Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

కడలి

 

 గతసంచికలో ఏం జరిగిందంటే.....http://www.gotelugu.com/issue142/402/telugu-serials/kadali/kadali/


హమ్మయ్య చందూ వచ్చాడు.  తనతో నా ఆలోచనలు పంచుకుంటే నాకు కొంచెం రిలీఫ్ .

కళ్ళు తెరిచాను.  ఏం చేస్తున్నావు డియర్ ఆర్ యు ఓ కే   అంటూ వచ్చి మంచం చివర నాకు దగ్గరగా కూర్చున్నాడు. తను కూర్చోడానికి చోటు ఇస్తూ  కొంచెం జరిగి ఓ కే అన్నట్టుగా నవ్వాను.

చంద్ర నాకు ఇంకా దగ్గరగా జరిగి కుడి చేయి నా నడుం మీదుగా తిప్పి పరుపు మీద కొద్దిగా వాలి ప్రేమగా అడిగాడు బాగా అలసిపోయావా ?

అవునన్నట్టు తలాడిస్తూ '''  నీకోసమే ఎదురు చూస్తున్నాను '' అన్నాను.

చంద్ర నవ్వి నా నుదిటి మెడ చుంబిస్తూ  "" కోర్టుకి వెళితే నేను గుర్తు రానంతగా ఇన్వాల్వ్  అయిపోతావుగా'' అన్నాడు.

చంద్ర చేయి అందుకుని చెంప మీద రాసుకుంటూ అన్నాను ''ఇవాళ మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయాను.''

''ఎందుకు ఎనిథింగ్  రాంగ్?''   అన్నాడు నా మొహం మిద పడిన వెంట్రుకలు సర్దుతూ.

అ a స్పర్శకి చలించి పోతూ మరింత దగ్గరగా జరిగాను.

చంద్ర నా ప్రాణం, నా సర్వస్వం అతనికి ఎప్పుడో ధారాదత్తం చేశాను.  అతని మంచితనం, సంస్కారం , ఆధునిక భావాలూ నన్ను మొదటి పరిచయం లోనే ఆకట్టుకున్నాయి.  అందుకే అసలు పెళ్ళే  చేసుకోవద్దనుకున్న నేను పరిచయం అయిన స్వల్ప కాలంలోనే అతను చేసిన ప్రపోజల్ అంగికరించాను.

అప్పటినుంచి ఇప్పటి వరకు తప్పు చేసాను అనే ఆలోచనకి తావు లేకుండా నన్ను అపురూపంగా, ఎంతో గౌరవంగా చూసుకుంటున్నాడు. మా మధ్య ఎప్పుడూ అసమానతల ప్రసక్తి రాలేదు. అహంకారాలు తలెత్తలేదు. పరస్పరం  గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ , అనురాగం, ప్రేమా కలిసిన అన్యోన్య దాంపత్యం మాది. చంద్రని భర్తగా పొందిన నేను మగవాళ్ళలో దుర్మార్గులు ఉంటారని అందులో కూడా మరీ ఇంత దారుణంగా ఉంటారని ఉహించలేను.. అలాంటివాడిని భర్తగా పొందిన ఆ అమ్మాయి ఎంత  దురదృష్టవంతురాలు!

హలో ఏంటి ఆలోచిస్తున్నావు? నా మొహం మిద చిటికెలు వేస్తూ అడిగాడు.

నేను చప్పున అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుని అన్నాను నిన్ను భర్తగా పొందడం నా అదృష్టం చంద్రా. మన సహస్రకి కూడా నీ అంత మంచివాడికే ఇవ్వాలి.

నా వైపు చిత్రంగా చూసాడు. ఏమైంది సంయు అన్నాడు మార్దవంగా.

ఇవాళ ఒక భయంకరమైన కేసు చదివాను. మనసంతా పాడయింది.

ఏం కేసది అలాంటివి ఎందుకు టేకప్ చేస్తావు? ఏదన్నా మర్డర్ కేసా?

అంతకన్నా భయంకరమైనది.

ఏంటది? భ్రుకుటి ముడి వేసాడు.

హైదరాబాదులో  బి. టెక్ చేసి అమెరికాలో ఎం. ఎస్ చేసి, పి  హెచ్ డి కూడా చేసి  ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న ఒక కుర్రాడు హైదరాబాదు జే ఎన్  టి యు లో  బి టెక్ చేసిన అమ్మాయి, వీళ్ళిద్దరికీ పెద్దవాళ్ళు జాతకాలు, అటేడు తరాలు, ఇటేడు తరాల కుటుంబ నేపధ్యం చూసి మరీ పెళ్లి చేసారు. పెళ్లి కాగానే అమ్మాయిని తీసుకుని అతను అమెరికా వెళ్ళిపోయాడు.  పది రోజులు ఆ అమ్మాయిని ప్రేమానురాగాల్లో ముంచి తెల్చాట్ట. ఆమె అందం మీద కవిత్వాలు చెప్పి ఇంత అందం నాకు దక్కడం అదృష్టం అన్నట్ట.   ఆ అమ్మాయి అతని ప్రేమ చూసి మురిసిపోయి, ఆ మత్తులో  తన ప్రేమ కధ చెప్పేసిందిట.

ఓ ఆ అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరినైనా ప్రేమించిందా? అడిగాడు చంద్ర.

అందులో విశేషం  ఏముంది? అది సహజం కదా

మరి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

అతనిది వాళ్ళ కులం కాకపోడం ఒక కారణం అయితే  ఆర్ధిక స్థితి కూడా అమ్మాయి స్థాయికి తగదని అమ్మాయి తండ్రి పెళ్ళికి ఒప్పుకోలేదట.  ముందు ఇష్టంలేని పెళ్లి చేసుకోవాల్సి రావడంతో బాధ పడిందిట. తరవాత చేసుకున్న వాడి ప్రేమకి పడిపోయింది. ఆ పెళ్లి కాకపోవడం మంచిదిగా భావిస్తున్నానని  భర్తకి  చెప్పిందిట. అక్కడినుంచి సీను మారిపోయింది . ఆ విషయం చెప్పినప్పుడు ఆ సంబంధం తప్పి పోయి ఆమె తనకి దక్కడం అదృష్టం అన్నాడుట. సరిగ్గా వారం తరవాత నుంచి హెరాజ్ చేయడం మొదలు పెట్టాడట. మాములుగా కాదు, మనం ఉహించలేనంత భయంకరంగా. తన స్నేహితులను తీసుకొచ్చి వాళ్లతో పడుకోమన్నట్ట. ప్రతిఘటిస్తే కొట్టడం. అన్నిటికన్నా దారుణం ఆమె స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు  మార్చుకుంటున్నప్పుడు  రహస్యంగా ఫోటోలు తీసి, నెట్లో పెట్ట బోతుంటే aఆ అమ్మాయి లక్కీగా గమనించి వాడితో దెబ్బలాడి, ఆ కెమెరా లాగేసుకుని పోలిస్ కంప్లైంట్ చేసి, వాడిని అరిస్ట్ చేయించి, వాళ్ళ సహాయంతో ఇండియా పారిపోయి వచ్చింది.  ఇక్కడకు వచ్చిన దగ్గరినుంచి అతని పేరెంట్స్ ఆ అమ్మాయిని బెదిరిస్తూ, నానా కష్టాలు పెడుతున్నారుట. నిన్న నా దగ్గరకు వచ్చి ఇదంతా చెప్పి ఈ కేసు టేకప్ చేసి తనకి న్యాయం చేయమని బతిమాలింది.  నిన్న ఆమె, ఆమె తల్లి, తండ్రులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారని వాడి కుటుంబ సభ్యులకి ఎలా తెలిసిందో అప్పుడే నాకు ఉదయం నుంచి మూడు సార్లు ఫోన్ చేసారు. కేసు టేకప్ చేయకుండా నన్ను కోనేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ అమ్మాయి ఎక్కడుంది పేరెంట్స్ దగ్గర లేదా?

పేరెంట్స్ దగ్గరే ఉంది.  ఆ కుర్రాడి పేరెంట్స్ కూడా  వాళ్ళింటికి దగ్గరగానే ఉంటారుట ఖర్మ కాలి.

కానీ కేసు అమెరికా కోర్ట్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయగలరు?

లేదు అరెస్ట్ చేసి పాస్ పోర్ట్ సిజ్ చేసారట.. తరవాత  వాళ్ళు ఇండియా ఎంబసీతో  మాట్లాడి కేసు మన దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు.

ఓ తల  పంకిస్తూ అన్నాడు పిచ్చిది కాకపోతే అంత మైకం ఏంటి? మగవాడికి మాత్రం పెళ్లి కాకముందు అఫైర్స్ ఉండవా? పాస్ట్ మర్చిపోవడం క్షేమం . అయినా ఏ మాత్రం సంస్కారం ఉన్నవాడైనా ఆ అమ్మాయి నిజాయితీగా చెప్పినందుకు సంతోషించాలి.  ఏవిటో మన వివాహ వ్యవస్థని ఇతర దేశాల వాళ్ళు ఎంతగా గౌరవిస్తున్నారో అంతగా దిగజారిపోతోంది.  తప్పు ఎవరిదో నిర్ణయించడం కష్టమై పోతోంది.

నిర్ణయించడానికి ఏం ఉంది చంద్రా ! ఇందులో అమ్మాయి తప్పు ఏం ఉంది?  ఎవరినో పెళ్లి చేసుకుంటా కదా అని ఆడపిల్లలు ప్రేమించకుండా ఉంటారా?

చంద్ర తల విదిలిస్తూ అన్నాడు. పోనీలే మనసు పాడు చేసుకోకు. నీ ప్రొఫెషన్ లో ఇలాంటివి మాములేగా టేక్ ఇట్ ఈజీ  అన్నట్టు మర్చిపోయాను నీకో గుడ్ న్యూస్ నన్ను ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

ఏంటది కుతూహలంగా చూసాను.
మన సహస్రకి మంచి సంబంధం వచ్చింది.

అలాగా ఎవరు? నాలో ఉన్న అందోళన చేత్తో తీసినట్టు పోయింది.

నా స్నేహితుడు అశోక్ తెలుసుగా. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఎం ఎస్ చేసి , ప్రస్తుతం అదే యూనివర్సిటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాడు. ఫైగా  పి . హెచ్.డి  చేస్తున్నాడు కూడా. మన సహస్రని  ఏదో చానెల్ లో చూసాడట. తమాషా తెలుసా అశోక్ వాడికేదో మాచ్ చూసి అమ్మాయి ఫోటో మెయిల్ చేసాట్ట. ఆ కుర్రాడు మన సహస్ర వివరాలు ఇచ్చి ఈ అమ్మాయి నాకు నచ్చింది వివరాలు తెలుసుకోండి అని చెప్పాడుట.

నేను ఉత్సాహంగా అడిగాను. సహస్ర తెలుగు చానెల్ లో వస్తుంది అతను అక్కడ తెలుగు ఎలా చూశాడు

అదే కదా చిత్రం  అందుకే అంటారు పెద్ద వాళ్ళు రాసి పెట్టి ఉంటే ఎక్కడ ఉన్నా కలుస్తారని. అక్కడ తెలుగు చానెల్స్ వస్తాయిట. అది కూడా ఎవరో ఫ్రెండ్ ఇంట్లో పార్టికి వెళ్ళినపుడు చూసాడట. తనకి బాగా నచ్చిందని ఆ ఎవరో డిటైల్స్ తెలుసుకోమని అన్నట్ట.

ఎంత తమాషా! ఎక్కడ అమెరికా! ఎక్కడ ఇండియా!  అతను పార్టీలో తెలుగు చానెల్ చూడడం ఏంటి? అతను చూసిన సమయంలోనే సహస్ర కనిపించడం ఏంటి?  దిన్నేనా మారేజేస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది.

నా భావాలు గమనించిన వాడిలా అన్నాడు చంద్ర స్వర్గంలో ఎవరు ఎవరికీ భార్య కావాలో, ఎవరు ఎవరికీ భర్త కావాలో నిర్ణయించడం వల్లనే ఎక్కడెక్కడి వాళ్ళు కలుసుకుని, జీవితాలు కలుపు కుంటారు. ఇది నిజం కదా .

నేను నవ్వి అన్నాను అందుకేగా నా క్లయింట్ గా  వచ్చి భర్తగా మారావు నువ్వు అన్నాను.

చంద్ర సమాధానంగా మందహాసం చేసాడు.

అసలు పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నదాన్ని ఎలా నీ మాటల గారడిలో పడ్డానో నాకే తెలియదు.

నా మాటలకి చంద్ర కళ్ళల్లో మెరిసిన కాంతి చూస్తుంటే నేను తన భార్యని అయినందుకు తనెంత గర్వంగా ఫీలవుతున్నాడో అర్ధం అయింది నాకు.

ఒక్కసారి పాతికేళ్ళ వెనక్కి నా మనసు పరిగెత్తింది. అమ్మ నెత్తి నోరు  కొట్టుకుని పెళ్లి చేసుకోవే అంటూ మొత్తుకున్నా వినకుండా ముప్పై ఏళ్ళు కన్యగా బతికాను.

చంద్ర నా జీవితం లోకి చాలా యాక్సిడెంటల్ గా వచ్చాడు. ఒకమ్మాయి తరపున నేను తీసుకున్న విడాకుల కేసులో చంద్ర విక్టిమ్ . పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుని, శోభనం నటి రాత్రే నువ్వంటే నాకిష్టం లేదు నేను వేరే కుర్రాడిని ప్రేమించాను నాకు విడాకులిస్తే అతనితో వెళ్ళిపోతాను అని తెగేసి చెప్పింది ఆ అమ్మాయి. నిర్ఘాంతపోయిన చంద్ర ముందు ఆవేశంతో మరి ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నావు? నా తల్లి తండ్రులకి నేనేమని చెప్పాలి అని రెచ్చిపోయి అరిచిన చేసేదిలేక చేయని నేరానికి దోషిగా నిలబడ్డాడు. చివరికి పరస్పర అంగీకారంతో నా దగ్గరకు వచ్చారు. నేను తప్పు అతనిదే అనుకుని ఆవేశపడిపోయాను. కానీ అతను నా దగ్గరకు పెర్సనల్ గా వచ్చి జరిగింది వివరించాడు.  అది విన్నాక అతని సంస్కారం నన్ను ముగ్ధురాలిని చేసింది.   సరిగ్గా వాళ్ళకు ఆరు నెలల్లో విడాకులు మంజూరు చేయించాను. అంత త్వరగా విడాకులు పొందిన కేసు అదే.   a తరవాత చంద్రకి, నాకు మధ్య స్నేహం,  క్రమంగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలగడంతో మా పరిచయం పెళ్ళికి దారి తీసింది.

ఏంటి ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళావా చంద్ర మాటతో ఆలోచనల నుంచి  తెప్పరిల్లాను .

స్వచ్చంగా, కడిగిన ముత్యంలా వెలుగుతున్న అతని కళ్ళల్లోకి చూస్తూ అనుకున్నాను. ఒక  అణ్వాయుధం ప్రపంచశాంతిని కోరుకుంటే, మరో అణ్వాయుధం సర్వ నాశనం కోరుకుంటుంది.  ఒకే రూపం కలిగిన రెండు ఆయుధాలు విభిన్నంగా ఉపయోగపడడానికి కారణం అది  తయారు చేసిన మేధావా, అది ఉపయోగించే వాళ్ళ మనస్తత్వమా ?

భారతీయ వివాహవ్యవస్థ చాలా బలమైంది అనుకునే వాళ్ళు ఈ పోస్ట్ మాడర్నిజం ద్వారా ఏర్పడిన నూతన వైవాహిక వ్యవస్థలో ఏర్పడిన పగుళ్ళు చూసి ఏమంటారు?

ఎక్కడికి వెళ్తోంది ఈ సమాజం< ఏం జరుగుతోంది?

దీర్ఘంగా నిట్టుర్చాను.

ఎక్కువగా ఆలోచించకు సంయు ముందు  మన అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించు అన్నాడు చంద్ర.

నేను నవ్వి అవును ఆలోచించాలి అన్నాను.

నిజంగా నాకు చాల ఆశ్చర్యంగా అనిపిస్తోంది. aఆ మధ్య మనం చాలా కాజువల్ గా అనుకున్నాం కదా సహస్రకి ఇరవై నాలుగేళ్ళు వస్తున్నాయి పెళ్లి చేయాలి అని,

చంద్ర మాటలకి తల ఊపాను .

దీనినే సంకల్ప బలం అంటారేమో ఇలా అనుకోగానే అలా సంబంధం వచ్చింది. సహస్ర చాలా అదృష్టవంతురాలు.

ఆ  మధ్య నా కో లాయర్ జానకి కూడా చూచాయగా అడిగింది సహస్రకేమన్నా  సంబంధాలు చూస్తున్నారా అని. తను కూడా వాళ్ళ అబ్బాయి వివరాలు చెప్పింది. నిజానికి నేను ఆ రోజు సీరియస్గా  తీసుకోలేదు.   సో సహస్ర పెళ్లి విషయంలో శ్రద్ధ చూపించాల్సిన సమయం వచ్చిందనమాట .

చంద్ర నా పక్కనుంచి లేస్తూ ఉత్సాహంగా అన్నాడు ఈ శుభవార్త సహస్రకి నువ్వు చెప్తావా నేను చెప్పనా? సర్ప్రైజ్ కదా తనకి.

నేను నవ్వాను. చంద్ర నాకెందుకో ఎప్పుడూ చిన్న పిల్లాడిలా అనిపిస్తాడు. ఇపుడు కూడా అలాగే అనిపించాడు.

ముందు దాని అభిప్రాయం తెలుసుకోవాలిగా ఆ తరవాత చెప్పాలి అన్నాను.

దాని అభిప్రాయం తీసుకోవాలా మనం చూసి ఓ కే అంటే సరిపోదా

ఇపుడు నేను ఆశ్చర్యపోయాను. అదేంటి చంద్రా  ఆధునిక యువతి మన ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటుందా ?

అంటే  ఒప్పుకోదంటవా    చంద్ర స్వరంలో అప్పుడే భయం .

మృదువుగా అన్నాను అలా అనికాదు ముందు దాని అభిప్రాయం తెలుసుకోవడం మన కర్తవ్యం అంటున్నాను.

చంద్ర మోహంలో అప్పటికప్పుడే నీలి మబ్బులు అవరించడం గమనించి  ఓదార్పుగా అన్నాను ముందు ఫ్రెష్ అయిరా అలా బాక్ యార్డ్ లో కుర్చుందాము సత్యవతిగారు పకోడీ చేసినట్టున్నారు. అవి తిని, టి తాగి కబుర్లు చెప్పుకుందాం .

సరే అంటూ లేచి బాత్రుం లోకి వెళ్లి పోయాడు చంద్ర. నేను లేచి డైనింగ్ హాల్ వైపు నడిచాను. 

 

..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam