Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mahesh entry with new look

ఈ సంచికలో >> సినిమా >>

మరీ ఒక్క సినిమాకే అలా అనేస్తారా?

nikhil  ready to  success

'హ్యాపీ డేస్‌' సినిమాతో పరిచయం అయిన కుర్రహీరో నిఖిల్‌. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ, ఆ తర్వాత ఆయన లిస్టులో చాలా రోజులు గుర్తింపు ఉన్న సినిమాలే లేవని చెప్పాలి. ఎలాగోలా మెట్టు మెట్టు ఎక్కి 'స్వామి రారా' సినిమాతో మళ్లీ ఐ యామ్‌ బ్యాక్‌.. అన్నాడు. నిఖిల్‌ని ఈ న్యూ యాంగిల్‌ చూసి టాలీవుడ్‌ ఆశ్చర్యపోయింది. నిఖిల్‌ యాక్టింగ్‌లో ఈజ్‌, ఎనర్జీ, స్టడీ పెర్ఫామెన్స్‌ అద్భుతహ అని కీర్తించారు తెలుగు సినీ ప్రముఖులు. ఆ తరువాత ఈ యంగ్‌ హీరో చేసిన 'సూర్య వెర్సెస్‌ సూర్య', కార్తికేయ' సినిమాలు మంచి విజయాల్నే అందించాయి. అయితే చాలా ఆశలు పెట్టుకుని చేసిన 'శంకరాభరణం' అనుకున్న విజయాన్ని అందుకోలేదు.

సినిమా డిఫరెంట్‌ స్టైల్లో తెరకెక్కబోతోందని విపరీతంగా పబ్లిసిటీ స్టంట్‌ చేసినా చివరికి, అది పరమ రొటీన్‌ సినిమా, పైగా కంటెంట్‌ లేని సినిమా అని తేలిపోవడంతో, ఆ సినిమా రిజల్ట్‌ నిఖిల్‌కి నిరాశను మిగిల్చింది. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టి సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలని నిఖిల్‌ అనుకుంటున్నాడట. కొత్త కథల ఎంపికలో నిఖిల్‌ బిజీగా ఉన్నాడు. సక్సెస్‌లతో దూసుకుపోతున్న నిఖిల్‌ కెరీర్‌లో చిన్న 'పాజ్‌' మాత్రమే వచ్చింది. ఒక్క సినిమా ఈ యంగ్‌ హీరోకి పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. సరైన సినిమా దొరికితే, నిఖిల్‌ తానేంటో ప్రూవ్‌ చేసుకోడానికి రెడీగా వున్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
varama go to   bolly wood