Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tollywood help hands too chennai

ఈ సంచికలో >> సినిమా >>

గర్జించడానికి సిద్ధమైన 'బెంగాల్‌ టైగర్‌'

bangal tiger ready to release

సంపత్‌ నంది డైరెక్షన్‌లో రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'బెంగాల్‌ టైగర్‌' సినిమా విడదలకు సిద్ధమైంది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న 'బెంగాల్‌ టైగర్‌' సినిమాలో రవితేజ, ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయనున్నాడు. బొద్దుగుమ్మ రాశీఖన్నా, మిల్కీబ్యూటీ తమన్నాలు తమ అందాలతో పోటాపోటీ కనువిందు చేయనున్నారు. 'కిక్‌ 2' సినిమా తర్వాత రాబోతున్న రవితేజ మూవీ ఇది. 'కిక్‌-2' నిరాశపరిచినా, 'బెంగాల్‌ టైగర్‌' అభిమానులకి పండగే అవుతుందట.

ఇప్పటికే రిలీజైన టీజర్‌తో ట్రైలర్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు మాస్‌ రాజా రవితేజ. సెన్సార్‌ బోర్డు సభ్యులు కూడా సినిమాని ప్రశంసించారట. 'ఏమైంది ఈ వేళ' సినిమాతో పరిచయమైన సంపత్‌నంది రెండో సినిమాకే రాంచరణ్‌తో 'రచ్చ' చేశాడు. కమర్షియల్‌ డైరెక్టర్‌గా సంపత్‌ నంది స్టామినాని నిరూపించింది ఆ చిత్రం. ముచ్చటగా మూడో సినిమా 'బెంగాల్‌ టైగర్‌'తో ప్రేక్షకులను అలరించడానికి సంపత్‌ నంది సిద్ధమవుతుండగా, 'బెంగాల్‌ టైగర్‌' తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఫిలిం అవుతుందనే ధీమాతో ఉన్నాడు మాస్‌ మహరాజ్‌ రవితేజ. 

మరిన్ని సినిమా కబుర్లు
fighting anushka for remuneration