Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: లోఫర్‌ 
తారాగణం: వరుణ్‌ తేజ, దిశా పటాని, రేవతి, పోసాని కృష్ణమురళి, అలీ, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, సప్తగిరి, ధన్‌ రాజ్‌ తదితరులు. 
చాయాగ్రహణం: పి.జి. విందా 
సంగీతం: సునీల్‌ కశ్యప్‌ 
నిర్మాణం: సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీ భువశ్వేతా ఫిలింస్‌ 
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ 
నిర్మాత: సి.కళ్యాణ్‌ 
విడుదల తేదీ: 18 డిసెంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
భార్య లక్ష్మి (రేవతి)ని వదిలేసి, తన కొడుకు రాజా (వరుణ్‌తేజ్‌)ని తీసుకుని జోధ్‌పూర్‌కి వెళ్ళిపోతాడు మురళి (పోసాని). కొడుకు కూడా తనలానే లోఫర్‌లా పెరగాలని, ఆ విధంగా తర్ఫీదునిస్తాడు మురళి, రాజాకి. తన తల్లి ఎవరని రాజా అడిగితే, జాండీస్‌ వచ్చి చచ్చిపోయిందని మురళి, రాజాకి చెప్తాడు. ఇంకో పక్క ఇష్టంలేని పెళ్ళిని కాదనుకుని జోధ్‌పూర్‌కి పారిపోయి వస్తుంది పారిజాతం అలియాస్‌ మౌని (దిశా పటాని). మౌని ప్రేమలో రాజా పడతాడు. కానీ రాజా లోఫర్‌ కొడుకని తెలుసుకుంటుంది మౌని. కొన్ని ట్విస్ట్‌లతో మౌని, లక్ష్మి దగ్గరకు చేరుకుంటుంది. మౌని, లక్ష్మి దగ్గరకు ఎందుకు చేరుకుంది.? లక్ష్మి తన తల్లి అని రాజా తెలుసుకుంటాడా? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
మొదటి సినిమా 'ముకుంద'లో స్టడీ పెర్ఫామెన్స్‌ ఇవ్వాల్సి వచ్చింది వరుణ్‌కి. ఎమోషన్స్‌ని అండర్‌ ప్లే చేస్తూ చాలా సాఫ్ట్‌గా వరుణ్‌ ఆ సినిమాలో కనిపించాడు. 'కంచె'లో క్లాస్‌ టచ్‌ ఉన్న పెర్ఫామెన్స్‌ ఇవ్వాల్సి రావడంతో, ఇక్కడా అతనిలోని మాస్‌ యాంగిల్‌ బయటకు రాలేదు. పూరి సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో అందరికీ తెలుసు. వరుణ్‌ ఆ పాత్రలో ఒదిగిపోగలడా? అనుకున్నవారికి, ఒదిగిపోవడమేంటి? జీవించేశాడు అనేంతలా మాస్‌ క్యారెక్టర్‌లో రాణించాడు వరుణ్‌. డాన్సుల్లోనూ ఓకే అనిపించాడు. సెంటిమెంట్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు వరుణ్‌. ఫుల్‌ మాస్‌గా వరుణ్‌ని చూసినవారికి, భవిష్యత్తులో టాప్‌ 5 హీరోల్లో ఖచ్చితంగా వరుణ్‌ ఉంటాడనిపిస్తుంది. 

హీరోయిన్‌ దిశా పటానీ గ్లామర్‌కే పరిమితమైంది. పెద్దగా నటనకు ఛాన్స్‌ రాలేదు. వచ్చినా, ఆమె ఆకట్టుకున్నది లేదు. జస్ట్‌ ఓకే అనిపించిందంతే. రేవతి తల్లి పాత్రలో జీవించేసింది. అనుభవమంతా రంగరించి పాత్రకు ప్రాణం పోసింది. పోసాని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అలీ, బ్రహ్మానందం, ధన్‌రాజ్‌, సప్తగిరి కామెడీ పండించారుగానీ, పూరి సినిమాల్లో రెగ్యులర్‌గా ఉండే స్థాయికి ఈ సినిమాలో కామెడీ బ్యాచ్‌ హ్యూమర్‌ అందించలేకపోయారు. కామెడీ జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. ముఖేష్‌ రుసి మామూలే. 

పూరి జగన్నాథ్‌ తన సినిమాల్లో హీరోకుండే స్పీడ్‌, ఎనర్జీని వరుణ్‌కి ఆపాదించాడు. వరుణ్‌ కూడా దానికి న్యాయం చేశాడు. కథ మరీ కొత్తది కాదు, అలాగని పాతదీ కాదు. కథనం ఓకే. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కాస్ట్యూమ్స్‌ చాలా బాగున్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైన రీతిలో ఔట్‌పుట్‌ ఇచ్చింది. ఎడిటింగ్‌ అక్కడక్కడా అన్పిస్తుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. సినిమా చాలా క్వాలిటీతో తెరకెక్కింది. 

'అమ్మ నాన్న తమిళమ్మాయి' సినిమా షేడ్స్‌లోనే ఈ సినిమాకూడా ఉంటుంది. అయితే అందులో ఉన్న పెయిన్‌, స్పీడ్‌, కామెడీ ఇందులో కాస్త తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ పూరి తన ట్రేడ్‌ మార్క్‌ స్పార్క్‌లతో సినిమాని అక్కడక్కడా లేపాడు. వరుణ్‌ తన పెర్ఫామెన్స్‌తో పూరికి పూర్తి సహకారం అందించాడు. ఫస్టాఫ్‌ సోసోగా సరదా సరదాగా సాగిపోతుంది. అక్కడక్కడా యాక్షన్‌, అవసరమైన చోట ఎమోషన్‌ ఇలా ఫస్టాఫ్‌ సాగిపోతే, సెకెండాఫ్‌లో సెంటిమెంట్‌ డోస్‌ ఎక్కువయ్యింది. వరుణ్‌ పెర్ఫామెన్స్‌, పూరి టేకింగ్‌ మాస్‌ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తాయి. ఓవరాల్‌గా సినిమా మాస్‌ ఆడియన్స్‌కి ఓకే. సినిమాపై పెరిగిన అంచనాలు, చేసిన, చేస్తున్న పబ్లిసిటీ సినిమాని సేఫ్‌ జోన్‌లోకి లాగేస్తాయి. మాస్‌ ఆడియన్స్‌ ఈ చిత్రానికి రాజపోషకులు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
మాస్‌ మెగా ప్రిన్స్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
venky hit  guarenty with maruti