Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anushka enjoys

ఈ సంచికలో >> సినిమా >>

బన్నీ 'సరైనోడు', సత్తా ఉన్నోడు

bunny is so talented person

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో బన్నీ హీరోగా వస్తున్న సినిమా 'సరైనోడు'. ఈ సినిమాతో బన్నీ కొత్త కొత్త ఫైట్‌ సీన్స్‌తో సందడి చేయనున్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌పై ఫైట్‌ సీన్లను తెరకెక్కించారట. రామ్‌లక్ష్మణ్‌, రవివర్మలు ఈ ఫైట్‌ సీన్లను కంపోజ్‌ చేశారు. అలాగే, ఫైట్‌ మాస్టర్‌ కిచ నేతృత్వంలో మరో కీలకమైన ఫైట్‌ సీన్‌ ఉండబోతోందట బోయపాటి శీను అంటేనే ఫుల్‌ మాస్‌. పవర్‌ఫుల్‌ సీన్స్‌కి కరువే ఉండదు. అంతేకాదు యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. యాక్షన్‌ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో ఆయన దగ్గరుండి తన మార్కు యాక్షన్‌ లుక్‌ని తీసుకురావడానికి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారట. ఇక బన్నీ యాక్షన్‌ లుక్‌ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా ఉంటుందట.

బన్నీ సరసన రకుల్‌, కేధరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌ ఈ సినిమాకు చక్కటి బాణీలు అందిస్తున్నారు. బన్నీ సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకుండా ఎలా? అందుకే సినిమాకి కావాల్సినంత ఎంటర్‌టైన్‌ని కూడా మిక్స్‌ చేశారట. అన్నీ కలిసి 'సరైనోడు' సినిమాని టాప్‌ ప్లేస్‌లో నిలబెట్టడం ఖాయమని అంటోంది యూనిట్‌. బన్నీ డాన్సులు, బన్సీ యాక్షన్‌, బన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, వీటికి బోయపాటి శ్రీను టేకింగ్‌ మిక్స్‌ అయితే ఇంకేమన్నా ఉందా? 'సరైనోడు' దుమ్ము రేపడం ఖాయమే. 

మరిన్ని సినిమా కబుర్లు
tollywood help hands too chennai