Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raj tarun

ఈ సంచికలో >> సినిమా >>

సుధీర్‌బాబు హీరోయిన్‌ జోరు భలే

sudheer babu

సుధీర్‌బాబు, వామిఖ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'భలే మంచి రోజు'. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది ముద్దుగుమ్మ వామిఖ. బాలీవుడ్‌లో 'జబ్‌ వీ మెట్‌' సినిమాలో కరీనాకపూర్‌కు చెల్లెలిగా చేసింది. ఇంకా హీరోయిన్‌ ఫ్రెండ్స్‌ క్యారెక్టర్స్‌లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. తమిళంలో ఈ భామ హీరోయిన్‌గా నటించిన సినిమా విడుదలకు రెడీగా ఉంది. తెలుగులో 'భలే మంచి రోజు' సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. బేసిక్‌గా కథక్‌ డ్యాన్సర్‌ అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాలో డాన్సులు కూడా అదరగొట్టేసిందట.

తెలుగులో కొత్తమ్మాయే అయినా చాలా జోరుగా నేచురల్‌గా నటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్ల్రైలర్స్‌లో చూస్తుంటే న్యూలుక్‌లో ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరో సుధీర్‌బాబు కూడా మంచి ఎనర్జిటిక్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. డాన్సులు, ఫైట్ల విషయంలో బాగా కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని తెచ్చిపెడ్తుందనే నమ్మకంతో ఉన్నాడు సుధీర్‌బాబు. శుక్రవారం క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానన్న ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. 

మరిన్ని సినిమా కబుర్లు
nenu shailaja