Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bangal tiger ready to release

ఈ సంచికలో >> సినిమా >>

రెమ్యునరేషన్‌ కోసం అనుష్క గొడవ

fighting anushka for remuneration

మగ, ఆడ వ్యత్యాసం అనేది ఎప్పుడో పుట్టబడింది. అన్ని రంగాల్లోనూ ఆడవారి కన్నా మగవారు కొంచెం ఎక్కువ అనే భావన ఉంది. సినీ రంగంలో కూడా అదే సూత్రం నడుస్తూ వచ్చింది ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఆడవారు మగవారితో సమానంగా దూసుకుపోతున్న రోజులు. ఇలాంటి పరిస్థితుల్లో వివక్షను ఆడవారు తట్టుకోలేకపోతున్నారు. అసలీ సంగతెందుకు ఇప్పుడంటారా? బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ల విషయంలో చాన్నాళ్ల నుంచే రగడ జరుగుతోంది.

కంగనా రనౌత్‌, సోనమ్‌ కపూర్‌ లాంటి హీరోయిన్లు ఈ విషయంపై ఎప్పటినుండో పోరాటం చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఆ దారిలోకి చేరింది క్యూట్‌ బేబీ అనుష్క శర్మ. మగవారితో పోలిస్తే ఆడవాళ్లం ఎందులోనూ తక్కువ కాము. అలాంటప్పుడు హీరోలకిచ్చే రెమ్యునరేషన్‌తో పోలిస్తే హీరోయిన్లకిచ్చే రెమ్యునరేషన్‌ చాలా తక్కువ ఉంటుందనీ ఏంటని ఆడుగుతుంటే హీరోలు కాబట్టి అదంతే అంటుంటారు అని వాపోతోంది. అంతేకాదు విదేశాల షూటింగ్స్‌ టైంలో హోటల్‌ రూంల విషయంలో కూడా ఇదే వివక్ష చూపిస్తున్నారు. ఇదేం చోద్యం అని వాపోతోంది ఈ బ్యూటీ అనుష్కశర్మ. హీరోలతో సమానంగా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పిస్తోన్న హీరోయిన్లకు రెమ్యునరేషన్‌ కూడా హీరోలతో సమానంగా ఇస్తే తప్పేంటట? 

 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam