకళకు  వ్యక్తపరుస్తాడు. ఆ తరువాత..    

 

జగదీష్  కాసేపు యేమీ అనలేదు...

ఇంతలో నీరూఆంటీ కల్పించుకుని, రాణికి గుర్తు చేసింది....”రేపు లంచ్ టైం తరువాత, కొత్తగా వచ్చిన ఫ్లూటిస్ట్, తబ్లిస్ట్ తో,నీకుపాక్టీసులుంటాయని చెప్పానుగా తల్లీ.  అసలెలా కుదుర్తుంది?  ఈ సమయంలో ఈ పార్టీల ప్లానింగ్ కరెక్ట్ కాదమ్మా,” అందామె అసహనంగా.

“శారదా, గురువుగా మీరైనా చెప్పండి,” అమ్మతో నిస్సహాయంగా ఆంటీ.

తటపటాయిస్తూనే నోరు విప్పింది అమ్మ...”అవును, రేపు పొద్దుటే, వాళ్ళు తమ మహారాష్ట్రటూరు ముగించుకునిఇటు వస్తున్నారు.  మన టూర్ కి, ఇంకా వారమేగా. అందుకే, ఇక్కడ, రెండు రోజులు ప్రాక్టీసులు చేసుకొని, ఇళ్ళకి వెళ్లి ప్రయాణానికి ప్రిపేర్ అవుతారు.

పోతే, నీ లైట్ మ్యూజిక్ రిహార్సల్కినీవు ఉండడం అవసరం రాణీ.  లైట్ సాంగ్స్ కి నీకు సపోర్ట్ వీళ్ళేగా,”  వివరించింది ఆమె. 

కొద్దిసేపుమౌనంగా ఉండిపోయిన రాణిముఖంలో,అసహనం  స్పష్టంగా కనబడింది...

ఇంపాజిబిల్, ..... ఈటైములో ప్రాక్టీసు కుదరదు.  నేను జగదీష్ తో వాలెంటైన్స్డే ఈవెంట్స్ కి వెళ్లాలని,  ఎదురుచూస్తున్నాను. ఏదో ఒకటి ఆలోచించండి,” దురుసుగా రాణి...

అందరం నివ్వెరపోయాము.  కోటమ్మత్త నోరు నొక్కుకుంది. 

**

మరికాసేపటికి,నాన్న తనకుర్చీ నుండి లేచారు.

”అప్పుడే  టైం పదకొండు దాటింది.  ఇక మనం వెళదామా?” అన్నారు అమ్మతో.

నాన్న పిలుపుతో, మేమంతా కూడా వెళ్ళడానికి లేచాము.

“జగదీష్, నువ్వు  ఉండి  మాట్లాడి రా నాన్న.  మనింటికి ఐదు నిముషాల నడకేగా! త్వరగా వచ్చేయి.”  అంది అమ్మ అతనితో. అప్పటివరకు మౌనంగా ఉన్న జగదీష్, “ఉండండి మామయ్యా, ప్లీజ్,,,రెండే నిముషాలు,”... అన్నమాటలతో ఆగాము..

ఇబ్బందికరమైనఈవాతావరణాన్ని, జగదీష్ ఎలాసరిచేయగలడాన్న ఆత్రుత అందరిలోనూ కనబడుతుంది. రాణికి ఏమని సర్దిచెబుతాడోననినాకుఆదుర్దాగా ఉంది.  

రాణి వైపు తిరిగి, ఆమె చేతిమీద తట్టాడు జగదీష్.

“చూడురాణి, నీకో సంగతి చెప్పనా.  ఈరిహార్సల్స్ ఎంత ముఖ్యమో, నాకంటే నీకే బాగా తెలుసు.  అదీకాక,  నేను రిహార్సల్స్ అటెండ్ అయితే,నీ  పాట చాలాసేపు వినవచ్చు కూడా.లెట్ మి ఎంజాయ్ యువర్ సింగింగ్.  పార్టీలదేముంది?  ఐ డోంట్ కేర్ మచ్ ఫర్ పార్టీస్.  వాటి విషయం మర్చిపో,” రాణీకి వివరించాడు..

“రేపు పొద్దున్నే మనకి హాస్పిటల్ టూర్ కూడా ఉంది.  ఆతరువాతకాస్త రిలాక్స్ అయ్యి, నీవు రిహార్సల్స్ చేసుకో.  ఓకే,” మళ్ళీ జగదీష్.

పసిపిల్లలా కిలకిలా నవ్వింది రాణి.  “ఐ లైక్ దట్, నువ్వు చెప్పినట్టే చేస్తా.  కాని ఎల్లుండి జిమ్కాన క్లబ్బుకి మాత్రం తప్పదు.  రేపు రోజంతా ప్రాక్టీసు.కావాలంటే ఎల్లుండి పొద్దున్నే కూడా చేస్తాను.  అంతే...మా విదేశీ టూర్ కి ముందు నీతో పార్టీ లేకపోతే ఎలా?” అంది...

అసలు తనకిష్టమొచ్చినట్టు మాట్లాడేస్తుంది.... కోపంగా ఉంది నాకు.

“రాణిని మాట వినిపించి, మా జీవితాలని సుఖమయం చేయడానికి, నీ లాంటి వాడు మాకు దొరకాలోయ్ జగదీష్,” అన్నారు అంకుల్...

‘మరోసారి షాక్ అయ్యాను.  అంకుల్ ఇలా, ఇంత బాహాటంగా,ఈమాటలేమిటి?అసలేం జరుగుతుంది’ అని అనుకుంటుండగా,అంకుల్ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని గేట్ వైపు నడిచారు అమ్మావాళ్ళు.జగదీష్తో సహా అందరం వాళ్ళని అనుసరించాము...

**

పార్టీ నుండి ఇల్లు చేరాక,లేట్-నైట్ న్యూస్ చూస్తూన్ననాన్నవద్ద చేరాము.  పార్టీ గురించి తలా ఓ మాట అన్నారు.రాణి ప్రవర్తన అందరినీ కలవరపెట్టిందన్న విషయం అర్ధమయింది.

రాణి చిన్నపిల్లలాప్రవర్తించడాన్ని తప్పు పట్టారు, నాన్న.  “అసలుభూషణ్ఆ కూతుర్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది,” అన్నారు చిరాగ్గా.  అత్త ఏకీభవించింది.

అమ్మ ఒక్కతే,రాణిది‘మొండితనం’ అంటూ సమర్ధించింది...

జగదీష్ ఎటూ మాట్లాడలేదు.

ఏమైనానామనస్సులోనిఅలజడి మాత్రం ఎక్కువయింది...

అందరికీ‘గుడ్నైట్’ చెప్పిఅక్కడినుండికదిలాను..

“ఏమ్మా చంద్రా, రేపు నీకు స్టూడియోలో డాన్స్ షూట్ ఉంది...నేనేమో మధ్యాహ్నం నుండి రాణి రిహార్సల్లో ఉంటాను, తెలుసుగా,” అంటూ వెనుక నుండి గుర్తు చేసింది అమ్మ..

**

నిద్ర లేచేప్పటికే,బాగా పొద్దుపోయింది.  త్వరగా తయారయి, హాల్లోకి వచ్చి చూస్తే,ఎవరూ కనబడలేదు.నిశ్శబ్దంగా ఉంది.కాఫీ కోసం కిచెన్లోకి వెళుతుంటే, చేతిలో కాఫీ కప్పుతో, ఎదురొచ్చాడు, జగదీష్.

“చాంద్, నీ కోసమే కాఫీ చేసాను. కూర్చుని హాయిగా ఎంజాయ్ చెయ్యి.  మామయ్య స్టూడియోకి, వినోద్ గేమ్ కి వెళ్ళారు.  అత్తయ్య, కోటమ్మత్త గుడికి వెళ్ళారు... ఈ పాటికి వచ్చేస్తుండాలి,” అంటూ నా భుజం చుట్టూ చేయి వేసి డైనింగ్ వద్ద కూర్చోబెట్టాడు. 

కాఫీ సిప్ చేసి, “పర్వాలేదు బావ. రియల్లీ గుడ్ కాఫీ,” మెచ్చుకున్నాను..

“గ్లాడ్.  నాకు కాఫీ-టిఫిన్లు, వంట చేయడం కూడా వచ్చు మేడమ్,” నవ్వుతూవచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు.

“అయితే, ఇంటిపనుల్లో నాకంటే నువ్వే బెటర్అన్నమాట,” అన్నాను...

“అంతేగా,” నవ్వుతూ, తానింకా ఏమేమి డిషెస్ చేయగలడో చెప్పసాగాడు......

“మొత్తానికి మా అమ్మ చేతి కాఫీకి, ఏమీ తీసిపోలేదు నీ చేతి కాఫీ,”  ఫినిష్ చేసి కప్పు టేబిల్ మీదుంచాను.........

“థ్యాంక్యూ..  అలాగాయితే,  సదా నీ సేవలో కాఫీ నేనే చేస్తాను,” అంటూ నవ్వేసాడు.

“అది సరేగాని చంద్రా,  స్టూడియో మానేజ్మెంట్ ఉద్యోగంలో,మీ నాన్నసంతోషంగా ఉన్నారనిపిస్తుంది.  భూషణ్ అంకుల్, ఫ్యామిలీని ఆదుకున్నారనే  అనాలి..నా దృష్టిలో నీకు ఆయన ‘గాడ్ ఫాదర్’. నిన్ను ఈ స్థితికి తెచ్చింది అంకులే కదా!

వి షుడ్ ఫారెవర్  రెస్పెక్ట్ హిమ్,” అన్నాడు జగదీష్.

అతని మాటలు నిజమే అయినా కాస్త అసందర్భంగానే అనిపించాయి.  అదే మాట అడిగాను కూడా.  “ఇప్పుడు అంకుల్ మాట ఎందుకొచ్చింది,” అని.

“ఏంలేదు. మనకి, రాణి గురించి ఎటువంటి అభిప్రాయం ఉన్నా,ముందుగాఅంకుల్ గురించి కాస్తఆలోచించాలి... అని చెబుతున్నా,” ముఖాన అదే చిరునవ్వుతో జగదీష్.

విని మౌనంగా ఉండిపోయాను.

“చూడు చాంద్, రాత్రి పార్టీలో రాణి  ప్రవర్తన మనలని కలవరపెట్టింది కదా...నేను చెప్పేదేమంటే,రాణి సంగతి పట్టించుకోకు. నీవు హాపీగా ఉండు,” అంటూ నా చేయందుకున్నాడు. 

“వింటున్నావా?” అంటూ నా చేతివేళ్ళపై, మృదువుగా ముద్దు పెడుతుంటే, నాకు సుతిమెత్తగా చక్కిలిగింతలు పెడుతున్నట్టుగా అనిపించి, నా చేతిని వెనక్కి తీసుకోబోయాను.  మరింత బలంగా నాచేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.

“పుట్టినప్పటి నుంచి నేను తెలుసుగా నీకు.  ఇంకా సిగ్గా? లేక భయమా?”  నాముఖం లోకి సూటిగా చూస్తూ జగదీష్. 

“నొ, నొ,  అదేమీ లేదు,” తడబడ్డాను...

“సరేలే, ఇవాళ రోజంతా నీకు టి.విషూటింగ్ అంట కదా! అత్తయ్యతో నేనుమ్యూజిక్ రిహార్సల్ కి వెళ్తున్నా.  అదయ్యాక,నీ షూట్ చూడ్డానికి స్టూడియోకి కూడా వస్తాను.  రేపు మధ్యాహ్నం మాత్రం నుంగంబాకంలోని  మా రిలేటివ్స్ వద్దకు వెళతాను,” అన్నాడు....

‘అలా ఎలా రాగలవు’ అనిఅడగబోయిననన్ను ఆపేశాడు....కుర్చీ నుండి లేపి, నా చేయి పట్టుకుని హాల్లోకి నడిచాడు. 

తలవాకిలి వద్ద ఆగి, “ప్రేమగా నన్ను హగ్ చేసి, ‘బై’ చెపితే వెళ్ళనిస్తా,”  అంటూ నా ఎదురుగా నిలబడి, నా భుజాలపై  చేతులు వేసాడు.

సూటిగా అతని కళ్ళలోకి చూసాను. మరింత దగ్గరగా వెళ్లి, జగదీష్ చేతుల్లోవొదిగిపోయాను.

“నువ్వంటే నాకేమీ భయం లేదు,” నవ్వుతూ, తలెత్తి, అతనిమెడ మీద ముద్దు పెట్టాను.

“ఔనా? రియల్లీ?”  తిరిగి నా చెక్కిలిపై ముద్దు పెట్టాడు జగదీష్. 

ఇంతలో, కొద్దిదూరంలో, అమ్మ వాళ్ళ మాటలువినబడ్డంతో, జగదీష్ చేతుల నుండి విడివడి బయటకి నడిచాను.

**

“నువ్వురాగలుగుతావని అసలుఅనుకోలేదు బావ.  స్టూడియో నుండి నన్ను పికప్ చేయడమే కాక మంచిడిన్నర్ట్రీట్ ఇచ్చినందుకుచాలా థాంక్స్,” అన్నానుజగదీష్ తో ఇంట్లో అడుగుపెడుతూ.

హాల్లో, ఒక్క నాన్న తప్ప, అందరూ మా కోసమే వెయిట్ చేస్తున్నారు.  ఒక్కోరికి తను తెచ్చిన ఐస్క్రీం బకెట్స్ అందించాడుజగదీష్...

డాన్స్షూటింగ్ గురించి అడిగిన అమ్మకి, కాసేపు ఆ విషయాలు వివరించాను.

“మేము కాసేపు హారర్ మూవీ చూస్తాము.మాతో పాటుగాఎవరు చూస్తారో చెప్పండి,” అంటూనా పక్కనే సోఫాలో సెటిల్ అయ్యాడు జగదీష్.

ఐస్క్రీంతినడమయ్యాక, అర్ధరాత్రి దాటిందంటూ  అక్కడినుండివెళ్ళిపోయారు అమ్మ, కోటమ్మత్త.  మేము, వినోద్ మాత్రమే మిగిలాము మూవీ చూడ్డానికి. మూవీ చూస్తూ ఎప్పటికి నిద్రపోయానో కూడా తెలియలేదు.

**

“లేవండర్రా,  ముగ్గురు ఇలా సోఫాల్లోనే పడుకుండి పోయారు.  మంచి నిద్రల్లో ఉన్నారనిఇప్పటివరకులేపలేదు.  లంచ్ టైం డాఅయింది.పనులు  కానిచ్చి తినడానికి  రండి,” అమ్మ మేలుకొలుపుకి  ముగ్గురం లేచి అక్కడినుండి కదిలాము.

“చంద్రా,లంచ్ కానిచ్చి,రెండింటికంతా హాలుకి వెళ్ళాలి.ఇవాళఆర్కెస్ట్రాతో  ఫైనల్రిహార్సల్స్ అయిపోతే,  ప్రశాంతంగా ఉంటుంది.తిరిగొచ్చేప్పటికి చీకటి పడుతుందేమో కూడా,”  వెనుకనుండిఅమ్మ నాతో.

**

“మీ అందరిలా, ఇవాళ, నేనూ చాలా బిజీ,” అన్నాడులంచ్చేస్తూ జగదీష్. 

“సాయంత్రానికంతావచ్చేస్తావుగా!” అడిగింది అమ్మ...

“లేదత్తయ్యా,చెప్పడంమర్చిపోయాను... మా రిలేటివ్స్ ని చాలా రోజుల తర్వాత విజిట్ చేస్తున్నాను కదా.  రాత్రి వరకు అక్కడేఉండి, భోంచేసి వస్తాను.లేట్ అవుతుంది.. 

ఇంటిఫ్రంట్-డోర్  ది ఎక్స్ట్రా ‘కీ’ఇవ్వండి.  ఎవ్వర్నీ నిద్రలేపే అవసరం ఉండదు,” జవాబుగా జగదీష్.

“అదేమిటి బావా? రాణితో జింఖాన క్లబ్ పార్టీకి వెళ్ళవా?” అడిగాను.

“వస్తానని నేను తనకి చెప్పలేదే? పైగా నిన్న ఇంచుమించు రోజంతా రాణి రిహార్సల్స్ కి తనతోనే గడిపాను కదా! నాకువేరేపనులుండవా? మా రిలేటివ్స్ ని కలవాలి..  వాళ్ళతో టైం స్పెండ్ చెయ్యాలి...కాబట్టి, నోక్లబ్స్,  నో పార్టీస్.  రాణి ఏమనుకున్నా  నాకుపర్వాలేదు..  అదీ కాక,మళ్ళీఆ పార్టీ సంగతి తనుమాట్లాడలేదు.  నేనుఔననలేదు,”  లంచ్ ముగించి,  అందరికీ ‘బై’ చెప్పి, అమ్మ నుండి ‘కీ’ తీసుకొనివెళ్ళాడు.

‘నాకు మాత్రం,  అనుమానంగా ఉంది... రాణిఅంత ఈజీగా వదిలిపెడుతుందా, జగదీష్ ని ... ఫోన్లు చేసి మనిషిని రాప్పించకుండా ఉంటుందా?డౌటే....

కాని, మరోపక్క జగదీష్ అనేది కూడా కరక్టే’ అనుకుంటూ టేబిల్ క్లియర్ చేస్తున్న అమ్మకి  సాయంచేయ సాగాను..

**

‘మ్యూజియం థియేటర్’ లోరిహార్సల్స్ముగిసేప్పటికి, బాగా ఆలస్యమయింది.

ప్రాక్టిస్ బ్రహ్మాండంగా జరిగిందంటూ,  దారి పొడుగునా అమ్మ సంతోషంగా కబుర్లు చెబుతుంటే, మరో గంటకి ఇల్లు చేరాము..

“నాకు చాలా చాలా ఆకలిగా ఉందమ్మా....ఫ్రెష్ అయ్యి వస్తా, అర్జంటుగాభోంచేసాద్దాం,” అంటూఅమ్మతో పాటు, ఇంట్లోఅడుగుపెట్టాను.

హాల్లోఎదురుగాకూర్చునున్న రాణిని చూసి ఆశ్చర్య పోయాము.  కాస్తఎడంగా కోటమ్మత్త  కూడాఅక్కడేకూర్చునుంది.

అమ్మని చూస్తూనే ఆదుర్దాగా లేచి నిలబడింది రాణి.  నేను పలకరించినా, ముక్తసరిగా హలో చెప్పింది.

జిమ్కాన క్లబ్పార్టీకి లేట్ అయిపోతుందని, అమ్మతో,  చెప్పుకుంది. ఎంతోసేపటిగా, తనుజగదీష్ కి ఫోన్ చేస్తున్నా, ఆన్సర్ చేయడం లేదంటూ, ఫిర్యాదు చేసి, అతని గురించి వాకబు చేసింది.

జగదీష్ నుంగంబాకం లోని రిలేటివ్స్ వద్దకు వెళ్ళాడని అమ్మ చెప్పగా విని, రాణి వైఖరి అసహనంగా మారింది.  తనకా సంగతి చెప్పకపోగా, జగదీష్, తన ఫోన్ ఆన్సర్ చేయకపోవడాన్ని నిరసిస్తూ, అమ్మతోవాదన ధోరణిలో మాట్లాడ్డం మొదలుబెట్టింది.

రాణి వైఖరినచ్చక, అక్కడినుండి మెల్లగా నా గదిలోకి జారుకున్నాను...

ఫ్రెష్అయ్యేలోగా, కోటమ్మత్త నా గదిలోకి వచ్చింది..

రాణి  గొడవ చేసి,కోపంగా వెళ్ళిపోయిందని చెప్పిందామె.. 

అప్పటికి,టైం రాత్రి ఎనిమిదిదాటింది...

**

భోంచేసి హాల్లో టివి చూస్తూ కూర్చున్నాము.  పదకొండవుతుండగా, చేతిలో ఓ ప్లాస్టిక్ సంచీతో వచ్చాడు జగదీష్.  నచిన్నమ్మమ్మ వాళ్ళపెరటి లోని ‘జామకాయలంటూ,అమ్మ చేతికి  ఆప్లాస్టిక్ బాగు అందించి,మా ఎదురుగా కూర్చున్నాడు.

నుంగంబాకం వాళ్ళకబుర్లు చెప్పసాగాడు.అక్కడ పిల్లలచేత చాలాసేపు  క్రికెట్ ఆడించాడట.

రాణి వచ్చి వెళ్లిందన్న విషయం, అతనికి, అమ్మే చెప్పింది.

బిజీగా ఉండడంతో, ఫోన్ ఆన్సర్చేయలేదని, రాణి నుండి మిస్డ్ కాల్స్ చూశానని  జవాబిచ్చాడు జగదీష్.

మరికాసేపటికి,  అలసటగా ఉందంటూ, అందరికీ గుడ్నైట్చెప్పి  వెళ్ళాడు.....

**

రాణితో జరుగుతున్న సంఘటనలుపదేపదే గుర్తు రావడంతో, రాత్రిరెండు దాటినా నిదుర పట్టడం లేదు.

నవల చేతిలోకి తీసుకొని కాసేపు చదివాను.   అయినా కంగారు తగ్గలేదు...

మలేషియా ప్రయాణం ఇంకా నాలుగు రోజులన్నా ఉంది.. ఈ లోగా రాణి, జగదీష్ తో గొడవ పడుతుందేమోనని భయంగా ఉంది...

గజిబిజి ఆలోచనలతోనే,  గట్టిగా కళ్ళు మూసుకుని పడుకున్నాను....

**

“చంద్రా, త్వరగా బయటకి రా,” కోటమ్మత్త  గాబరాగా పిలుస్తూ  నా గది తలుపుపై కొట్టడంవినిపించి, ఉలిక్కిపడి లేచాను.

టి.వి న్యూస్ తో పాటు, హాల్లో నుండి అందరిమాటలు వినబడ్డంతో,పక్క మీదనుండి లేచి, హాల్లోకి పరిగెత్తాను.

నాన్న, వినోద్ టి.వి ఎదురుగా నిలబడి న్యూస్చూస్తున్నారు.విస్తుపోయి టి.వి చూస్తున్న  వారందరితో పాటు,రెండు నిముషాలు ఆవార్తలువిని, నేనూఅవాక్కయ్యాను. 

సంగతి గ్రహించాక,అక్కడేస్తంభించిపోయాను...

....‘జిమ్కాన క్లబ్ లో రెచ్చిపోయి ‘ప్రేమికుల రోజు’ సంబరాలు జరుపుకున్న యువతని అరెస్ట్ చేసారు నగర పోలీస్.  మగ, ఆడ తేడా లేకుండా మద్యం, మారక ద్రవ్యాలని  వాడుతున్నట్టు ఆచూకి దొరకడంతో, క్లబ్బుని ముట్టడించారు పోలిస్.   అరెస్టయిన వారిలో రాజకీయ నాయకుల వారసులు,  సినీ ప్రముఖుల ముద్దుబిడ్డలు ఉన్నారు.  రంజిత్ సూరి తో పాటు,  భూషణ్ సినీ స్టూడియో అధినేత కుమార్తె – గాయని రాణీ కూడా ఉన్నారు’.....

ఇంగ్లీష్ లో న్యూస్ తో పాటు పదేపదే విజ్యువల్స్ కూడా చూపిస్తున్నారు.  రాణీ పేరు, అంకుల్ పేరు అలా బజార్న పడడం  రించలేకపోయాను.  చుట్టూ ఉన్న అమ్మావాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాను. 

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam