Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nikhil  ready to  success

ఈ సంచికలో >> సినిమా >>

వర్మకి బాలీవుడ్‌ కాలింగ్‌

varama go to   bolly wood

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏ సినిమా చేసినా దాని వెనుక ఓ అర్థం వుంటుంది. ఎన్ని ఫ్లాపులొచ్చినా, వర్మ సంచలన దర్శకుడే. ఎంతోమంది కేవలం పబ్లిసిటీ స్టంట్లే చేస్తారు కానీ, వారికి గుర్తింపు రాదు. వర్మ అలా కాదు, ఆయన ఏం మాట్లాడినా అది సంచలనమే. హిట్‌, ఫెయిల్యూర్‌కి వర్మ సినీ రంగంలో అతీతుడేమో. సినిమా హిట్టయినా, ఫట్టయినా వర్మ ఇమేజ్‌, రేంజ్‌ తగ్గదుగాక తగ్గదు. తెలుగు సినిమాకి కొత్త టెక్నిక్‌ని అద్దిన వర్మ, బాలీవుడ్‌లోనూ సత్తా చాటాడు. తక్కువ పెట్టుబడితో పెద్ద లాభాలు సాధించే సినిమాలు చేయడంలో వర్మ తనదైన ముద్రని 'ఐస్‌క్రీమ్‌' చిత్రంతో చూపించాడు.

ఈ మధ్య వరుసగా తెలుగు సినిమాలే చేస్తున్న వర్మ, హిందీ సినిమాలపై మళ్ళీ దృష్టి సారించినట్లు సమాచారమ్‌. ఈ న్యూ ఇయర్‌లో వరుసగా కొన్ని బాలీవుడ్‌ సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు సెట్స్‌ మీదకు రావడానికి సిద్ధంగా ఉన్నాయట. వర్మ తాజా చిత్రం తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినీ రంగాల్లో ఉత్కంఠ రేపింది. మన వర్మ బాలీవుడ్‌కి వెళ్తున్నందుకు ఆనందంగానే ఉన్నా, మళ్ళీ కొంతకాలం తెలుగు సినిమాకి దూరమవుతాడేమోనని కొంచెం బాధగా ఉంటుంది కదా. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam