Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
పెద‌నాన్న‌గారిలా ఎవ్వ‌రూ కామెడీ చేయ‌లేరు -  వ‌రుణ్‌తేజ్

ఎత్తు ఆరుకి పైనే..
ప్ర‌భాస్ లాంటి ఫీచ‌ర్స్‌
మెగా ఫ్యామిలీ ఇంటి అడ్ర‌స్
ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉంటే.. ఎవ‌రైనా మాస్ పాత్ర‌లే కోరుకొంటారు. కానీ.. వ‌రుణ్ తేజ్ మాత్రం - క్లాస్ పాత్ర‌ల‌వైపే చూశాడు,
ఫ్యాన్స్ ఇష్టాల‌కు వ్య‌తిరేకంగా - ముకుంద‌, కంచెలాంటి సినిమాల‌తో ప్ర‌యాణం ప్రారంభించాడు. 
మూడో సినిమాకోసం.. పూరితో జ‌త‌క‌ట్టాడు. ఇంకేముంది..??  ఆయ‌న లోఫ‌ర్ అనే పేరు పెట్టి - వ‌రుణ్ ప‌ర్స‌నాలిటీకి త‌గ్గ క‌థ సిద్ధం చేశారు. ఇప్పుడాసినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చేసింది. ఈ సంద‌ర్భంగా మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌తో... గో తెలుగు బాతాఖానీ.

* లోఫ‌ర్ అనే టైటిల్...  ద‌ర్శ‌కుడేమో పూరి.. మాస్ కి ద‌గ్గ‌రయ్యే ప్ర‌య‌త్నం మొద‌లెట్టేసిన‌ట్టున్నారు?
- మాస్‌, క్లాస్ అనే లెక్క‌లు నేను చూసుకోను. అలాగైతే ఫ‌స్ట్‌సినిమానే ఓ మాస్‌క‌థ తో వ‌చ్చేవాడ్ని. ఏదోఓ వ‌ర్గానికే ప‌రిమిత‌మైపోను. డిఫ‌రెంట్ గా ఉందామ‌ని ర‌క‌ర‌కాల క‌థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నా. అందులో లోఫ‌ర్ ఒక‌టి.

* ముకుంద కంచెతో క్లాస్ హీరో అనిపించుకొన్నారు.. మ‌రి లోఫ‌ర్ ల‌క్ష్య‌మేంటి?
- ఇలాంటి పాత్ర‌లు కూడా వ‌రుణ్ బాగానే చేస్తాడులే అనుకొంటే చాలు. అంత‌కుమించిన ల‌క్ష్యాలేం లేవు.

* లోఫ‌ర్ అన‌గానే.. మీ ఫ‌స్ట్ రియాక్ష‌న్ ఏంటి?
- నిజం చెప్ప‌మంటారా..?  టైటిల్ నాకూ న‌చ్చ‌లేదు. కానీ కొంత షూటింగ్ గ‌డిచాక ర‌షెష్ చూసుకొన్నా... దీనికి లోఫ‌ర్ త‌ప్ప మ‌రో టైటిల్ సెట్ కాద‌నిపించింది.

* స్టార్ అవ్వాల‌నుకొంటే పూరితో ప‌నిచేస్తే చాలు అని ప్ర‌భాస్ చెప్పారు... ఈ సినిమాతో మీరు స్టార్ అయిపోయినట్టేనా?
- నాకు స్టార్ అని పిలిపించుకోవ‌డం కంటే న‌టుడుగా పిలిపించుకోవ‌డ‌మే ఇష్టం.  నా తొలి రెండు సినిమాలూ చూశాక 'మెగా ఇంట్లోంచి ఇప్ప‌టి వ‌ర‌కూ స్టార్లొచ్చారు.. తొలిసారి ఓ న‌టుడొచ్చారు..' అని కొంత‌మంది నాముందే అన్నారు. నిజానికి ఉత్తినే ఎవ్వ‌రూ స్టార్లు అవ్వ‌రు... స్టార్ అయిన ప్ర‌తి ఒక్క‌రూ న‌టుడిగానే ప్ర‌యాణం మొద‌లెడ‌తారు. నా ప్ర‌యాణం ఇప్పుడే క‌దా మొద‌లైంది.

* చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌... మీ ఇంట్లో ఇద్ద‌రుపెద్ద స్టార్లు ఉన్నారు. వీళ్ల‌లో మీకు బాగా స్ఫూర్తినిచ్చిందెవ‌రు?
- పెద‌నాన్న‌గారి సినిమాలు చూస్తూ పెరిగిన‌వాడ్ని.. నా స్ఫూర్తి కూడా ఆయ‌నే.

* ఆయ‌న సినిమాల్లో మీకు బాగా న‌చ్చింది;?
- చాలా సినిమాలున్నాయి. అయితే ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది నా స్వ‌భావానిని త‌గ్గ‌ట్టు ఉంటుంది. 

* మీ పెద‌నాన్న‌లో మీకు బాగా న‌చ్చిందేమిటి?
- ఆయ‌న్ని అంద‌రూ మాస్ హీరోగా చూస్తారు. కానీ ఆయ‌న‌లో కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. మేమెంత గింజుకొన్నా.. ఆయ‌నలా న‌వ్వించ‌లేం. ఇప్పుడున్న హీరోలెవ్వ‌రూ ఆయ‌న‌లా కామెడీ చేయ‌లేరు.|

* సినిమాల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమైనా స‌ల‌హాలిస్తారా?
- ఆయ‌న ప్ర‌త్యేకించి ఎవ్వ‌రికీ స‌ల‌హాలు ఇవ్వ‌రు. ఎవ‌రి ప్ర‌యాణం వాళ్లే చేయాలి అంటుంటారు. మేమంతా అదే పాటిస్తాం.

* చ‌ర‌ణ్‌, బ‌న్నీల సంగ‌తేంటి?
- వాళ్లూ అంతే.. మా ఇంట్లో కొత్త‌గా హీరోల‌వుదామ‌నుకొన్న‌వాళ్ల‌కు వీళ్లే స్ఫూర్తి. 

* మీ ఇంట్లోనే ఇంత మంది హీరోలున్నారు.. ఇది మీకు ప్ల‌స్సా, మైన‌స్సా?
- క‌చ్చితంగా ప్ల‌స్సే. ఎందుకంటే ఒక‌రికి ఒక‌రు స్ఫూర్తినిస్తుంటారు. నేనైతే... వీళ్ల‌లోనే కాస్త ప్ర‌త్యేకంగా క‌నిపించాల‌నుకొంటున్నా. 

* మీరంతా క‌ల‌సి న‌టించొచ్చుగా...
- అంద‌రూ క‌లిసి న‌టించ‌డం క‌ష్టం గానీ.. నాకు చ‌ర‌ణ్ అన్న‌య్య‌తో క‌ల‌సి ఓ సినిమా చేయాల‌ని ఉంది. ఈవిష‌యం అన్న‌తో కూడా చెప్పా.

* మెగా ఇంటి నుంచి వ‌చ్చిన హీరో అంటే డాన్సులు బాగా చేస్తార‌ని అభిమానులు ఆశిస్తారు.. ఈ విష‌యంలో మీరేం చేయ‌బోతున్నారు?
- తొలి రెండు సినిమాల్లో డాన్సులు చేసే అవ‌కాశం రాలేదు. లోఫ‌ర్‌లోనూ అంతంత మాత్ర‌మే. నిజానికి నేనేం బ్యాడ్ డాన్స‌ర్నికాదు. బాగానే చేస్తా. నేనేం చేసినా 100 శాతం ఎఫెక్ట్ పెడ‌తా. వ‌చ్చింది బాగా చేయాలి.. అంతే. 

* మ‌రి ఫైటింగులు..
- ఫైట్సంటే నాకు చాలా ఇష్టం. నా ప‌ని ఈజీగా అయిపోతుంది. అందులో కొంచెం క‌ష్ట‌మున్నా.. ఇష్టంగా చేస్తా.

* లోఫ‌ర్‌లో మీకు బాగా క‌ష్ట‌మ‌నిపించిన సీన్‌?
- సువ్వి సువ్వాల‌మ్మా పాట‌. అందులో ఏడిస్తూ.. పాట పాడాలి. ఆ సీన్ బాగా కష్ట‌మ‌నిపించింది. ఫ‌స్ట్ డే చేయ‌లేక‌పోయా. దాంతో షూటింగ్ కి పేక‌ప్ చెప్పేశారు. మరుస‌టి రోజు వ‌చ్చి.. ఆ షాట్లు తీశాం.

* మీ చెల్లాయి హీరోయిన్ అవుతోంది క‌దా..  మీ అభిప్రాయం ఏమిటి?
- త‌నలో చాలా ప్యాష‌న్ ఉంది. అది చూసి ఎవ్వ‌రూకాద‌న‌లేక‌పోయాం. తాను కొన్ని షార్ట్ ఫిల్స్మ్ చేసింది. అవి చూసి మేమంతా షాక్ అయిపోయాం. క‌చ్చితంగా చెబుతున్నా... మా ఫ్యామిలీ పేరు పెంచుతుందే త‌ప్ప‌.. చెడ‌గొట్ట‌దు.

* లోప‌ర్ త‌ర‌వాతేంటి?
- ఓ రెండు నెల‌లు గ్యాప్ తీసుకొంటా. క్రిష్ ఓ క‌థ చెప్పారు. నాకు బాగా న‌చ్చింది. దాన్ని వ‌ర్క‌వుట్ చేస్తాం.

* ఓకే. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ...

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
movie review