ముద్దు ముద్దుగా ఉండే అందాల బొమ్మలు ఇప్పుడు గ్లామర్‌తో పాటు భయాన్ని కూడా పుట్టిస్తున్నారు. హారర్ టచ్‌తో వస్తున్న చిన్న సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. 'ప్రేమకథా చిత్రమ్', 'గీతాంజలి', 'రాజు గారి గది', 'త్రిపుర' లాంటి సినిమాలు ఆ తరహాలోనే విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో అందాల బుల్లితెర యాంకర్ రేష్మి ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. డి.దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు ఉత్కంఠ రేపే సన్నివేశాలు కూడా ఉంటాయట. ఈటీవీ 'జబర్ధస్త్' ప్రోగ్రాంతో బాగా పాపులర్ అయిన రేష్మీ ఈ సినిమా తనకు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తోంది.
గతంలోనే రేష్మి పలు సినిమాల్లో నటించింది. అయితే 'జబర్‌దస్త్'తోనే ఆమెకు పాపులారిటీ పెరిగింది వెండితెరపై కొత్త ఇన్నింగ్స్‌లో రేష్మికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇంతకు ముందే 'గుంటూరు టాకీస్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది రష్మి. కొత్త ఇన్నింగ్స్‌లో అదీ హర్రర్ టచ్ ఉన్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టడానికి వస్తున్న అందాల రష్మి, వెండితెరపై హీరోయిన్‌గా సక్సెస్ అవ్వాలని, వరుసగా అవకాశాలు ఆమెకు రావాలని ఆశిద్దాం.
|