Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sunil is gold

ఈ సంచికలో >> సినిమా >>

'రోబో-2'లో నటిస్తున్నా: అక్షయ్‌కుమార్‌

akshay kumar in robo 2

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన 'రోబో' సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందనే వార్తలు ఎప్పటినుండో వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకి ఆ సినిమా సెట్స్‌ మీదికెళ్లింది. 'రోబో-2' సినిమా షూటింగ్‌ బుధవారం చెన్నైలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది.

'రోబో' సినిమాలో నటించిన అందాల ఐశ్వర్యం, బాలీవుడ్‌ భామ ఐశ్యర్యరాయ్‌ ఈ సినిమాలో కూడా నటిస్తోందిట. అయితే తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటిస్తోందని సమాచారమ్‌. మెయిన్‌ హీరోయిన్‌గా 'ఐ' సినిమా ఫేమ్‌ హీరోయిన్‌ అమీజాక్సన్‌ నటిస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించి, సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాడు. మిగిలిన చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో సినిమాలోని తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. 'రోబో'ని మించిన సాంకేతిక విలువలతో 'రోబో-2' రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
jakkanna ' bahubali 2 ' start