Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

ఇలాగైతే నీకు పెళ్ల‌వుతుందా? అని అమ్మ బెంగ పెట్టుకొంది  - నాగ‌శౌర్య‌

కుర్రాడు చాక్లెట్ బోయ్‌లా ఉంటాడు..
అందుకే ప్రేమ క‌థ‌ల‌కు సెట్ట‌యిపోతాడు!
మ‌న ప‌క్కింటి కుర్రాడే అనిపిస్తుంది...
అందుకే అత‌నికి ఈజీగాక‌నెక్ట్ అయిపోయాం!
చాలా ఈజ్‌తో న‌టిస్తుంటాడు..
ఎలాంటి మూమెంట్ అయినా ఈజీగా చేసేస్తుంటాడు!
కుర్రాడు ప్ర‌భాస్ లా ఉంటాడేమో.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది.

క‌థ‌ల్ని జాగ్ర‌త్త‌గా సెలెక్ట్ చేసుకొంటాడేమో..మంచి సినిమాలే ప‌డుతున్నాయి.

ఆ కుర్రాడే.. నాగ‌శౌర్య‌. ఇప్పుడు అబ్బాయితో అమ్మాయి అనే సినిమాతో జ‌న‌వ‌రి 1న ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా నాగ‌శౌర్య‌తో చిట్ చాట్‌.

* 2015 ఎలా గ‌డిచింది?
- హ్యాపీగానే నండి.. ఒక్క‌రోజు కూడా ఖాళీగా లేను..  రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీగా పెట్టుకొన్నా..

* 2016 ఎలా ఉండ‌బోతోంది?
- నా కెరీర్‌లో ఇది చాలా ముఖ్య‌మైన సంవ‌త్స‌రం. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కూ నేను పునాదులు మాత్ర‌మే వేసుకొన్నా. దానిపై మంచి ఇల్లు క‌ట్టుకోవాలి క‌దా?  ఈ యేడాది 5 సినిమాలు విడుద‌ల అవుతాయి. నా భ‌విష్య‌త్తుని నిర్ణ‌యించే సినిమాల‌వి..

* అబ్బాయితో అమ్మాయి ఎలా ఉండ‌బోతోంది?
-   నా కోసం త‌యారైన మొద‌టి క‌థ‌.. నా డెబ్యూ మూవీగా రావాల్సింది. కానీ  అప్పుడు చేయ‌లేక‌పోయా. ఈ సినిమా క‌థ విని.. ఇళ‌య‌రాజాగా రు బాగా ఇన్‌స్పైర్ అయ్యారు. త‌మిళంలోనూ విడుద‌ల చేయండి.. అని స‌ల‌హా ఇచ్చారు. అలా ఇళ‌య‌రాజా గారి ఆశీస్సులు అందాయి. దాంతో ఈ సినిమా పై మ‌రింత న‌మ్మ‌కం వ‌చ్చింది.

* క్యారెక్ట‌ర్ ఎలా అనిపించింది?
- నా క్యారెక్ట‌ర్‌కి ఈజీగా క‌నెక్ట్ అయ్యా.. ఇప్ప‌టి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు ఉంటుంది. ఫేస్ బుక్‌లో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌వాళ్లంద‌రికీ.. బాగా బాగా ఎక్కేస్తుంది.. 

* మీరూ ఫేస్ బుక్ లో టైమ్ గ‌డుపుతుంటారా?
- లేదండీ. ఇలాంటి వాటికి చాలా దూరం. నిజానికి నేను ఫోనే ముట్టుకోను. .

* మీకూ ఏమైనా ప్రేమ‌క‌థ ఉందా?
-  అస్సలేద్దు. ల‌వ్ లో ప‌డితే వెంట‌నే ఆ విష‌యం అమ్మ‌కు చెప్పేస్తా.. అమ్మ కి న‌చ్చితే  పెళ్లి చేసుకొంటా. 

* మీనాన్న‌గారు మీ క‌థ‌ల విష‌యంలో బాగా జోక్యం చేసుకొంటార‌ని బ‌య‌ట టాక్ న‌డుస్తుంది..
- నా క‌థ‌ల విష‌యంలో నాదే తుదినిర్ణ‌యం. నాన్న‌గారు ఎలాంటి జోక్యం చేసుకోరు. `నేను చెప్పాన‌ని నువ్వు సినిమా ఓకే చేస్తే.. ఆ సినిమా ఫ్లాప‌యిన‌ప్పుడు నువ్వు న‌న్ను క్వ‌శ్చ‌న్ చేస్త‌వ్‌.. ఆ ప‌రిస్థితి మ‌నిద్ద‌రి మ‌ధ్య రాకూడ‌దు` అంటుంటారు.

* రాశీఖ‌న్నాతో మీరు ల‌వ్‌లో ఉన్నార‌ని రూమ‌ర్‌..
- రాశీఖ‌న్నానే కాదు.. నాతో ప‌నిచేయ‌ని హీరోయిన్ల‌తో కూడా నాకు లింకులు పెట్టేస్తున్నారు... అయితే అందులో ఎలాంటి వాస్త‌వాలూ లేవు. ఇవ‌న్నీ విని `నీ గురించి అలా మాట్లాడుకొంటున్నారేంటి? ఇలాగైతే నీకు పెళ్ల‌వుతుందా` అని అమ్మ అడుగుతుంటుంది. `సినిమాల్లో ఇవ‌న్నీ మామూలే. పుకార్ల‌తో పెళ్లిళ్లు ఆగిపోతే.. ఇండ్ర‌స్ట్రీలో ఎవ్వ‌రికీ పెళ్లిళ్లు కావు..` అని చెబుతుంటా.

* ఇండ్ర‌స్ట్రీలో సెటిల్ అయిపోయిన‌ట్టే అని ఎప్పుడు అనిపించింది?
- నాతొలి సినిమా చేసిన‌ప్పుడే అనిపించింది. ఎందుకంటే.. నాకు సినిమా త‌ప్ప మ‌రో సంగ‌తి తెలీదు. హిట్ట‌యినా, ఫ్లాప‌యినా ఇక్క‌డే నిల‌దొక్కుకోవాలి.. ఇండ్ర‌స్ట్రీలోనే ఉండిపోవాలి అని గ‌ట్టిగా అనుకొని వ‌చ్చా...

* జాదుగాడు బాగా దెబ్బ‌కొట్టింద‌నుకొంటా..?
- అవునండీ.  ఇంకోసారి ఆ త‌ప్పు చేయ‌కూడ‌దు. ఆ సినిమా నాకు మామూలు గుణ‌పాఠం నేర్ప‌లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఒళ్లు కాలిపోయింది.  నాగార్జున‌, వెంక‌టేష్‌లు కూడా కెరీర్ ఆరంభంలోనే మాస్ పాత్ర‌లు చేయ‌లేదు. మెల్ల‌మెల్ల‌గా మాస్ కోణం బ‌య‌ట‌పెట్టారు. నాకెందుకంత తొంద‌ర వ‌చ్చింది అనుకొన్నా..

* మీ సినిమా అంటే ముద్దు స‌న్నివేశాలు ఉండాల్సిందేనా?
- ముద్దులు ఎన్నిసార్లు పెట్టుకొన్నానండీ బాబూ. జాదుగాడు కోసం త‌ప్ప‌లేదు. అబ్బాయితో అమ్మాయిలోనూ అలాంటి సీన్లు లేవు. ఇక‌పై ముద్దు సీన్ల‌కూ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకొన్నా. ఎందుకంటే జాదుగాడు వ‌ర్కవుట్ కాలేదు క‌దా..?

* క‌ల్యాణ వైభోగ‌మే ఎలా ఉండ‌బోతోంది?
- మీరంతా క‌ల‌సి ఓ పెళ్లికి వెళ్లి హంగామా చేస్తే ఎలా ఉంటుంది?  ఆసినిమా అలా ఉంటుంది. నా కెరీర్‌కి మ‌రో ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది..

* 2016లో మీరు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకొంటున్నాం.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ...

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka