Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

25-12-2015 నుండి 31-10-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

..

మేష రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారి నుండి ఆశించిన విధంగా సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఒకేసారి అన్నిపనులు ప్రారంభించాలనే తొందరపాటు నిర్ణయాలు వద్దు, శక్తిమేర పనులను మొదలుపెట్టుట సూచన. ఊహించనిఖర్చులను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాల మూలాన స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. అవసరమైతేనే ప్రయాణాలు చేయుట మంచిది. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు మీలో ఉత్సాహాన్ని పెంచుటకు అవకాశం కలదు. మాత్రుసంభందమైన వ్యక్తులను కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం కలదు.       

 

 

వృషభ రాశి  ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఒకవార్త మూలాన కొంత ఇబ్బందిని పొందుటకు అవకాశం కలదు మానసికంగా దైర్యంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనుల మూలాన ఒత్తిడిని ఎదుర్కొంటారు, జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. బద్ధకం వీడండి పెద్దల సూచనలు పాటించుట అలాగే ప్రణాళికా బద్దంగా ముందుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో ఓడిడుడులను ఎదుర్కొంటారు పెట్టుబడుల విషయంలో మాత్రం తొందరపాటువద్దు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది వారి నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు.               

      

                  
మిథున రాశి : .ఈవారం మొత్తంమీద ఆరంభంలో చేపట్టు ప్రతిపనిలోనూ జాగ్రత్త అవసరం లేకపోతే నూతన సమస్యలను పొందుతారు జాగ్రత్త. ముఖ్యంగా నూతన్ లావాదేవీల విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. చర్చాసంభందమైన విషయాలలో పాల్గొనేటప్పుడు తోటివారి సూచనలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. చేపట్టినపనులను కాస్త ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్త అవసరం వీలైతే వాయిదా వేయుట అనేది సూచన. పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు కలుగుతాయి కొన్ని కొన్ని విషయాల్లో జవాబుదారి తనం పెరుగుతుంది జాగ్రత్త ఆచితూచివ్యవహరించుట అనేది సూచన. దూరప్రదేశం నుండి వార్తలు వినుటకు అవకాశం ఉంది గతకొంత కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు వస్తాయి. 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో అధికమైన సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు తలపెట్టుటకు ఆస్కారం కలదు ఆరంభంలో స్వల్ప ఇబ్బందులు ఏర్పడినను వాటిని అధిగమించే అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులనుండి అభినందనలు పొందుటకు అవకాశం కలదు అలాగే సూచనల మేర నడుచుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో చేసిన ఆలోచనల వలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. మాటలు మాత్రం పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. వారం చివరలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన మిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు.     

 

 

సింహ రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది ఎవరితోనూ మాటపట్టింపులకు పోకండి. దూరప్రదేశ ప్రయాణాలు చేయవలసి వస్తుంది వాటికి సమయం ఇస్తారు. రాజకీయపరమైన విషయాలకు సమయం ఇస్తారు పెద్దల నుండి నూతన విషయాలను తెలూస్కొనె అవకాశం కలదు. కుటుంభంలో సభ్యుల ఆలోచనలు నచ్చకపోవచ్చును సర్దుబాటు విధానం ఆవలంభించుట సూచన. ఉద్యోగంలో చేపట్టిన ఆలోచనలు మార్పును కలుగజేస్తాయి. తలపెట్టిన పనులను నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండు ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మిశ్రమ ఫలితాలు పొందుతారు ఖర్చులను తగ్గించుకోవడం అనేది సూచన.    

 


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది అలాగే మిత్రుల నుండి నూతన సమాచరం పొందుటకు ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. తలపెట్టిన పనులను కొంచం కొంచంగా పూర్తిచేసే అవకాశం కలదు. కుటుంభసభ్యుల ఆలోచనలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు వాటిని కొన్ని విషయాల్లో విభేదించే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో వచ్చు మార్పులు కొంత నిరుత్సాహాన్ని కలుగజేసిన తేరుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును దూరప్రదేశ ప్రయాణాలు మాత్రం కలిసి వస్తాయి. స్త్రీ సంభందమైన విషయాలకు సమయాన్ని ఇచ్చుటకు అవకాశం ఉంది.    

  

తులా రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఉద్యోగంలో చేపట్టిన పనులకు చక్కటి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకొనే అవకాశం కలదు. కాస్త ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటి గురించి సమయాన్ని కేటాయిస్తారు. తలపెట్టిన  అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. కొన్ని కొన్ని విషయాల్లో చేపట్టిన పనులను మల్లి మల్లి చేయవలసి రావోచ్చును జాగ్రత్త. చిననాటిమిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు నూతన విషయలను తెలుసుకుంటారు. సోదరులనుండి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనలు పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. 

 

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద ఆరంభంలో పనిఒత్తిడి ఉంటుంది ,స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. మిత్రులతో కలిసి గతంలో చేసిన ఆలోచనలు కాస్త ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో తోటివారి సహాకారం కోసం చేయుప్రయత్నాలు మిశ్రమఫలితాలను కలుగజేయుటకు అవకాశం కలదు. కుటుంభంలో పూర్తిస్థాయి సహకారం అన్డుతకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు. దైవసంభందమైన విషయాల్లో పాల్గొంటారు. మానసికంగా అనేకములైన ఆలోచనలతో సతమతమయ్యే అవకాశం కలదు. కొంతమంది మిమ్మల్ని అకారణంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో సర్దుబాటు విధానం మంచిది. 

 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఆరంభంలో బంధుమిత్రులతో కలిసి నూతన సంభందమైన విషయాల పట్ల చర్చలు చేయుటకు అవకాశం కలదు వారితో సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయల్లో గతంలో చేపట్టిన పనులకు గాను సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానేఉంటుంది మిత్రుల నుండి సహాకారం పొందుటకు అవకాశం కలదు. కుటుంభంలో సభ్యుల నుండి సూచనలు వస్తాయి వాటిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వారం చివరలో అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకొండి మంచిది.  ధనమునకు సంభందించిన విషయాల్లో ఇతరులకు దూరంగా ఉండుట అనేది మేలుచేస్తుంది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది అధికారులతో చర్చలలో పాల్గొంటారు. 

 

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం కలదు కావున ఈ విషయంలో కాస్త భాద్యతను కలిగి ఉండుట మంచిది. నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది. నూతన ఖర్చులకు అవకాశం ఉంది కావున అనవసరమైన ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పెద్దలనుండి పనిభారం పొందుటకు అవకాశం కలదు ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించుట వలన సమస్యలు తగ్గుటకు ఆస్కారం కలదు. నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనుల మూలాన నలుగురిలో గుర్తింపును పొందుతారు. సామాజిక దృక్పథం కలిగి ఉంటాఋ వాటికి సమయం ఇస్తారు. ఆర్థికపరమైన విషయల్లో సంతృప్తి కరమైన ఫలితాలు కలుగుతాయి. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండి వాటికి సమయం ఇస్తారు అలాగే పెట్టుబడులకు ఆస్కారం కలదు.నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది వాటికి అధికమైన సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగపరమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వేయుటకు అవకాశం ఉంది. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది వాటిని సమయ స్పూర్త్తితో వ్యవహరించి ఎదుర్కొంటారు. బంధువులతో కలిసి కొత్త కొత్త ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వారితో విందులలో పాల్గొంటారు. కుటుంభంలో ఒక సంతోషకరమైన వార్త  వినే అవకాశం కలదు.  

    

మీన రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి నూతన వ్యవహారవిషయాలకు సమయాన్ని ఇస్తారు. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో విఫలం అయ్యే అవకాశం ఉంది కొన్ని కొన్ని పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుట వలన ఒత్తిడి అలాగే చికాకుతప్పక పోవచ్చును. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది సంతృప్తికరమైన ఫలితాలు వచ్చుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నిదానం అవసరం. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకోనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచనచేయుట మంచిది. గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో ఫలితాలు రావడం వలన కొంత ఊరట చెందుతారు. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ఆలోచనలు కలిగి ఉన్నవారు ప్రయత్నాలు చేయుట సూచన ఫలితాలు అనుకూలంగా వస్తాయి.   

మరిన్ని శీర్షికలు
veekshanam