Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ప్రభాస్‌ మెప్పు పొందిన పంజాబీ బ్యూటీ

prbhas appreciated rashi khanna

సుధీర్‌భాబు, వామిఖ జంటగా తెరకెక్కిన సినిమా 'భలే మంచి రోజు'. క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యి సక్సెస్‌ ఫుల్‌గా ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వామిఖకు నటిగా మంచి పేరు వచ్చింది. తెలుగులో మొదటి సినిమానే అయినప్పటికీ ఆమె నటన పరంగా మంచి గుర్తింపు లభించింది. డాన్సుల్లో అదరహో అన్పించింది. యాక్టివ్‌గా గ్లామర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా మొదట హీరో ప్రభాస్‌తో కలిసి చూశారట చిత్ర యూనిట్‌. సినిమా చూసిన తరువాత ప్రభాస్‌ హీరోయిన్‌ వామికా గబ్బీని పొగడ్తలతో ముంచెత్తేశాడు. హీరో సుధీర్‌బాబు కొత్త కథల్ని ఎంచుకోవడంపై అభినందనల వర్షం కురిపించాడు ప్రభాస్‌. 'భలే మంచి రోజు' సినిమా ప్రమోషన్‌ కోసం ప్రభాస్‌ తనవంత ప్రయత్నం చేశాడు కూడా. ప్రభాస్‌ ఆశించినట్లుగానే 'భలే మంచి రోజు' సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది.

ముఖ్యంగా వామికా గబ్బి, ప్రభాస్‌ మనసుని గెల్చుకుంది ఈ చిత్రంతో. అందుకే ప్రభాస్‌, పలువురు దర్శక నిర్మాతలకి వామికా గబ్బి పేరుని సిఫారసు చేస్తున్నాడట కూడా. 'బాహుబలి-2'కి ఫిక్సయిన ప్రభాస్‌, ఛాన్సుంటే అందులో వామికకి ఛాన్స్‌ ఇప్పిస్తాడేమో అనుకుంటున్నారు ఇండస్ట్రీలో. ప్రభాస్‌ అనే కాదు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఇప్పుడీ న్యూ హీరోయిన్‌ అంటే స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
rashikhanna with bikinee