Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rashikhanna with bikinee

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌కి 'ఎనిమి' హాలీవుడ్‌ నటుడా?

mahesh entry with new look

ప్రస్తుతం 'బ్రహ్మూెత్సవం' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ మురుగదాస్‌తో అన్న సంగతి తెలిసిందే. మాఫియా బాక్‌ డ్రాప్‌లో తెరక్కెబోతోన్న ఈ సినిమాకి 'ఎనిమి' అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 110 కోట్ల భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో హాలీవుడ్‌ నటుడు హారిసన్‌ ఫోర్డ్‌ను విలన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌బాబు ఒక ప్రత్యేక లుక్‌లో కనిపించనున్నాడట.

హీరోయిన్‌ను కూడా బాలీవుడ్‌ నుండి దించాలని అనుకుంటున్నాడట మురుగదాస్‌. బాలీవుడ్‌ అందాల భామ శ్రద్ధాకపూర్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారమ్‌. బ్రహ్మూెత్సవం' సినిమా షూటింగ్‌ అయిపోయిన కొద్ది రోజులకే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. 'శ్రీమంతుడు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం' సినిమాతో మరో విజయాన్ని అందుకోవడానికి రెఢీగా ఉన్నాడు. ఇక మురుగదాస్‌లాంటి క్రియేటివ్‌ డైరెక్టర్‌తో మరో సెన్సేషనల్‌ సృష్టించడానికి కూడా సై అంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది ఈ సినిమా. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ మూవీ మహేష్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఫిలిం అవుతుందని తమిళ, తెలుగు సినీ వర్గాల్లో అంతా అనుకుంటున్నారు. 
 

మరిన్ని సినిమా కబుర్లు
nikhil  ready to  success