Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
who is the charan

ఈ సంచికలో >> సినిమా >>

రాజ్‌ తరుణ్‌ క్రేజ్‌తో కుర్రహీరో సక్సెస్‌?

raj tarun

రాజ్‌తరుణ్‌ హీరోగా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడొచ్చిన కుర్రహీరోల్లో ఈ హీరోదే హవా నడుస్తోంది. ఏ యంగ్‌ హీరోకీ రానంతగా ఇమేజ్‌ సంపాదించుకున్నాడు ఈ యంగ్‌ హీరో. అందుకు అతని నటన, డైలాగ్‌ డెలివరీనే కారణం. ముఖంలో అమాయకత్వం చూపిస్తూనే టన్నుల కొద్దీ హుషారు కూడా చూపిస్తాడు. చేసిన మూడు సినిమాలు విజయం సాధించాయి. అందుకే ఎక్కడ చూసినా ఈ హీరో పెద్ద టాక్‌ అయిపోయాడు. చేతి నిండా సినిమాలు, అందులోనూ క్రేజీ టైటిల్స్‌ ఇలా ఇంకా జోరు మీదున్నాడు రాజ్‌ తరుణ్‌.

ఇంత బిజీలోనూ తన తోటి హీరోల ఆడియో ఫంక్షన్స్‌లో తళుక్కున మెరుస్తున్నాడు. తాజాగా నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న 'అబ్బాయితో అమ్మాయి' సినిమాకు తన వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నట్లు సమాచారమ్‌. అబ్బా ఈ హీరోకి ఇంత టైం ఎక్కడిదో అంటూ కుర్రహీరోలు అసూయపడేలా ఉంది ప్రస్తుతం రాజ్‌తరుణ్‌ క్రేజ్‌. ఏమో ఈ క్రేజ్‌తోనే నాగ శౌర్య సినిమాకు విజయం తెచ్చి పెడతాడేమో చూడాలి. ఆ హీరో అదృష్టం కలిసి వచ్చి హిట్‌ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్యని విజయం వరించాలని ఆశిద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
sudheer babu