Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: నేను శైలజ 
తారాగణం: రామ్‌, కీర్తి సురేష్‌, సత్యరాజ్‌, రోహిణి, నరేష్‌, ప్రగతి, ప్రిన్స్‌, శ్రీముఖి, కృష్ణ చైతన్య, ప్రదీప్‌ రావత్‌, సుడిగాలి సుధీర్‌ తదితరులు 
చాయాగ్రహణం: సమీర్‌రెడ్డి 
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 
నిర్మాణం: స్రవంతి మూవీస్‌ 
దర్శకత్వం: కిషోర్‌ తిరుమల 
నిర్మాత: స్రవంతి రవికిషోర్‌ 
విడుదల తేదీ: 1 జనవరి 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
చిన్నప్పటినుంచీ లవర్‌బాయ్‌ అయిన హరి (రామ్‌) లవ్‌ ప్రపోజల్‌ చేస్తే చాలు, అమ్మాయిలంతా 'సారీ' చెప్పేస్తారు. ఇక తాను ప్రేమకు సరిపడనని హరి అనుకునే సమయంలో, అతనికి శైలజ (కీర్తి సురేష్‌) పరిచయమవుతుంది. ఆమె అతన్ని ఇష్టపడుతుంది. హరి, శైలజ ప్రేమలో పడిపోతాడు. అయితే నువ్వంటే ఇష్టమేగానీ, నిన్ను ప్రేమించాలంటే కుదరదని చెబుతుంది శైలజ. షాక్‌కి గురవుతాడు హరి. శైలజను ఎలాగైనా ప్రేమలో పడేయాలనుకుంటాడు. ఇక అక్కడి నుంచి ఆమె ప్రేమకోసం హరి విశ్వ ప్రయత్నాలు మొదలెడతాడు. అవేంటో తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
హీరో రామ్‌కి ఇది డిఫరెంట్‌ సినిమా అని క్లియర్‌గా చెప్పవచ్చు. ఎప్పుడూ సూపర్‌ ఎనర్జీతో తెరపై కన్పించే రామ్‌, సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎక్కడా హీరోయిజం హద్దులు దాటలేదు, బీభత్సమైన డైలాగులు, పవర్‌ఫుల్‌ పంచ్‌లు లేవు. సింపుల్‌గా, క్లాస్‌గా, స్ట్రాంగ్‌గా రామ్‌ చాలా బాగా చేశాడు. నటుడిగా అతని కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ అనవచ్చు. 
హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తెలుగు తెరకు ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నటనలోనూ తన సత్తా చాటింది. హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ బాగున్నాయి. తెలుగు తెరకు మంచి హీరోయిన్‌ దొరికింది. మెచ్యూర్డ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. హీరోయిన్‌ తండ్రిగా సత్యరాజ్‌ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి అతను పెద్ద ప్లస్‌ పాయింట్‌. ప్రదీప్‌ రావత్‌ డిఫరెంట్‌గా కామెడీ పాత్రలో కనిపించి మెప్పించాడు. ప్రిన్స్‌, శ్రీముఖి తదితరులు బాగానే చేశారు. కృష్ణ చైతన్య ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధుల మేర బాగానే చేశారు. 
కథ మరీ కొత్తదని చెప్పలేం. కానీ కొత్తగా అనిపిస్తుంది. కథనం విషయంలో కాస్త కొత్తదనం వైపు వెళ్ళినట్టే వెళ్ళి, మళ్ళీ రొటీన్‌ ట్రాక్‌లోకి సినిమాని తీసుకెళ్ళాడు డైరెక్టర్‌. డైలాగ్స్‌ బాగున్నాయి. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ కాస్త అవసరమనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలాబాగుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమా చాలా రిచ్‌గా, క్లాస్‌గా తెరకెక్కింది. నిర్మాణపు విలువలు బావున్నాయి. 

క్లాస్‌ సినిమాని చాలా క్లాస్‌గా డీల్‌ చేయడంలో కిషోర్‌ తిరుమల సక్సెస్‌ అయ్యాడు. రామ్‌ సినిమాల్లో సహజంగా కన్పించే మాస్‌ డైలాగ్‌లకు భిన్నంగా క్లాస్‌ డైలాగులతో రామ్‌లోని సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ని చూపించాడు కిషోర్‌ తిరుమల. నేల విడిచి సాము చేయకుండా, అందుబాటులో వున్న వనరుల్ని అద్భుతంగా వినియోగించుకుని రామ్‌ నుంచి డిఫరెంట్‌ సినిమాని తీసుకొచ్చాడీ యంగ్‌ డైరెక్టర్‌. డైలాగ్స్‌తోనూ, డైరెక్షన్స్‌తోనూ ఆకట్టుకున్న ఈ దర్శకుడు సెకెండాఫ్‌లో కథనాన్ని పరుగులు పెట్టించలేకపోవడం కాస్త ఇబ్బంది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం దర్శకుడిగా సక్సెస్‌ అయినట్లే. ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌ కాస్త స్లో అనిపించినా ఓకే. క్లాన్‌ని మెప్పించి, అలాగే మాస్‌ని కూడా ఆకట్టుకునేలా వున్న ఈ చిత్రానికి పబ్లిసిటీ అదనపు బలం. సినిమాకి లభిస్తోన్న పాజిటివ్‌ టాక్‌కి పబ్లిసిటీ మరింత తోడైతే, సినిమా ఘనవిజయం సాధించడం ఖాయం. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
ఈ శైలజతో క్లాస్‌గా కొట్టాడు గురూ 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
interview